కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కంపెనీల చట్టం, 2013 మరియు కోవిడ్ -19 వల్ల వచ్చిన ముప్పు కారణంగా రూపొందించిన నియమాల

నేపధ్యంలో కంపెనీలు సాధారణ, ప్రత్యేక తీర్మానాలు ఆమోదించడంపై వివరణ

Posted On: 13 APR 2020 8:26PM by PIB Hyderabad

వీడియో కాన్ఫరెన్సు ద్వారా , ఆడియో విజువల్ పద్ధతుల ద్వారా కంపెనీల అసాధారణ సర్వసభ్య సమావేశాల (ఈ జి ఎం) నిర్వహణ విషయంలో కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం సి ఎ) ఇంతకు ముందు 8 ఏప్రిల్, 2020న జారీచేసిన సర్క్యులర్‌ (సాధారణ సర్క్యులర్‌ నెంబరు 14/2020)కు కొనసాగింపుగా ఎం సి ఎ సోమవారం మరొక సర్క్యు లర్‌ (సాధారణ సర్క్యులర్‌ నెంబరు 17/2020) జారీ చేసింది. కోవిడ్ -19 కట్టడికి లాక్ డౌన్ అమలు మరియు సామాజిక దూరం పాటింపు కారణంగా ఆ సమావేశాలకు హాజరు కావలసిందిగా సభ్యులకు కేవలం ఎలెక్ట్రానిక్ పద్ధతిలో నోటీసుల జారీపై దానిలో మరింత స్పష్టమైన  వివరణ ఇచ్చింది.  అదే సమయంలో సదరు కంపెనీలు ఇప్పటి వరకు ఈ-మెయిల్ చిరునామాలు నమోదు చేసుకోని సభ్యుల ఈ – మెయిల్ చిరునామాల నమోదుకు చర్యలు తీసుకోవడంతో పాటు వార్తాపత్రికలలో బహిరంగ ప్రకటనల జారీ సందర్భంగా ఇందుకు సంబంధించి తగిన రీతిలో వెల్లడి చేయాల్సి ఉంటుంది. 

భౌతికరూపంలో షేర్లు ఉన్న సభ్యులు లేక కంపెనీలో తమ ఈ-మెయిల్ చిరునామాలు నమోదు చేసుకోని వారు తమ ఓట్లను రిమోట్ ఈ-ఓటింగ్ ద్వారా లేక సమావేశం జరిగేటప్పుడు ఈ-ఓటింగ్ పధ్ధతి ద్వారా వేయవచ్చని సదరు కంపెనీలు ఓటింగ్ కు సంబంధించి బహిరంగ ప్రకటనలో స్పష్టంగా తెలియజేయాలి. 

చిన్న కంపెనీలకు కూడా అదే విధమైన చట్రం అంటే ఈ –ఓటింగ్ సౌకర్యం కల్పించవలసిన అవసరం లేని కంపెనీల గురించి కూడా సర్క్యు లర్‌ లో ప్రస్తావించడం జరిగింది.  తపాలా సేవలకు అంతరాయం కలిగి పోస్టు ద్వారా నోటీసుల జారీ లేక తీసుకోవడానికి కష్టతరంగా మారినందువల్ల ఈ పద్ధతిని అనుమతించడం జరుగుతోంది. 

కంపెనీల చట్టం మరియు తత్సంబంధ కంపెనీల (నిర్వహణ మరియు పాలన) నియమాలు, 2014 ప్రకారం కొన్ని కంపెనీలు సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా కేవలం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రస్తుత సర్క్యులర్‌ మరియు 8 ఏప్రిల్, 2020న జారీ చేసిన సర్క్యులర్‌ లో ఈ-ఓటింగ్ కు సంబంధించి పేర్కొన్న  నియమాలకు అవసరమైన మార్పులు చేసుకొని వ్యవహారాలు/కార్యకలాపాలు నిర్వహించవచ్చు. 

ఈ అసాధారణ సమయంలో తమ వ్యవహారాలను /కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి పై వివరణ కంపెనీలకు వెసులుబాటును కల్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం ఎంసిఎ వెబ్సైటు http://www.mca.gov.in/Ministry/pdf/Circular17_13042020.pdf లో ఉన్న  సాధారణ సర్క్యులర్‌ నెంబరు 17/2020ను చూడవచ్చు.  

 



(Release ID: 1614253) Visitor Counter : 125