పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్నా దేశ్ వెబినార్ రెండో సీరిస్ ను ఈరోజు ప్రారంభించిన ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ

ఈ వెబినార్‌ శీర్షిక పేరు: క‌ల‌క‌త్తా- సంస్కృతుల సంగ‌మం .

Posted On: 16 APR 2020 4:43PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ,  ప్రస్తుతం 'దేఖోఅప్నాదేశ్‌'  ఇతివృత్తంలో భాగంగా వెబినార్ల‌ సీరీస్‌ను నిర్వహిస్తోంది, భారతీయులు తమ దేశం గురించి తెలుసుకోవ‌డాన్ని  ప్రోత్సహించడానికి ,పర్యాటక రంగంలోని వారు, విద్యార్థులు, సాధారణ ప్రజల ప‌రిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి.,ప‌ర్యాట‌క రంగానికి సంబంధించిన వివిధ అంశాల‌పై దీనిని నిర్వ‌హిస్తున్నారు.
ఈ రెండో వెబినార్ సీర‌స్ కు క‌ల‌క‌త్తా- సంస్కృతుల సంగ‌మం అని పేరుపెట్టారు. దీనిని ఇఫ్తెకార్ అషామ్‌, రిత్విక్ ఘోష్‌, అణిర్బ‌న్ ద‌త్త దీనిని నిర్వ‌హించి స‌మ‌ర్పిస్తున్నారు. కోల్‌క‌తాపై ఈ వెబినార్ కోల్‌క‌తా అభివృద్ధిలో వివిధ క‌మ్యూనిటీల పాత్ర పై ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు తెలియజేసింది.

ఈ వెబినార్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. సుమారు 2700 మంది రిజిస్ట‌ర్ చేసుకోగా 1800 మంది పాల్గొన్నారు. 2020 ఏప్రిల్ 18 న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా, రెండు వెబ్‌నార్లు ఖరారు చేశారు. మొదటి సెషన్ 1100-1200 గంటల నుండి, మాన్యుమెంట్స్ ఆఫ్ మామ‌ళ్ల‌పురం- స్టోరీస్ ఎచ్‌డ్ ఇన్ స్టోన్ పేరుతో రూపొందించారు.  రెండవ సెషన్ 1200-1300 గంటల నుండి ఉంటుంది. ‘హుమాయున్ సమాధి వద్ద ప్రపంచ వారసత్వం , సుస్థిర ప‌ర్యాట‌కం’ శీర్షిక‌న‌, అగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్  ,సి.ఇ.ఒ మిస్టర్ రతీష్ నందా సమర్పించనున్నారు.
ఈ వెబ్‌నార్ సిరీస్ అనేక ప్రాంతాలుమన భార‌తీయ అద్భుత విశిష్ట‌ సంస్కృతి , వారసత్వం పై  లోతైన విస్తార‌మైన‌ సమాచారాన్ని అందిస్తుంది. మొదటి వెబ్‌నార్ 2020 ఏప్రిల్ 14 న జరిగింది, వెబ్‌నార్ పేరు "సిటీ ఆఫ్ సిటీస్- ఢిల్లీ  ప‌ర్స‌న‌ల్ డైరీ". పర్యాటక అవగాహన , సామాజిక చరిత్ర ఈ సెష‌న్  ప్రధాన అంశం.

దేఖోఅప్నాదేశ్ వెబినార్‌  సిరీస్ గురించి సమాచారం భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖవారి ఇన్ క్రెడిబుల్  ఇండియా సోషల్ మీడియా పేజీలలో క్రమం తప్పకుండా పోస్ట్ అవుతుంది.


(Release ID: 1615227) Visitor Counter : 237