గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వెహికిల్ ట్రాకింగ్ అప్లికేషన్ ద్వారా కోవిడ్ -19తో పోరాటంలో భాగంగా వ్యర్థాలను సేకరించే డ్రైవర్ల కు జి.పి.ఎస్. ఉన్న స్మార్ట్ గడియారాలతో చండీగడ్ నగరంలో వాహనాల ట్రాకింగ్ చేస్తున్న ప్రభుత్వం

Posted On: 20 APR 2020 4:51PM by PIB Hyderabad

చండీగడ్ నగరంలో మొదటి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు అయిన వెంటనే, పాజిటివ్ కేసు వ్యక్తులతో సంబంధం ఉన్న వారందరికీ నగర నిర్భంధాన్ని ప్రారంభించడం జరిగింది. వీరందరినీ సి.వి.డి. ట్రాకర్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వీరి కుటుంబాలకు అవసరమైన వస్తువను అందించేందుకు ప్రత్యే నిబంధనలు ఏర్పాటు చేశారు.

వ్యర్థాల సేకరణ – దిగ్బంధ గృహాల నుంచి వ్యర్థాలను సేకరించేందుకు, రవాణా చేయడానికి డ్రైవర్ల బృందంతో 15 వాహనాలను మరియు పి.పి.ఈ. కిట్లతో కూడిన సహాయకులను నియమించారు. నిర్బంధ గృహాలను ఒక్కొక్క పర్యవేక్షకుడి పర్యవేక్షణలో నాలుగు జోన్స్ గా విభజించారు.

ఈ వాహనాల డ్రైవర్లందరూ ఇ-హ్యూమన్ రీసోర్స్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ (ఇ-హెచ్.ఆర్.టి.ఎస్) కింద జి.పి.ఎస్. ఎనేబుల్ స్మార్ట్ వాచ్ లను ధరిస్తారు. ఆయా వాహనాల కదలికలను ఈ గడియారాల ఆధారంగా డాష్ బోర్డ్ ద్వారా ట్రాక్ చేస్తారు. ఈ ట్రాకింగ్ ఏకైక లక్ష్యం, నిర్బంధ గృహాలను వదలకుండా చూసుకోవడం.

పరిశుభ్రత – బహిరంగ ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రపరుస్తున్నారు. దట్టమైన ప్రాంతాలు / మురికివాడలు మరియు మండీల పరిశుభ్రత డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

పట్టణ పేదలకు సేవలు – మలోయ గ్రామంలో వలస కార్మికుల ఆశ్రయం ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్మికులకు ముందస్తుగా ఆహారాన్ని అందిస్తున్నారు. పట్టణ పేదల కోసం ఎన్.యూ.ఎల్.ఎం. మరియు వెండర్ సెల్ నెట్ వర్క్ ద్వారా ఆహారం, సబ్బులు, శానిటరీ నాప్కిన్స్ మరియు రేషన్ పంపిణీ కోసం నగర ప్రభుత్వం పౌరసమాజం, ప్రైవేట్ రంగం, రెస్టారెంట్లు మరియు వివిధ దాతలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

పట్టణ పేదలకు సేవలు: విలేజ్ మలోయాలో వలస-కార్మికుల ఆశ్రయం ఏర్పాటు చేయబడింది, ఇక్కడ కార్మికులకు ముందస్తుగా ఆహారాన్ని అందిస్తున్నారు. పట్టణ పేదల కోసం, NULM మరియు వెండర్ సెల్ నెట్‌వర్క్ ద్వారా ఆహారం, సబ్బు, శానిటరీ న్యాప్‌కిన్లు మరియు రేషన్ పంపిణీ కోసం నగర ప్రభుత్వం పౌర సమాజం, ప్రైవేట్ రంగం, రెస్టారెంట్లు మరియు వివిధ దాతలతో ఒప్పందం కుదుర్చుకుంది.

పట్టణ పేద గృహాలకు ఇంటి వద్దకే పంపిణీ -

·        అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్స్ అండ్ డెవలప్ మెంట్ ప్రాక్టీషనర్స్ (ఎ.పి.ఎస్.డబ్లూ.డి.పి) వారిచే వ్యక్తిగత పరిశుభ్రత సామగ్రి అయిన మాస్క్ లు, శానిటైజర్లు, శానిటరీ న్యాప్ కిన్లు, బేబీ డైపర్లు, సబ్బులు, డెటాల్, సావ్లాన్ వంటి క్రిమి సంహారకాల పంపిణి.

·        మారికో లిమిటెడ్, ఎ.పి.సి.డబ్ల్యూ.డి.పి. వారిచే ఫిక్కీ సేకరించిన 500 కిలోల వోట్స్

·        లాక్ డౌన్ అయిన నాటి నుంచి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ అసోసియేషన్ చండీగడ్ చాప్టర్ వారిచే వండిన ఆహారం.

