సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్ -19 లాక్ డౌన్ తర్వాత సంస్థలను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం తరుఫున పూర్తి మద్ధతు ఇస్తామని పరిశ్రమ ప్రతినిధులకు శ్రీ నితిన్ గడ్కరీ హామీ

ప్రతి కూలతను అవకాశంగా మార్చడానికి సమిష్టిగా పని చేసే అన్ని రంగాలకు ప్రాధాన్యం

Posted On: 14 APR 2020 4:51PM by PIB Hyderabad

కోవిడ్ -19 లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత తమ సంస్థలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర రహదారులు మరియు రవాణా , సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ రోజు వెబ్ ఆధారిత సెమినార్ లో ఫిక్కీ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న వివిధ ఆర్థిక నిర్ణయాల గురించ వారికి తెలియజేశారు. టర్మ్ లోన్స్ మరియు వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాల రీషెడ్యూల్ కోసం ఆర్బీఐ అనుమతి అందించిందని  శ్రీ గడ్కరీ తెలిపారు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గురించి మాట్లాడిన శ్రీ గడ్కరీ, ప్రభుత్వానికి వారిక ఇబ్బందులు తెలుసని, ఆర్థిక వ్యవస్థ వాటి ప్రాధాన్యతను గుర్తిస్తుందని అన్నారు. ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగాలతో కలిసి పారిశ్రామిక రంగం పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రయోజనాలను అందించే రంగాలన్నీ బలమైనవిగా మిగిలి ఉన్నాయని నొక్కి చెప్పారు. మార్కెట్లో లిక్విడిటీ ప్రాధాన్యత గురించి మాట్లాడిన ఆయన, ప్రస్తుతం  క్రెడిట్ గ్యారంటీ స్థాయి లక్ష కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లకు పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రఆర్థిక సంస్థలు మంజూరు చేసిన 75 శాతం అడ్వాన్స్ గ్యారంటీ. ప్రభుత్వ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద పరిశ్రమలు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు లేవనెత్తిన సమస్యల గురింతి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ప్రస్తుత సంక్షోభాన్ని అవకాశంగా వినియోగించుకోవాలని పారిశ్రామిక రంగాల వారికి పిలుపునిచ్చిన శ్రీ గడ్కరీ, ముఖ్యంగా కొన్ని దేశాలు తమ పెట్టుబడులను చైనా నుంచి తరలించాలని చూస్తున్నాయని, వారంతా భారత్ వైపు చూస్తున్నారని తెలిపారు.

రహదారుల గురించి మాట్లాడిన ఆయన 2019-20లో రికార్డు స్థాయికి చేరుకున్న హైవేల నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగం యొక్క పెరుగుతున్న అవసరాలు తీర్చే క్రమంలో రాబోయే కాలంలో 2 నుంచి 3 రెట్లు పెరుగుతుందని తెలిపారు. నిర్ణయాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా వీటిని తమ దృష్టికి తేవాలాని తెలిపారు. 3 నెలల్లో ఈ విషయాలను తెలుపాలని ఎన్.హెచ్.ఏ.ఐ మరియు దాని మధ్యవర్తిత్వ విభాగాలకు సూచించారు. ఈ ప్రయోజనాల కోసం ప్రస్తుతం సాయంత్రం 5 గంటలకు బదులు, 7 గంటల వరకూ ఆయా సంస్థల అధ్యక్షులు పని చేయాలని సూచించారు. వారు ఇప్పటికే పని చేయడం ప్రారంభించాలని, ప్రస్తుత 280 విషయాలను తక్కువ సమయంలోనే పరిష్కరించాలని మంత్రి చెప్పారు.

భారత్ లో ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చాలని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, ఆర్థిక వృద్ధిని సాధించేందుకు కరోనా వ్యతిరేక యుద్ధంలో విజయం సాధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భారత పరిశ్రమ ప్రస్తుత పరిస్థితిని మరో రూపంలో కనిపిస్తున్న వరంగా చూడాలని, ఎగుమతి సామర్థ్యాన్ని మెరుగు పరచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఈ సంక్షోభ సమయంలో మార్కెట్ లోకి లిక్విడిటీ తీసుకురావడం కీలకమని, పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించే ప్రక్రియను ఎన్.హెచ్.ఏ.ఐ. ఇప్పటికే ప్రారంభించిందని, 3 నెలల్లోపు అన్ని చట్టబద్దమైన అంశాలను పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి రహదారి మరియు రహదారి నిర్మాణం గురించి మాట్లాడిన ఆయన, తన మంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోందని, ఇందులో విజయం సాధించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. రహదారి రంగానికి పునరుద్ధర మార్గాన్ని ప్రారంభించేందుకు కరోనా వైరస్ వ్యాప్తి నుంచి రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని, దేశంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.



(Release ID: 1614509) Visitor Counter : 170