నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్ఈ ప్రాజెక్టుల సమయాన్ని పొడిగించిన ఎంఎన్ఆర్ఈః లాక్‌డౌన్ ఆ తరువాత 30 రోజుల వరకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు
- అన్ని పునరుత్పాదక ఇంధన అమలు ఏజెన్సీలలో కోవిడ్-19 లాక్‌డౌన్ అనివార్యపు
చర్యగా అమలవుతుంది
Posted On:
21 APR 2020 3:11PM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి రావడంతో కేంద్ర
నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (ఎంఎన్ఆర్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పునరుత్పాదక ఇంధన అమలు సంస్థలు ఆర్ఈ ప్రాజెక్టుల సమయానికి పొడిగింపులను మంజూరు చేయాలని ఎంఎన్ఆర్ఈ ఆదేశించింది. దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నన్ని రోజులతో పాటు అది ముగిశాక 30 రోజుల వరకు సాధారణపు పరిస్థితుల కాలం కింద ఈ పొడిగింపును వర్తింపజేయాలని తెలిపింది. ఈ నెల 17న ఇందుకు సంబంధించిన ఎంఎన్ఆర్ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. ఇది అన్ని ప్రాజెక్టులకు సమానంగా వర్తింపజేయాలని కేంద్ర నూతన, పునరుత్పాదకఇంధన వనరుల శాఖ తన తాజా ఆదేశాలలో పేర్కొంది. ఈ పొడింగిపునకు సంబంధించి మళ్లీ విడిగా ఒక్కొక్క ప్రాజెక్టును సమీక్షిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. పొడిగింపునకు గాను తగిన ఆధారాలను చూపమని అడగాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది.
లాక్‌డౌన్ కిందే అన్ని ఏజెన్సీలు..
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి కారణంగా తమ పరిధిలోని అన్ని పునరుత్పాదక ఇంధన అమలు ఏజెన్సీలు తప్పనిసరి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నట్టుగా భావించాలని కేంద్రంలో నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ తెలిపింది. దేశంలోని పునరుత్పాదక ఇంధన విభాగాలు (రాష్ట్రాల విద్యుత్ / ఇంధన విభాగాల కింద ఉంటూ పునరుత్పాదక ఇంధనం వ్యవహారాలను నిర్వహస్తున్న ఆయా ఏజెన్సీలను) కూడా కోవిడ్-19 వైరస్ మహమ్మారి కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్ కిందనే ఉన్నట్టుగా పరిగణించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
ఈ కారణంగా ఆర్ఈ ప్రాజెక్టుల గడువు సమయానికి పొడిగింపులను మంజూరు చేయాలని సూచించింది.
గతంలోనే ఇందుకు సంబంధించి కొన్ని ఆదేశాలు..
దేశంలో లాక్‌డౌన్ కారణంగా కాల పొడిగింపును మంజూరు చేయాలని ఆర్ఈ ప్రాజెక్టుల డెవలపర్స్ నుంచి అందిన విజ్ఞప్తి మేరకు మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌తో పాటుగా సాధారణ పరిస్థితి ఏర్పడేంత వరకు తమకు కాల పొడిగింపును మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అంతకు ముందు మార్చి 20న ఎంఎన్ఆర్ఈ ఇందుకు సంబంధించిన కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఎస్ఈసీఐ, ఎన్‌టీపీసీ సంస్థలతో పాటుగా అన్ని రాష్ర్టాలు, యూటీలకు చెందిన యంత్రాంగానికి విద్యుత్తు, ఇంధన, పునరుత్పాదక ఇంధన వనరుల (ఆర్ఈ) శాఖలకు చెందిన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలిస్తూ.. చైనా లేదా మరే దేశంలోనైనా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ముడి సరుకుల సరఫరా గొలుసులో అంతరాయం కలుగుతోందని డెవలపర్లు సూచిస్తూ అందుకు తగిన సాక్ష్యాలను లేదా పత్రాలను ఆధారంగా చూపితే వారి ఆర్ఈ ప్రాజెక్టులకు సమయం పొడిగించవచ్చని సూచించింది. ఆ తరువాత ఇప్పడు పరిస్థితిలో మార్పు కారణంగా దేశంలోనే లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ప్రభుత్వం తాజా పొడిగింపు ఆదేశాలను జారీ చేసింది.
****
(Release ID: 1616742)
Visitor Counter : 215