·        తక్కువ ఆదాయం కలిగిన మరియు నిర్మాణ ప్రదేశాల్లో ఉండే వారి కోసం స్వర్మణి యూత్ అసోసియేషన్ వారిచే ప్రజల ద్వారా సేకరించబడిన 14 రోజలకు సరిపడా డ్రై రేషన్ (గోధుమ పిండి -10 కిలోలు, చక్కెర – 1 కిలో, ఆవనూనె – లీటరు, అరకిలో డిటర్జెంట్, 200 గ్రాముల ఊరగాయలు)

·        ఎం.సి.సి. వారిచే 30,000కు పైగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ.

సరఫరా గొలుసు నిర్వహణ - చండీగడ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎం.సి.సి) దుకాణదారుల అవసరాలను గుర్తించడానికి గూగుల్ ఫామ్స్ ను అభివృద్ధి చేసింది. దీన్ని పంపిణీదారులకు అందుబాటులో ఉంచడం ద్వారా సరఫరా గొలుసు నిర్వహిస్తోంది. నగరంలో వివిధ వర్గాల్లో విక్రేతలను గుర్తించి ఇప్పటికే నమోదు చేసింది. పాలు, పచారీ వస్తువులు, పండ్లు, కూరగాయలు, ఔషధాలు మొదలైన వాటి అమ్మకం దారుల మొబైల్ నంబర్ల జాబితాను ఇంటింటికీ చేరవేసేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించుకుంటోంది.

చండీగడ్ అధికారులు వివిధ హోం డెలివరీ యాప్ ఆధారంగా విక్రేతలు మరియు పెద్ద దుకాణదారుల ద్వారా ఇంటి వద్దకే డెలివరీ ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో ప్రజల వద్దకు పంపిణీ చేస్తోంది.

చండీగడ్ మున్సిపల్ కార్పొరేషన్ చండీగడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్ సహకారంతో పొరుగున ఉన్న పండ్లు, కూరగాయలను రోజూ పంపిణీ చేస్తోంది. ఈ సేవలు మొత్తం 12 లక్షల మంది పౌరులకు అందుబాటులో ఉన్నాయి. నగరంలో ఉండే ఒకటిన్నర లక్షల గృహాలు వీటిని వినియోగించుకుంటున్నాయి.

 

 

 

పౌర పంపిణీ పండ్లు కూరగాయల బస్సు                   పంపిణీకి  సిద్ధంగా ఉన్న పండ్లు, కూరగాయలు

యాప్ ద్వారా పంపిణీ వాహనం ట్రాకింగ్

 

కార్పొరేషన్ వనరులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి మరియు వినియోగించుకోవడానికి వివిధ రంగాలకు / గ్రామాలకు అవసరమైన వస్తువులను రవాణా చేసే వాహనాలను ట్రాక్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ ఉపయోగిస్తోంది. ప్రారంభంలో వాహనాల అధికారులు ట్రాక్ చేయవచ్చు.

విక్రేత ట్రాకింగ్ కోసం యాప్ – చండీగడ్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్లతో డెలివరీ వాహనాలను కలిగి ఉంది. అవసరమైన వస్తువుల పంపిణీ కోసం వివిధ ప్రాంతాల్లో పని చేస్తోంది. ఇందు కోసం సాంకేతికతను వినియోగించుకుంటోంది.

·        నగరం అంతటా వాహనాల కదలికల రియల్ టైమ్ ట్రాకింగ్

·        మెరుగైన వినియోగం - వాహనాల మెరుగైన వినియోగం కోసం ఈ అనువర్తనం ద్వారా రోజువారీ ఆధారిత ట్రిప్స్ కేటాయించబడతాయి

·        స్థానిక పౌరుల నుండి అభ్యర్థనలు లేదా అత్యవసర పరిస్థితుల్లో సమీప పరిసరాల్లో సేవలు అందించేందుకు డ్రైవర్‌కు రియల్ టైమ్ సమాచారం

·        వాహనాల కేటగిరీ ప్రకారం వెబ్-పోర్టల్ ఉపయోగించి వాహన కార్యకలాపాలను ట్రాక్ చేయడం.

·        చండీగడ్ మునిసిపల్ కార్పొరేషన్ పోర్టల్‌తో దీని అనుసంధానం, ఫలితంగా పౌరులు అవసరమైన వస్తువుల పంపిణీ కోసం పనిచేసే వాహనం  ప్రస్తుతం స్థానాన్ని ట్రాక్ చేసి తెలుసుకోగలరు. 

--(Release ID: 1616469) Visitor Counter : 78