పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ఎఫ్.సి.ఐ. వద్ద మిగిలిన బియ్యాన్ని ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ సానిటైజర్ గా తయారుచేయడానికీ, పెట్రోల్ లో కలపడానికీ వీలుగా ఇథనాల్ గా మార్చేందుకు అనుమతించారు.

Posted On: 20 APR 2020 6:09PM by PIB Hyderabad

జీవ ఇంధనాలపై జాతీయ విధానం, 2013 కింద పేరా 5.3 ప్రకారం ఒక వ్యవసాయ పంట కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అంచనాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన ఆహారధాన్యాల ను ఇథనాల్ గా మార్చడానికి జాతీయ జీవ ఇంధనాల సమన్వయ కమిటీ (ఎన్.బి.సి.సి.) ఆమోదంతో పాలసీ అనుమతిస్తుంది. 

 పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన ఎన్.బి.సి.సి. సమావేశంలో భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) వద్ద మిగిలిన బియ్యాన్ని ఇథనాల్ గా మార్చడానికి అనుమతించారు. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ సానిటైజర్స్ తయారుచేయడానికీ, ఇథనాల్ కలిసిన పెట్రోల్ (ఈ.బి.పి.) కార్యక్రమం కోసం ఇలా మార్చిన ఇథనాల్ ను వినియోగిస్తారు.

***


(Release ID: 1616476) Visitor Counter : 274