రక్షణ మంత్రిత్వ శాఖ
అత్యవసరంగా ల్యాండ్ అయిన ఐ.ఏ.ఎఫ్. చీతా హెలికాప్టర్
प्रविष्टि तिथि:
16 APR 2020 10:34AM by PIB Hyderabad
కోవిడ్-19 పరీక్షల కోసం "లే" ప్రాంతానికి చెందిన నమూనాలను హిండన్ నుండి చండీగఢ్ తీసుకువెళ్తున్న ఒక చీతా హెలికాఫ్టర్ హిండన్ నుండి సుమారు 3 నాటికల్ మైళ్ళ దూరంలో సాంకేతిక లోపానికి గురికావడంతో, ఔటర్ రింగు రోడ్డు రహదారిపై క్షేమంగా దిగింది. పైలెట్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి ఆస్థి నష్టం జరగలేదు. సహాయ ఎయిర్ క్రాఫ్ట్ వెంటనే హిండన్ నుండి వచ్చింది. హెలికాఫ్టర్ కు అవసరమైన మరమ్మత్తు చేసి తిరిగి హిండన్ కు క్షేమంగా పంపించారు.
***
(रिलीज़ आईडी: 1614957)
आगंतुक पटल : 223