మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
లాక్డౌన్ రెండవ దశలో ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ఫిట్ ఇండియా మరియు సిబిఎస్ఇ విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా శారీరక దృఢత్వం కోసం ప్రత్యక్ష తరగతుల నిర్వహణ
2020, 15 ఏప్రిల్ ఉదయం 9:30 గంటల నుండి ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రాంలు అందిస్తాయి
ఈ ప్రత్యక్ష తరగతుల ద్వారా ఈ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించుకుటారు: శ్రీ పోఖ్రియాల్
Posted On:
14 APR 2020 4:09PM by PIB Hyderabad
భారత ప్రభుత్వపు అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యమం ఫిట్ ఇండియా వారు ప్రారంభించిన ఫిట్ ఇండియా యాక్టివ్ డే కార్యక్రమం మళ్ళీ శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రొత్త కార్యక్రమంతో ముందుకు వచ్చింది. ఈ సారి దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల శారీరక ఆరోగ్య సంరక్షణ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్ఇ)వారి సంయుక్త భాగస్వామ్యంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శత్వంతో పిల్లలకు ప్రత్యక్ష ఆన్లైన్ తరగతులను నిర్వహించనుంది.
“ దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర మానవాభివృద్ధి శాఖ సహకారంతో దేశవ్యాప్తంగా ఉన్న 13868 సిబిఎస్ఇ పాఠశాలల్లో ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా అందులో 11682 పాఠశాలలు ఈ కార్యక్రమంలో ముందంజలో ఉన్నాయి. ఇపుడు ప్రారంభించనున్న ఈ క్రొత్త కార్యక్రమం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉన్నత ఆశయాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడటంతోపాటు ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది ” అని కేంద్ర కేంద్ర మానవాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ’నిశాంక్’ అన్నారు.
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రి శ్రీ కిరణ్ రిజిజు మాట్లాడుతూ “పిల్లలకు ఇళ్ళ వద్ద శారీరక శ్రమ ఎక్కువగా ఉండదు, పిల్లలు ఆరోగ్యవంతంగా తయారుకావడానికి ఇంటి వద్ద నుండే నిపుణుల సలహాలతో, ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతో ఈ క్రొత్త కార్యక్రమం చాలా ఉపయుక్తమవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.
కొవిడ్-19 వ్యాప్తి నిరోధానికి 3 మే 2020 వరకు పొడిగించిన లాక్డౌన్ రెండవ దశలో ప్రధాని పిలుపులో భాగంగా దేశ పౌరులందరూ తమ వ్యాధి నిరోధకతను పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్ ఇండియా మరియు సిబిఎస్ఇ ఆయుష్ మంత్రిత్వ శాఖ వారి మార్గదర్శకాలతో నిర్వహించనున్న శారీరక ఆరోగ్య పరిరక్షణ తరగతులు ఈ సారి పాఠశాల పిల్లల కోసం 15 ఏప్రిల్ 2020 ఉదయం 9:30 గంటల నుండి ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రాంలలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ ప్రసారమవుతుంది. ఈ తరగతులు ఇతర పిల్లలతో పంచుకోవడానికి అనుకూలంగా యుట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ తరగతుల్లో ముఖ్యంగా పిల్లల ఆరోగ్య పరిరక్షణకు యోగా, పోషకాహారము, భావావేశ నియంత్రణ వంటి విషయాలపై ప్రఖ్యాత ఫిట్నెస్ నిపుణులు ఆలియా ఇమ్రాన్, పోషకాహార నిపుణులు పుజా మఖిజా, ఎమోషనల్ వెల్నెస్ నిపుణులు డా.జితేంద్ర నాగపాల్, యోగా నిపుణులు హీనా బీమాని వంటి వివిధ విషయ నిపుణుల తరగతులు నిర్వహిస్తారు.
సిబిఎస్ఇ, జిఒక్యూఐఐ మరియు శిల్పాశెట్టి ఆప్ల ద్వారా సామాజిక మీడియాలో ఈ తరగతుల ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది.
(Release ID: 1614390)
Visitor Counter : 188
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam