వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పుసా ప్రక్షాళన మరియు పరిశుభ్రపరచే టన్నెల్ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌధురి

Posted On: 16 APR 2020 4:14PM by PIB Hyderabad

భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐసిఏఆర్) న్యూఢిల్లీ వారి వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం వారు అభివృద్ధిచేసిన  పుసా ప్రక్షాళన మరియు పరిశుభ్రం చేసే టన్నెల్ను కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌధురి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఏఆర్ఇ కార్యదర్శి మరియు ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మహాపాత్ర, ఐసిఏఆర్ –ఐఏఆర్ఐ, న్యూఢిల్లీ  సంచాలకులు డా. ఏ.కె. సింగ్  పాల్గొన్నారు.

ఈ పరిశుభ్రత టన్నెల్లో కాలుతో తొక్కితే వచ్చేటట్లుగా ఏర్పాటు చేసిన సబ్బు మరియు నీరుతో చేతులను శుభ్రపరచుకోవడానికి మరియు టన్నెల్లో 20 సెకన్ల పాటు ఫాగింగ్ ఉంటుంది.  ఈ టన్నెల్లో ఆరోగ్య విభాగం వారు సూచించిన 0.04% గాఢత గల  క్వార్టనెరీ అమ్మోనియం మిశ్రమం(క్యూఏసి) ఉపయోగిస్తారు.

 

పుసా ప్రక్షాళన మరియు పరిశుభ్రపరిచే టన్నెల్ను ప్రారంభించే ముందు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌధురికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న దృశ్యం

పుసా ప్రక్షాళన మరియు పరిశుభ్రపరిచే టన్నెల్ను ప్రారంభించే ముందు  చేతులను శుభ్రపరుచుకుంటున్న కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌధురి

 

పుసా ప్రక్షాళన మరియు పరిశుభ్రపరిచే టన్నెల్ను ప్రారంభిస్తున్న కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌధురి


పుసా ప్రక్షాళన మరియు పరిశుభ్రపరిచే టన్నెల్ను ప్రారంభించి టన్నెల్ లోపలికి వెళ్ళిన  కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌధురి


(Release ID: 1615135) Visitor Counter : 259