విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ముసాయిదా విద్యుత్ చట్టం ప్రకటించిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ : 21 రోజుల్లో సూచనలకై పిలుపు

Posted On: 18 APR 2020 6:12PM by PIB Hyderabad

దేశంలో ఆర్ధిక వ్యవస్థ సుస్థిర ప్రగతి కోసం చౌక ధరల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం తప్పనిసరి.  విద్యుత్ రంగం మరింత అభివృద్ధి సాధించడం కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ  విద్యుత్ చట్టం , 2003ను సవరించడానికి ఇందుకు సంబందించిన వారందరి సలహాలు, సూచనలు కోరుతూ శుక్రవారం 17 ఎప్రిల్, 2020న ముసాయిదా విద్యుత్ చట్టం (సవరణ) బిల్లును వ్యాఖ్యలు /సూచనలు కోరుతూ ప్రకటించింది.    భాగస్వామ్య పక్షాలు తమ వ్యాఖ్యలు /పరిశీలనలు/సూచనలను 21 రోజుల్లో తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. 

విద్యుత్ చట్టంలో ప్రతిపాదించిన ప్రధాన సవరణలు ఇవి: 

విద్యుత్ పంపిణీ కంపెనీల (డిస్కంలు)  నిర్వహణలో సాధ్యాసాధ్యాలు

1. ఖర్చులను ప్రతిబింబించే ధరల విధానం:  నియంత్రణ ఆస్తులకు కేటాయింపులు జరిపే పద్ధతిని తొలగించి డిస్కంలు తమకు అయ్యే ఖర్చులను రాబట్టుకునే తీరులో విద్యుత్ కమిషన్లు ధరల పట్టికను నిర్ణయిస్తాయి

2. లబ్ధిదారులకు నేరుగా బదిలీ:  సబ్సిడీని లెక్కలోకి తీసుకోకుండా టారిఫ్ నిర్ణయిస్తారు.  సబ్సిడీని ప్రభుత్వం వినియోగదారులకు నేరుగా ఇస్తుంది.

కాంట్రాక్టుల పవిత్రత

3. విద్యుత్ కాంట్రాక్టుల అమలు సంస్థ ఏర్పాటు:  విద్యుత్ ఉత్పత్తి , పంపిణీప్రసారం చేసే కంపెనీల మధ్య కొనుగోలు లేక అమ్మకానికి సంబంధించిన కాంట్రాక్టులు సక్రమంగా అమలు జరిగేలా ఈ సంస్థ చూస్తుంది.  కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థకు రిటైర్డు హైకోర్టు జడ్జి అధిపతిగా ఉంటారు.  దీనికి సివిల్  కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. 

4.  కాంట్రాక్టుల ప్రకారం విద్యుత్ పంపిణీ చేయడానికి ముందు చెల్లింపులకు తగిన భద్రత కల్పించే యంత్రంగం ఏర్పాటు చేస్తారు. ఇందుకు లోడ్ డిస్పాచ్ సెంటర్లకు అధికారం కల్పిస్తారు. 

నియంత్రణ వ్యవస్థ బలోపేతం

5 అప్పీలేట్ ట్రిబ్యునళ్ల బలోపేతం (ఏ ఫై టి ఈ ఎల్) :  అప్పీలేట్  ట్రిబునళ్లలో  చైర్ పర్సన్ కాకుండా సభ్యుల సంఖ్యను ఏడుకు పెంచడం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి బహుళ బెంచీలను ఏర్పాటు చేయవచ్చని ప్రతిపాదించారు. ఈ ట్రిబ్యునళ్లు తమ నిర్ణయాలు ఆచరణలోకి వచ్చేలా చూసేందుకు వాటి అధికారాలను మరింత పెంచాలని ప్రతిపాదన. 

6. బహుళ ఎంపిక కమిటీల రద్దు:   కేంద్ర, రాష్ట్ర కమీషన్లకు చైర్ పర్సన్, సభ్యుల ఎంపికకు బహుళ కమిటీలకు బదులు ఒకే కమిటీ ఉండాలని, కేంద్ర , రాష్ట్ర కమిషన్లకు  చైర్ పర్సన్, సభ్యుల ఎంపికకు ఒకే విధమైన అర్హతలు ఉండాలని ప్రతిపాదించారు. 

7. జరిమానా: విద్యుత్ చట్టం నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా చూసేందుకు సెక్షన్లను మార్చి జరిమానా పెంచాలని ప్రతిపాదించారు.

అక్షయ మరియు జల ఇంధనం

8. అక్షయ ఇంధన విధానం:  అక్షయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వీలుగా విధాన పత్రం రూపకల్పన.

9. జల వనరులు ఉత్పత్తి చేసే విద్యుత్ కొనుగోళ్లు కనీసం ఏ మేరకు ఉండాలో కమిషన్లు నిర్ణయిస్తాయి. 

10. జరిమానాలు:  అక్షయ ఇంధన వనరుల నుంచి మరియు/లేక జల వనరుల నుంచి విద్యుత్ కొనాలన్న నియమాన్ని పాటించినట్లయితే జరిమానా విధించాలని ప్రతిపాదించారు. 

నానావిధ అంశాలు:  

11. విదేశాలతో విద్యుత్ వాణిజ్యం:  ఇతర దేశాలతో విద్యుత్ రంగంలో వాణిజ్యం జరిపేందుకు ఏర్పాట్లకు ప్రతిపాదనలు

12. ఫ్రాంఛైజీలకు / పంపిణీకి ఉప లైసెన్సులు:   డిస్కామ్ సంస్థలు తమ పరిధిలో కావాలనుకుంటే పంపిణీకి ప్రత్యేక అనుమతులు ఉప లైసెన్సులు ఇవ్వవచ్చని ప్రతిపాదించారు. అయితే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీలో నాణ్యతకు ఆ డిస్కామ్ బాధ్యత వహించవలసి ఉంటుంది . 

 (Release ID: 1615895) Visitor Counter : 354