వ్యవసాయ మంత్రిత్వ శాఖ
నేషనల్ అగ్రికల్చరల్‌మార్కెట్ పోర్టల్ ఈ-నామ్ 2020 ఏప్రిల్ 14న నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది.
వ్యవసాయ ఉత్పత్తులకు , “ఒక దేశం, ఒక మార్కెట్ ” దార్శనికతను సాకారం చేయడానికి సాయం
త్వరలోనే 415 ఈ-నామ్ అదనపు మండీల ఏర్పాటుతో త్వరలోనే వీటి సంఖ్య 1000 కి చేరనుంది.
ఈ-నామ్ ప్లాట్‌ఫామ్‌పై 1.66 కోట్ల రైతులు, 1.28 లక్షల రిజిస్టర్డ్ ట్రేడర్లు నమోదు చేసుకున్నారు.
భారతదేశంలో వ్యవసాయ మార్కెట్‌ను సంస్కరించడంలో ఈ-నామ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఒక పెద్ద ముందడుగు: శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
ప్రస్తుత కోవిడ్ -19 లాక్‌డౌన్ నేపథ్యంలో హోల్‌సేల్ మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు, ఈ-నామ్ కింద సరఫరా వ్యవస్థను చురుకుగా కొనసాగించడానికి పలు చర్యలు చేపట్టడం జరిగింది: శ్రీ నరేంద్రసింగ్ తోమర్
Posted On:
13 APR 2020 8:56PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా గల వ్యవసాయ ట్రేడింగ్ పోర్టల్ ఈ-నామ్ అమలులోకి వచ్చి రేపటితో (14-04-2020) నాలుగేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, సహకార రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, మాట్లాడుతూ,
వ్యవసాయ మార్కెటింగ్‌లో ఇ-నామ్ ఒక వినూత్న ప్రయత్నం. ఇది రైతులకు, కొనుగోలుదారులకు పెద్ద సంఖ్యలో మార్కెట్లను డిజిటల్‌గా అందుబాటులో ఉంచడానికి , ధరలను తెలుసుకునే యంత్రాంగాన్ని మెరుగుపరచడం ద్వారా వాణిజ్య లావాదేవీలలో పారదర్శకత సాధించడానికి ,నాణ్యతను బట్టి ధరను పొందడానికి వ్యవసాయ ఉత్పత్తులకు ఒకే దేశం, ఒకే మార్కెట్ సాధించడానికి ఇది ఉ పకరిస్తూ వచ్చింది..
.
రైతులకు సరుకుల మార్కెటింగ్‌ను సులభతరం చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ-నామ్‌ను ఏప్రిల్ 14, 2016 న 21 మండీలలో ప్రధానమంత్రి ప్రారంభించారు, ఇది ఇప్పుడు 16 రాష్ట్రాలు 02 కేంద్రపాలిత ప్రాంతాలలో 585 మండీలకు చేరుకుంది.
మరో 415 మండీలకు ఈ ఈ-నామ్ సదుపాయాన్ని విస్తరింప చేస్తారు. ఇది మొత్తం ఈ-నామ్ మండిల సంఖ్యను త్వరలో 1000 కి తీసుకువెళుతుందని ఆయన చెప్పారు. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం భారతదేశంలో వ్యవసాయ మార్కెట్‌ను సంస్కరించడంలో భారీ ముందడుగుగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు
1.66 కోట్లకు పైగా రైతులు, 1.28 లక్షల మంది వ్యాపారులు ఈ-నామ్ ప్లాట్‌ఫామ్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన అన్నారు. రైతులు ఈ-నామ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి ఎలాంటి రుసుము ఉండదు. ఆన్‌లైన్‌లో అమ్మకానికి అన్ని ఈ-నామ్ మండిలలో రైతులు తమ ఉత్పత్తులను అప్‌లోడ్ చేస్తున్నారు .వ్యాపారులు ఏ ప్రదేశం నుండి అయినా ఈ-నామ్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్న లాట్ల కోసం బిడ్ చేయవచ్చు.
లాక్ డౌన్ సమయంలో రైతులు , వ్యాపారులకు సకాలంలో తగిన రవాణా సదుపాయం కల్పించడానికి , వ్యవసాయ ఉత్పత్తుల లాజిస్టిక్స్‌లో అడ్డంకులు తొలగించడానికి ఈ -నామ్ ప్లాట్‌ఫాం బ్లాక్ బక్, రివిగో, మావిన్, ట్రక్ సువిధా, ట్రక్ గురు,ట్రాన్సిన్ లాజిస్టిక్స్, ఎలాస్టిక్ రన్ మొదలైన పెద్ద రవాణా అగ్రిగేటర్లతో ఇంటర్‌ఫేస్‌ను సృష్టించింది. ఇది మండి నుండి వివిధ ప్రదేశాలకు ఉత్పత్తి సకాలంలో రవాణాకు అవసరమైన ఏర్పాటు చేయడానికి వ్యాపారులకు సహాయపడుతుంది. ఈ ఇంటర్‌ఫేస్‌తో, వ్యాపారులు 7.76 లక్షలకు పైగా ట్రక్కులను ఇనామ్ ప్లాట్‌ఫామ్ ద్వారా యాక్సెస్ చేయగలరు.
