హోం మంత్రిత్వ శాఖ
దేశంలో కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సవరించిన ఏకీకృత మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 20,2020 నుంచి అమలులోకి రానున్న సవరించిన మార్గదర్శకాల ప్రకారం, అదనపు కార్యకలాపాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు
Posted On:
15 APR 2020 11:18AM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ -19 మహమ్మారిని నివారించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, 2020 ఏప్రిల్ 14న జారీచేసిన , ఏకీకృత మార్గదర్శకాలలో నిర్దేశించిన లాక్ డౌన్ చర్యలు 2020 మే 3 వ తేదీ వరకు అమలులో ఉంటాయని భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
భారత ప్రభుత్వ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, దేశంలో కోవిడ్ -19 అంటువ్యాధిని నివారించడానికి భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు , విభాగాలు,రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు తీసుకోవలసిన లాక్‌డౌన్ చర్యలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వశాఖ సవరించిన, ఏకీకృత మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు కోవిడ్ -19 కట్టడికి, జాతీయ స్థాయి ఆదేశాలను కూడా తెలియజేస్తాయి.. పనిప్రదేశాలు, కార్యాలయాలు, కర్మాగారాలు, వివిధ సంస్థలలో సామాజిక దూరం పాటించడం కోసం ఎస్.ఒ.పిలు ; విపత్తు నిర్వహణ చట్టం 2005 ఐండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), 1860 లోని సంబంధిత విభాగాల క్రింద, లాక్‌డౌన్ ఉల్లంఘనలకు సంబంధించిన నేరాలకు జరిమానాల విధింపును ఈ మార్గదర్శకాలలో పొందుపరిచారు.
ప్రజల ఇబ్బందులను తొలగించడానికి, ఎంపిక చేసిన అదనపు కార్యకలాపాలను అనుమతించనున్నారు. ఇవి 20 ఏప్రిల్ 2020 నుంచి అమలులోకి వస్తాయి. అయితే , ఈ అదనపు కార్యకలాపాలను లాక్‌డౌన్ కు సంబంధించి ఇప్పటికే అమలులో ఉన్న మార్గదర్శకాలకు కట్టుబడి రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు) , జిల్లా పాలనాయంత్రాంగాలు అమలులోకి తెస్తాయి.
ఈ సడలింపులను అమలు చేయడానికి ముందు, పని ప్రదేశాలు, కార్యాలయాలు, కర్మాగారాలు, సంస్థలు సామాజిక దూరానికి సంబంధించి అన్ని సన్నాహక ఏర్పాట్లు , ఆయా రంగాలకు సంబంధించి అవసరమైన ఇతర ఏర్పాట్లు ఉండేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా పాలనా యంత్రాంగాలు చూడాలి.
ఏకీకృత సవరించిన మార్గదర్శకాలు రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా పాలనాయంత్రాంగాలు కంటైన్ మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలకు వర్తించవు. ఏదైనా కొత్త ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ కింద గుర్తించినట్టయితే , ఆ ప్రాంతం కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించేంతవరకూ అనుమతించిన కార్యకలాపాలను నిలిపివేస్తారు. అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల కింద అనుమతించిన కార్యకలాపాలను మాత్రం కొనసాగించవచ్చు.
సవరించిన ఏకీకృత మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిందిగా భారత ప్రభుత్వానికి చెందిన అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది.
ఏకీకృత సవరించిన మార్గదర్శకాల కోసం క్లిక్ చేయండి
కేంద్ర హోంమంత్రిత్వశాక రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు పంపిన సమాచారం కోసం క్లిక్ చేయండి
(Release ID: 1614715)
Visitor Counter : 386
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam