భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు సాధారణ మార్గదర్శకాలను జారీ చేసిన భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం.

అంటువ్యాధులను తరిమి కొట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న " డు-ఇట్-యువర్ సెల్ఫ్ హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్" లను వేగంగా నెలకొల్పుకోవాలని సూచించిన మార్గదర్శకాలు.

"పొదుపైన, ప్రభావంతమైన పరికరాలు ఎటువంటి అసమాన సానుకూల ప్రభావాన్ని కలిగిస్తాయో - మార్గదర్శకాలతో పాటు పి.ఎస్.ఏ. కార్యాలయ బృందం కలిసి చూపింది." --- భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు ప్రొఫెసర్ కే. విజయ రాఘవన్.

సామాజిక నాయకులు, ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్ సంస్థలు మొదలైన వారు ఈ సూచనలను, ఇతర జాగ్రత్తలను అమలుచేయాలని కోరిన ప్రొఫెసర్ రాఘవన్.


పారిశుధ్యం, పరిశుభ్రత పద్ధతులు పాటించడం, కీలకమైన జోక్యాలను సూచించడం, ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల్లోని ముఖ్య లక్ష్యం

Posted On: 13 APR 2020 7:31PM by PIB Hyderabad

జన సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సాధారణ మార్గదర్శకాలను జారీ చేసింది.   ముఖ్యంగా మరుగుదొడ్లు, బట్టలు ఉతికే చోటు, స్నానాల గదులు మొదలైనవి ఒకరి కంటే ఎక్కువ మంది వినియోగించే ప్రదేశాల్లో ఈ మార్గదర్శకాలను ప్రధానంగా ఆచరించాలి. 

పారిశుధ్యం, పరిశుభ్రత పద్ధతులను పాటించే ప్రదేశాల్లో వ్యాధి వ్యాప్తి ని నియంత్రించేందుకు కీలకమైన జోక్యాలను సూచించడం, ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల్లోని ముఖ్య లక్ష్యం.  

ఈ సమాజంలో నివసించే ప్రజల్లో తరచుగా చేతులు శుభ్రం చేసుకునే విధానాన్ని ప్రోత్సహించడానికి మన యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించవలసిన అవసరం ఉంది. అంటువ్యాధులను తరిమి కొట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న " డు-ఇట్-యువర్ సెల్ఫ్ హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్" లను వేగంగా నెలకొల్పుకోవాలని ఈ మార్గదర్శకాల్లో ముఖ్యంగా సూచించడం జరిగింది.  

చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు చేతితో ఉపయోగించే కుళాయి కంటే, కాలితే ఉపయోగించే కుళాయి వల్ల నీటి వినియోగం తాగి అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశం కూడా ఉంది. 

వీటిని స్వంతంగా కమ్యూనిటీ కార్యకర్తలు, అధికారులు కలిసి, తక్కువ ధరలతో, స్థానికంగా అందుబాటులో ఉండే వస్తువులతో, లాక్ డౌన్ సమయంలో కూడా చక్కగా అమర్చుకోవచ్చు. 

ప్రజా మరియు సామాజిక మరుదొడ్ల వద్ద నీటి వాడకాన్ని కాలితో ఉపయోగించే విధంగా శాశ్వతంగా ఏర్పాటుచేసుకుంటే, నీటి వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు. 

చేతులు కడుగునే ప్రాంతాల్లో నీటికి క్లోరిన్ తో కలిపితే అదనపు భద్రతా కల్పించినట్లౌతుంది. 

మరుగుదొడ్ల నిర్వహణలో మంచి పద్ధతులు పాటించాలి, సమాజాల్లో పరిశుభ్రతను విధిగా పాటించాలి.  మరుగుదొడ్లను ఉపయోగించేటప్పుడు ముఖానికి కవర్ పెట్టుకోవాలి. కాలికి పాద రక్షలు వేసుకోవాలి. కాల కృత్యాలు తీర్చుకోగానే చేతులు శుభ్రంగా కడుగుకోవాలి. సామాజిక దూరాన్ని విధిగా పాటించాలి. అంటు రోగాలు రాకుండా బహిరంగ ప్రదేశాలు, ఇళ్ళు ఎప్పటికప్పుడు  శుభ్రం చేస్తూ ఉండాలి.  

అధికారులు, స్వచ్చంద కార్యకర్తలు, సమాజాలు ఈ మార్గదర్శకాల అమలు చేసి, ఈ పరిష్కారాలకు స్థిరత్వాన్ని తీసుకురావల్సిన అవసరం ఉంది.   వ్యాధి వ్యాప్తి చెందకుండా కీలక పాత్ర పోషిస్తున్న ముందు వరసలో పనిచేసే కార్మికులు, పారిశుధ్య సిబ్బందికి పూర్తి సహకారం అందించి ఈ మార్గదర్శకాలను పాటించవలసిన అవసరాన్ని వారికి తెలియజేయాలి.  

" కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా, మేము చేసిన ప్రయత్నంలో, ప్రతి సందర్భంలోనూ, భారదేశం మాకు సహకరించింది.  ఉదాహరణకు ధారవి వంటి జన సమ్మర్ధ ప్రదేశాలపై దృష్టి సారించాలి.  పొదుపైన, ప్రభావంతమైన పరికరాలు ఎటువంటి అసమాన సానుకూల ప్రభావాన్ని కలిగిస్తాయో - మార్గదర్శకాలతో పాటు పి.ఎస్.ఏ. కార్యాలయ బృందం కలిసి చూపింది. ఉమ్మడి మరుగుదొడ్లు, స్నానాల గదులు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. సామాజిక నాయకులు, ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్ సంస్థలు మొదలైన వారు ఈ సూచనలను, ఇతర జాగ్రత్తలను అమలుచేయాలని కోరుతున్నాము." --- అని భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు ప్రొఫెసర్ కే. విజయ రాఘవన్ పేర్కొన్నారు. 

వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి సహాయపడాలనుకునే కార్పొరేట్ కార్యాలయాలు, ప్రభుత్వేతర సంస్థలు, 

ముఖ్యంగా జన సాంద్రత ఎక్కువగా  ఉండే పట్టణ ప్రాంతాల్లో సమాజాలు, స్వచ్చంద కార్యకర్తలతో కలిసి ఈ మార్గదర్శకాలను అమలుచేయడానికి ప్రయతించాలి. 

ఈ మార్గదర్శకాలు ఇంగ్లీష్ తో పాటు హిందీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. 

 


(Release ID: 1614201) Visitor Counter : 288