ప్రస్తుత కోవిడ్ -19 లాక్ డౌన్ సమయంలో, టోకు మార్కెట్లలో రద్దీ తగ్గించడానికి , ఈ-నామ్ కింద ఇటీవల ప్రారంభించిన మాడ్యూళ్ళను కలిగి ఉన్న సరఫరా వ్యవస్థను వేగవంతం చేయడానికి తమ మంత్రిత్వ శాఖ అనేక చర్యలను తీసుకుందని కేంద్ర వ్యవసాయ మంత్రి చెప్పారు అవి: -
రైతులు తమ ఉత్పత్తులను డబ్ల్యు ఆర్ డి ఎ రిజిస్టర్డ్ గిడ్డంగుల నుండి విక్రయించటానికి గిడ్డంగి ఆధారిత ట్రేడింగ్ మాడ్యూల్ వీలు కల్పిస్తుంది. రిజస్టర్డ్ గిడ్డంగులను మార్కెట్లుగా నోటిఫై చేశారు.
ఎఫ్‌పిఒ ట్రేడింగ్ మాడ్యూల్, ఎఫ్.పి.ఒ లు వాటి ఫోటో , నాణ్యతా ప్రమాణాలతో సేకరణ కేంద్రాల నుండి ఉత్పత్తులను అప్‌లోడ్ చేయడానికి మండీలకు వెళ్లకుండా బిడ్డింగ్ సదుపాయాన్ని పొందటానికి వీలు కల్పిస్తుంది, ఇది వారి లాజిస్టిక్ ఖర్చులను ,వారి ఉత్పత్తులను విక్రయించడానికి ఇబ్బందులను తగ్గిస్తుంది.
కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో ఈ ప్రయత్నాలు రైతులు, ఎఫ్‌పిఓలు , సహకార సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయని శ్రీ తోమర్ చెప్పారు.
ఈ సందర్భంగా, వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ-నామ్ కేవలం ఒక పథకం మాత్రమే కాదని, ఇది చిట్ట చివరి రైతుకు ప్రయోజనం చేకూర్చేందుకు, వారి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే విధానాన్ని మార్చడానికి దోహదపడుతుందన్నారు.. ఈ చొరవతో మన రైతులకు అదనపు ఖర్చులు లేకుండా పారదర్శక పద్ధతిలో పోటీ , మంచి ధరలను పొందే వీలు కలుగుతుంది. తద్వారా వారు ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
ఆన్‌లైన్ , పారదర్శక బిడ్డింగ్ విధానం రైతులను ఈ-నామ్ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువగా వ్యాపారం చేయడానికి ప్రోత్సహిస్తోంది. మొత్తం వాణిజ్య పరిమాణం 3.39 కోట్ల మెట్రిక్ టన్నుల భారీ వస్తువులు , సుమారు రూ. లక్ష కోట్ల విలువైన 37 లక్షల సంఖ్యలో వెదురు , కొబ్బరి ఈ-నామ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదైంది. గత నాలుగు సంవత్సరాల్లో కాంపౌండ్ సగటు వృద్ధి రేటు (సిఎజిఆర్) వరుసగా విలువ , పరిమాణం పరంగా 28 శాతం,18 శాతంగా ఉంది.
భారతదేశం అంతటా లాట్‌కు సగటున బిడ్ల సంఖ్య 2016-17లో, లాట్‌కు 2 బిడ్ల నుంచి 2019-20లో లాట్‌కు దాదాపు 4 బిడ్లకు పెరిగింది. పంట కోత కాలంలో, ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని వంటి కొన్ని మండీలలో - ప్రధానంగా పత్తి మార్కెట్ లో లాట్‌కు 15 బిడ్ల కంటే ఎక్కువ వచ్చాయి. రైతులకు పారదర్శకంగా పోటీ మార్గంలో ఎక్కువ కొనుగోలుదారులను పొందడానికి ఇది సహాయపడుతోంది.
