విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో సహాయ కార్యక్రమాలకు చేయూత నిస్తున్న కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్.ఈ.సి.
76 వేల మందికి పైగా పేదవారికి ఆహారం, రేషన్ సామగ్రి సరఫరా చేసిన కేంద్రప్రభుత్వరంగ సంస్థ.
ప్రతీ రోజు 500 ఆహార పొట్లాలను అందించడానికి ఢిల్లీ పోలీసుతో కలిసి పనిచేస్తున్న నవరత్న ఎన్.బి.ఎఫ్.సి.
గతంలో ప్రధానమంత్రి కెర్స్ నిధి కి 150 కోట్ల రూపాయల విరాళం అందజేసింది.
Posted On:
21 APR 2020 11:18AM by PIB Hyderabad
కోవిడ్-19 కారణంగా శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు; జాంనగర్ నుండి షిల్లాంగ్ వరకు భారతదేశంలోని వివిధ ప్రాంతాలల్లో రోజువారీ కూలీలు, ముఖ్యంగా వలసదారులు అనేక మంది ఆహారం అందుబాటులో లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితి పట్ల ఆందోళన చెందిన ఆర్.ఈ.సి. ఫౌండేషన్, లాక్ డౌన్ కాలంలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్న 76 వేల మంది రోజువారీ కూలీలు, వారి కుటుంబ సభ్యులకు ఆహార పొట్లాలు, వివిధ రకాల వినియోగ వస్తువులు, మాస్కులు, సానిటైజెర్లతో పాటు కొంత మంది వసతి సౌకర్యం కూడా కల్పించింది. విద్యుత్ మంత్రిత్వశాఖ పరిపాలనా నియంత్రణలో ఉండి, దేశంలోని విద్యుత్ రంగ ప్రాజెక్టులకు ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న నవరత్న సి.పి.ఎస్.ఈ. సంస్థ, ఆర్.ఈ.సి.లిమిటెడ్ కి చెందిన సి.ఎస్.ఆర్. విభాగం ఆర్.ఈ.సి.ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్.ఈ.సి. ఫౌండేషన్ ఇటువంటి కార్యక్రమాల కోసం 7 కోట్ల రూపాయల మేర ఇప్పటికే మంజూరు చేసింది. ఈ కార్యక్రమాల కోసం మరి కొన్ని నిధులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
విద్యుత్తు, నూతన, పునరుత్పాదక శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ పిలుపుకి స్పందించి, ఆర్.ఈ.సి. ఇప్పటికే 150 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి కెర్స్ నిధి కి విరాళంగా అందజేశారు. దీనికి అదనంగా, ఆర్.ఈ.సి. ఉద్యోగులందరూ కలిసి స్వచ్చందంగా ఒక రోజు వేతనాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కి విరాళంగా అందజేశారు.
ఆర్.ఈ.సి. ఫౌండేషన్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలతో కలిసి ఆహార ధాన్యాలతో పాటు మాస్కులు, సానిటైజర్స్ వంటి ఇతర వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఆర్.ఈ.సి., ఢిల్లీ పోలీసుతో కలిసి ఒక్కొక్క ఆహార పొట్లం కుటుంబంలోని నలుగురికి సరిపోయేవిధంగా ప్రతీ రోజు ఐదు వందల ఆహార పొట్లాలను పంపిణీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా వివిధీ జిల్లా కలెక్టర్లు / జిల్లా మేజిస్ట్రేట్ల ఆధ్వర్యంలో 10 నుండి 30 రోజుల పాటు రోజుకు రెండు సార్లు భోజనం సరఫరా చేయడానికి అవసరమైన నిధులను కూడా ఆర్.ఈ.సి. ఫౌండేషన్ విడుదల చేసింది. ఇతర జిల్లా కలెక్టర్లను కూడా సంప్రదించి వారి వారి ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయడానికి కృషి జరుగుతోంది. వీటికి అదనంగా, ఈ జిల్లాల్లో ఇళ్లలో వంట చేసుకోడానికి అవకాశం ఉన్న కుటుంబాలకు ఆహార సామాగ్రి కూడా అందజేశారు.
బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్ మొదలైన రాష్ట్రాల నుండి దాదాపు మూడు వందల మంది రోజువారీ కూలీలు, గురుగ్రామ్ లో ఆర్.ఈ.సి. ప్రపంచ స్థాయి ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనిలో ఉన్నారు. వారికీ, వారితో పాటు పరిసరప్రాంతాల్లో నివసిస్తున్న పేదవారికీ, వారానికి రెండు సార్లు గోధుమ పిండి, బియ్యం, పప్పు, వంట నూనె, సబ్బు, సానిటైజర్లు మొదలనవి సమకూరుస్తున్నారు.
*****
(Release ID: 1616674)
Visitor Counter : 310
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada