సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జమ్మూ కశ్మీర్ పరీక్షా సామర్థ్యం రోజుకు 350 శాంపిల్స్ కు పెరిగింది – డా. జితేంద్ర సింగ్
క్వారంటైన్ పడకల సంఖ్య 7,909 నుంచి 26,943కు అంటే దాదాపు నాలుగు రెట్లు పెరిగింది.
Posted On:
14 APR 2020 8:19PM by PIB Hyderabad
జమ్మూ కశ్మీర్ కరోనా పరీక్షా సామర్థ్యం రోజుకు 350 శాంపిల్స్ కు పెరిగిందని కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. ఇది ఒక పెద్ద విజయమేనని, మూడు వారాల క్రితం వరకూ రోజుకు ఇది కేవలం 50 నమూనాలకు మాత్రమే సరిపడా ఉందని తెలిపారు.
జమ్మూ కశ్మీర్ లోని కరోనా హెల్త్ కేర్ సదుపాయాలకు సంబధించిన వివరణాత్మక ఆడియో సమావేశం తర్వాత, లాక్ డౌన్ కాలంలో కరోనా సంరక్షణ మరియ నివారణ సామర్థ్యంలో పెద్ద ఎత్తున పురోగతి సాధించినందుకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఆరోగ్య అధికారులను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఆరోగ్య పరిపాలన మరియు కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేక బృందాన్ని అభినందించారు. జమ్మూ కశ్మీర్ ఫైనాన్షియల్ కమిషనర్ శ్రీ అటల్ దల్లూ కేంద్ర ప్రభుత్వ అధికారులతో చేస్తున్న సమన్వయం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
కరోనా నిర్ధారణ కోసం రోజుకు కేవలం 50 నమూనాలు మాత్రమే పంపించగలిగే పరిమితి ఇంతకుముందు ఉందని, ఇది ఇప్పుడు కొద్ది రోజుల్లో ఏడు నుంచి ఎనిమిది రెట్లు పెరిగిందని డాక్టర్ జితేందర్ సింగ్ వివరించారు. అనేక రాష్ట్రాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చి చూస్తే, కరోనా మహమ్మారి రూపంలో ఉద్భవించిన ఆకస్మిక సవాలు ఎదుర్కొనేందుకు జమ్మూ కశ్మీర్ తన ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకోవడంలో వేగంగా ఉందని తెలిపారు. ఐసోలేషన్ పడకల సంఖ్య 1533 నుంచి 2372 పెరగడం, అదే విధంగా అందుబాటులో 1689 పడకలు ఉండడం దీనికి నిదర్శనమన్నారు. కోవిడ్ కు ప్రత్యేకించిన ఆస్పత్రుల్లో జమ్మూ కశ్మీర్ లో ఏర్పాటు చేసింది మొదటిదని, ఇప్పుడు వాటి సంయ 17కి పెరిగిందని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని పడకల సంఖ్యను 25 నుంచి 209కి పెంచినట్లు తెలిపారు.
వెంటిలేటర్ల లభ్యతకు సంబంధించిన అన్ని భయాలు తొలగిస్తూ, కరోనా రోగులకు నియమించిన వెంటలేటర్ల మీద కొద్ది రోజుల క్రితం వరకూ 46 మంది ఉన్నారని, అది ప్రస్తుతం 209గా ఉందని న్నారు. అదే విధంగా క్వారంటైన్ పడకల సంఖ్య 7,909 నుంతి 26,943కు దాదాపు 4 రెట్లు పెరిగిందని తెలిపారు.
రోగనిరోధక శక్తి పెంచేందుకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్ర విడుదల చేసిన విధంగా ఎప్పటికప్పుడు పాటిస్తూ, ప్రజలకు ప్రయోజనం చేకూర్చినందుకు జమ్మూ కశ్మీర్ అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.
(Release ID: 1614618)