సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పత్రిక ప్రకటన

Posted On: 14 APR 2020 3:51PM by PIB Hyderabad

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్  న్యూ ఢిల్లీలోనిదేశ వ్యాప్తంగా తన శాఖలలో కూడా మర్చి 23వ తేదీ నుండి కార్యకలాపాలు సాగించ లేకపోయింది. తగు సౌలభ్యం లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విధులు నిర్వహించలేక పోయింది. ఏప్రిల్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం చేసే ప్రకటన ఆధారంగా పరిస్థితి సమీక్షించాలని అనుకున్న నేపథ్యంలో  ప్రధాని లాక్ డౌన్ పై నేడు జాతినుద్దేశించి ప్రకటన చేశారు. లాక్ డౌన్ ని మే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే హాట్ స్పాట్లను మినహాయించి తిరిగి పరిస్థితిని ఏప్రిల్ 20వ తేదీన సమీక్షిస్తామని వెల్లడించారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. అందువల్ల ట్రిబ్యునల్ బెంచిల పని తిరిగి ప్రారంభం కావడానికి సాధ్యాసాధ్యాలు ఏప్రిల్ 20వ తేదీన తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. 

ట్రిబ్యునల్  బెంచిలకు సెలవులు వివిధ దశలుగా  నిర్ధారించడం జరిగింది . ఎర్నాకులం బెంచిలకు  సెలవులు ఈ  ఏప్రిల్ మధ్యలో మొదలవుతాయిఅక్కడి నుండి కొన్ని వారాల తరువాత బెంగళూరు బెంచిలకు సెలవులు ప్రారంభమవుతాయి. ఇదే తీరు ఉత్తరాది వైపు కూడా ఉంటుంది. అయితే ప్రిన్సిపాల్ బెంచికి సెలవులు జూన్ లో ఉంటాయి.

కరోనా లాక్ డౌన్ వల్ల నష్టపోయిన ఈ పనిదినాలను వేరే విధంగా భర్తీ చేయనున్నారు. బెంచిలు మళ్ళీ పని చేయడం ప్రారంభమయ్యాక సంబంధిత బార్ అసోసియేషన్లతో సంప్రదించి పని దినాల నష్టాన్ని ఎలా భర్తీ చేయాలో నిర్ణయించడం జరుగుతుంది.   

అత్యవసరంగా ఏదైనా కేసు విచారణకు అడ్వొకేట్ నుండి వినతి వస్తేఆ సమాచారం  ప్రిన్సిపాల్ రిజిస్ట్రార్ దృష్టికి వెళ్తుంది. ఆ కేసు విచారణ ఎంతవరకు అత్యవసరమో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉద్యోగులకు ఎదురుకాకుండా ఉండేందుకు  ప్రిన్సిపాల్ బెంచిఇతర బెంచీలు నామ మాత్రపు సిబ్బందితో పనిచేస్తాయి.  బెంచిల రిజిస్ట్రార్ లు ఎంతవరకు ఉద్యోగులు విధులకు అవసరమవుతారో గుర్తించివంతుల వారీగా వారికి పని కేటాయిస్తారు. పాలనాపరంగా అత్యవసర వ్యవహారాలుంటే సంబంధిత వ్యక్తులు ఆన్ లైన్ లో కానీఫోన్ లో మాట్లాడుకుని కానీ తగు విధంగా చర్యలు చేపడతారు.

        

*****


(Release ID: 1614385) Visitor Counter : 187