పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

దేశంలో కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్న జిల్లా, గ్రామ‌స్థాయి స్థానిక పాల‌నాయంత్రాంగాలు

స్థానిక ప్ర‌జ‌ల‌కు ప్రాథ‌మిక ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల‌లోకి ప్ర‌వేశించే, బ‌య‌ట‌కు వెళ్లే వారికి వైద్య ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో క్ర‌మంత‌ప్ప‌కుండా పారిశుధ్య చ‌ర్య‌లు, క్వ‌రంటైన్ కేంద్రాల ఏర్పాటు, ప్రొక్యూర్ మెంట్ సెంట‌ర్ల త‌నిఖీ వంటి చర్య‌లు తీసుకుంటున్నారు.

Posted On: 21 APR 2020 12:44PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి జిల్లా , గ్రామ స్థాయిలో స్థానిక పాల‌నాయంత్రాంగాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి.వీరు అనుస‌రిస్తున్న కొన్ని ఉత్త‌మ ప‌ద్ధ‌తుల‌ను ఇత‌రులు కూడా   ఉత్త‌మ న‌మూనాలుగా వాడ‌వ‌చ్చు. అవి--

కర్ణాటక: గ్రామస్తులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించడానికి,  రామనగర జిల్లా కనకపుర తహసీల్‌కు చెందిన ఉయంబల్లి హ్రం పంచాయతీలోని ఆశా కార్మికులకు ,గ్రామ పంచాయతీ థర్మల్ స్కానర్‌ను అందించింది.

 

    


పంజాబ్:  పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలోని హరా గ్రామానికి చెందిన సర్పంచ్ త‌మ పంచాయితీలో వైర‌స్ వ్యాప్తి  చెంద‌కుండా చూసేందుకు స్ఫూర్తిదాయక చ‌ర్య‌లు తీసుకున్నారు. కోవిడ్ -19 వ్యాప్తిని నిరోధించే చ‌ర్య‌ల‌ను ప్ర‌తి కుటుంబానికి వివ‌రించేందుకు ఇంటింటికీ తిరిగి ప్ర‌చార కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆమే స్వ‌యంగా ముఖానికి తొడుక్కునే మాస్కుల‌ను త‌యారు చేశారు. గ్రామానికి అన్ని వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర గ్రామాల‌ను  అనుసంధానం చేసే రోడ్ల‌ను మూసివేశారు.స‌ర్పంచ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను ఐసొలేష‌న్ కేంద్రంగా మార్చారు.
రాజ‌స్థాన్ :   కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు నాగౌర్ జిల్లాలోని జ‌య‌ల్ గ్రామ పంచాయితీ ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది.
పారిశుధ్యం: గ‌్రామంలో క్ర‌మం త‌ప్ప‌కుండా పారిశుధ్య కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. సోడియం హైపో క్లోరైట్ ను గ్రామాల‌లో స్ప్రే చేస్తున్నారు.
గ్రామ పంచాయితీలో మాస్క్‌లు పంపిణీ చేస్తున్నారు
గ్రామ‌పంచాయితీ అధికారులు, సామాజిక సంస్థ‌లు రేష‌న్ పంపిణీ చేస్తున్నారు. గూడు లేని వారికి వండిన ఆహారాన్ని అంద‌జేస్తున్నారు.
స‌హాయం అందించే శిబిరాల‌ను ఉన్న‌తాధికారులు ఎప్ప‌టికప్పుడు త‌నిఖీ చేస్తున్నారు
అవ‌స‌ర‌మైన వారికి వండిన ఆహారం, ఇత‌ర ఆహార‌ప‌దార్థాలు,  అందించాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.
ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా గ్రామ పంచాయ‌తీ పాఠ‌శాల‌ను , క్వారంటైన్ కేంద్రంగా గ్రామ‌పంచాయ‌తీ మార్చింది.
నిత్యావ‌స‌రాల పంపిణీతోపాటు, వ‌దిలివేసిన ప‌శువుల‌కు మేత‌ను సామాజిక సేవా సంస్థ‌ల‌ద్వారా అంద‌జేయ‌డం జ‌రుగుతోంది.
క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే ఉండాల‌ని సూచిస్తూ ప్ర‌భుత్వం జారీచేసిన సూచ‌న‌ల‌ను ప్ర‌జ‌ల‌కు విస్తృతంగా తెలియ‌జేస్తూ బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో బోర్డులు ఏర్పాటు చేసి లౌడ్ స్పీక‌ర్లు, ఇత‌ర సాధనాల ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డం జ‌రిగింది.

Description: WhatsApp Image 2020-04-04 at 10.24.12 AM (1).jpegDescription: WhatsApp Image 2020-04-04 at 10.19.57 AM.jpeg

Description: WhatsApp Image 2020-04-04 at 10.22.02 AM.jpegDescription: WhatsApp Image 2020-04-04 at 10.21.01 AM.jpeg


తెలంగాణ‌:
జిల్లా క‌లెక్ట‌ర్లు గ్రామాల‌లోని ప్రోక్యూర్‌మెంట్ సెంట‌ర్ల‌ను ఆకస్మికంగా సంద‌ర్శించి , ఈ కేంద్రాల‌లో ఏవైనా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయేమో త‌నిఖీ చేస్తున్నారు. యాదాద్రి, భైంసా క‌లెక్ట‌ర్లు ప‌లు గ్రామాల‌కు వెళ్లి అక్క‌డి ప్రోక్యూర్‌మెంట్ సెంట‌ర్ల‌ను సంద‌ర్శించి ప‌రిస్థితిని ప‌రిశీలించారు. ధాన్యం కొనుగోలుకు సంబందించి పార‌ద‌ర్శ‌క‌మైన‌, జ‌వాబుదారీ విధానం ఉండేలా చూస్తామ‌ని రైతుల‌కు హామీ ఇచ్చారు.

 

 
 


హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌:

కిన్నౌర్ జిల్లా ,దుని పంచాయతీకి  చెందిన మహిళా మండళ్లు, తమ సొంత డబ్బుతో ఫేస్ మాస్క్‌లు కుట్టాయి. ఈ మహిళలు రోజుకు 200 కు పైగా ఫేస్ మాస్క్‌లు  తయారుచేసి పంచాయతీలో ప‌రిధిలోని  వారికి, ముఖ్యంగా పేద కార్మికులకు పంపిణీ చేస్తున్నారు.

కిన్నౌర్ జిల్లా రోపా వ్యాలీ  లోని  గోబాంగ్ గ్రామ పంచాయతీ, అన్ని బహిరంగ ప్రదేశాలను, పంచాయతీ ప‌రిధిలోని  బ‌హిరంగ ప్ర‌దేశాల‌ను శుభ్రపరిచింది. సాంఘిక దూరం,  లాక్‌డౌన్‌ను  ఖచ్చితంగా పాటించాల‌ని  కోరుతూ గ్రామస్తులకు ఎప్ప‌టిక‌ప్పుడు  పంచాయతీ ప్రేర‌ణ‌క‌లిగిస్తోంది..

 

Description: C:\Users\Pooja Sharma\AppData\Local\Microsoft\Windows\INetCache\Content.Word\Screenshot_2020-04-19-20-49-42-99.pngDescription: C:\Users\Pooja Sharma\Desktop\Duni.jpg

 

*****



(Release ID: 1616709) Visitor Counter : 170