రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పిపిఇ పరీక్షా సౌకర్యాన్ని డిఆర్డిఇ గ్వాలియర్ నుండి ఐఎన్ఎంఏఎస్ ఢిల్లీకి మార్చిన డిఆర్డిఓ

Posted On: 16 APR 2020 4:58PM by PIB Hyderabad

వ్యక్తిగత రక్షణ పరికరాల(పిపిఇ)లు మరియు మాస్కుల  అందజేతలో జరిగే ఆలస్యాన్ని అతిక్రమించడానికి మరియు వాటిని త్వరితంగా అందించడానికి రక్షణ  పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డిఆర్డీఓ) పరీక్షా సౌకర్యాన్ని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి స్థాపన(డిఆర్డిఇ), గ్వాలియర్ నుండి పరమాణు ఔషధ & అనుబంధిత విజ్ఞానశాస్త్ర సంస్థ(ఐఎన్ఎంఏఎస్), ఢిల్లీకి మార్చారు. ఇది డిఆర్డిఓకి చెందిన మరొక ముఖ్య జీవ శాస్త్ర ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో అవసరమైన అన్ని రకాల పరీక్షలతోపాటు వ్యక్తిగత సూట్లు మాస్కులను మూల్యాంకనం చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పటికే 10 జట్లకు పైగా సూట్లు మరియు మాస్కులను ఈ ప్రయోగశాలలో పరీక్ష చేయండం జరిగింది.

కొవిడ్-19పై పోరాటంలో ముందున్న డిఆర్డిఇ, గ్వాలియర్ ఇపుడు హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ మరియు  ఇతర దేశాల నుండి వచ్చిన మాస్కులను మరియు సూట్లను వివిధ సంస్థలకు సరఫరా చేసే ముందు వాటిని పరీక్షించి వాటిని ధ్రువీకరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.



(Release ID: 1615152) Visitor Counter : 203