రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరులో ఐ.ఏ.ఎఫ్. మద్దతు.

Posted On: 20 APR 2020 7:13PM by PIB Hyderabad

కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరులో దేశానికి భారత వైమానిక దళం తన మద్దతు కొనసాగిస్తూనే ఉంది.  ఐ.ఏ.ఎఫ్. తన రవాణా, రోటరీ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అవసరమైన మౌలిక సదుపాయాలతో సహా ముందుకు వచ్చి, దేశవ్యాప్తంగా నోడల్ సరఫరా స్థావరాల నుండి గ్రహీత స్థానాల వరకు "ఎయిర్ బ్రిడ్జితరహాలో రవాణాకు అనుసంధాన కర్తగా పనిచేస్తోంది.  పి.పి.ఈ., టెస్టింగ్ కిట్స్, పరిశుభ్రత సామగ్రి, అనుబంధ పరికరాల వంటి వైద్య సామాగ్రి రవాణాతో పాటు వైద్య సిబ్బంది రవాణా అవసరాలను కూడా ఐ.ఏ.ఎఫ్. చేపట్టింది

16 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలితప్రాంతాలైన జమ్మూ&కశ్మీర్, లడఖ్, పాండిచ్చేరి లోని వివిధ ప్రదేశాలకు ఐ.ఏ.ఎఫ్. సామాగ్రిని విమానాల ద్వారా తరలించింది.  కేంద్ర పాలితప్రాంతమైన లడఖ్ నుండి పరీక్ష కోసం కీలకమైన శ్వాబ్ నమూనాల రవాణాను ఐ.ఏ.ఎఫ్. కొనసాగిస్తూనే ఉంది.  దీనికి అదనంగా, కోవిడ్ కు అవసరమైన డి.ఆర్.డి.ఓ. మరియు ఐ.సి.ఎం.ఆర్. వంటి వివిధ సంస్థల సహాయ సామాగ్రిని కూడా ఐ.ఏ.ఎఫ్. విమాన మార్గం గుండా తరలిస్తోంది.  ఈ రోజు వరకు, ఐ.ఏ.ఎఫ్. సుమారు 450 టన్నుల వైద్య పరికరాలుమరియు అనుబంధ సామాగ్రిని రవాణా చేసింది. 

 

కోవిడ్-19 కు సంబంధించిన జాగ్రత్తలతో పాటు భారత ప్రభుత్వం జారీ చేసిన సాధారణ మార్గదర్శకాల సమాచారం అన్ని ఐ.ఏ.ఎఫ్. స్థావరాలకు తెలియజేయడం జరిగింది.  ఐ.ఏ.ఎఫ్. పనిచేసే ప్రదేశాలలో నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు పారిశుధ్యం గురించి, సామాజిక దూరం పాటించడం గురించి నిబంధనలను కఠినంగా పాటిస్తున్నారు.  ఐ.ఏ.ఎఫ్. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తమకు తాము క్షేమంగా ఉంటూ క్రియా శీల చర్యగా "ఆరోగ్య సేతు" మొబైల్ యాప్ ని వినియోగిస్తున్నారు. 

ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టి, నివారించడానికి దేశం చేపట్టిన పోరాటంలో పెద్ద ప్రగతిని సాధించిన నేపథ్యంలో ఐ.ఏ.ఎఫ్. కూడా ఎదురౌతున్న అవసరాలను వృత్తి పరమైన నిబద్దతతో తీర్చడానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. 

***



(Release ID: 1616518) Visitor Counter : 138