మొదట్లో ఇది 25 వస్తువులతో ప్రారంభమైంది, ఈ-నామ్ పోర్టల్‌లో ట్రేడబుల్ ప్రమాణాలతో 150 వస్తువులపై ఈ-ట్రేడ్ సౌకర్యాలు అందించారు. ఈ-నామ్ మండిలలో క్వాలిటీ అస్సేయింగ్ టెస్టింగ్ సదుపాయాలు అందిస్తున్నారు. ఇది వారి ఉత్పత్తుల నాణ్యతతో ధరలను పొందడంలో రైతులకు సహాయపడుతుంది. పరీక్షించిన లాట్ల సంఖ్య 2016-17లో 01 లక్షలు ఉండగా అది 2019-20లో దాదాపు 37 లక్షలకు పెరిగింది.
ఈ-నామ్ ప్లాట్‌ఫాం, మొబైల్ యాప్‌ను .అడ్వాన్స్ రిజర్వేషన్ వంటి రైతుకు అనుకూలంగా ఉండే ఫీచర్లతో మరింత మెరుగుపరిచారు. ఇది మండి గేట్ ప్రవేశ ద్వారం వద్ద రైతుల నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తుంది , సమర్థతను పెంచుతుంది. గేట్ వద్ద రికార్డింగ్‌ను సులభతరం చేస్తుంది, రైతులు ఇప్పుడు అస్సేయింగ్ రిపోర్ట్ చూడగలుగుతున్నారు. రైతులు బిడ్ల పురోగతిని మొబైల్ ద్వారా చూడవచ్చు రైతులు సమీపంలోని మాండిలలో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందవచ్చు.
ఈ-నామ్ ప్లాట్‌ఫాంపై వేలం వేసిన తరువాత రైతుల సరుకుల తూకం ఖచ్చితంగా ఉండేలా చూడడానికి,తూకాలలో పారదర్శకత తీసుకురావడానికి , ఎలక్ట్రానిక్ తూకాల స్కేల్స్ అందించబడ్డాయి, వ్యాపారులు, రైతులకు చెల్లింపులను ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారా భీమ్ చెల్లింపు సౌకర్యాన్ని ఉపయోగించి చేయవచ్చు.
మండిలో నేరుగా లేకుండా కొనుగోలుదారులు ఎక్కడి నుండైనా వేలం వేయడం, ట్రేడర్ లాగిన్‌లో ఈ-నామ్ షాపింగ్ కార్ట్ సౌకర్యం, బహుళ ఇన్వాయిస్‌ల కోసం సింగిల్ ఇ-పేమెంట్ లావాదేవీ ఫీచర్లు, బంచ్ చేయడం వంటి అదనపు ఒటిజి వంటి ప్రత్యేకతలు వ్యాపారులకు కల్పించారు. బహుళ ఇన్వాయిస్‌లు, ఈ-చెల్లింపుపై ఆటోమేటిక్ డిస్కౌంట్ , రిబేటు , ఇ-చెల్లింపు సమయంలో వ్యాపారులకు డిస్కౌంట్, ఏకీకృత ట్రేడింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలైనవి కూడా కల్పించారు.
అస్సేయింగ్ విషయంలో వ్యాపారులలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, డిపార్టమెంట్ కొత్త ఫీచర్లను తెచ్చింది.:
ఈ నామ్ మొబైల్ యాప్ ద్వారా కమాడిటీ కుప్ప మొత్తాన్ని సంపూర్ణంగా ఫోటోతీసి ఉంచుతారు.
అస్సేయర్ లేబరెటరీ, పరికరాలతో సహా మూడింట రెండువంతుల 2 డి చిత్రాన్ని అప్‌లోడ్ చేయవచ్చు.
వ్యాపారిపై మంచి విశ్వాసం కుదరడానికి ఈ-నామ్‌లో వస్తువుల శాంప్లింగ్ ప్రక్రియ 2 డి ఇమేజ్‌ను కూడా అప్‌లోడ్ చేస్తారు.
ఈ-నామ్ వ్యవస్థను మెరుగుపరచడానికి , వ్యాపారులు, రైతుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పెంపొందించడానికి, 16 రాష్ట్రాల నుండి 977 రైతు ఉత్పత్తి సంస్థలను ఈ-నామ్ ప్లాట్‌ఫాంలో చేర్చారు.
జార్ఖండ్ వంటి రాష్ట్రాలు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) ప్లాట్‌ఫాం ద్వారా ఫార్మ్ గేట్ ట్రేడింగ్‌ను ప్రారంభించాయి, దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తుల వివరాలను ఎపిఎంసికి రానవసరం లేకుండానే ఆన్‌లైన్ బిడ్డింగ్ కోసం చిత్రంతో పాటు అప్‌లోడ్ చేస్తున్నారు. అదేవిధంగా, ఎఫ్‌పిఓలు కూడా తమ ఉత్పత్తుల ట్రేడింగ్‌కు ,తమ ఉత్పత్తులను సేకరణ కేంద్రాల నుండి ఈ-నామ్ కింద అప్‌లోడ్ చేస్తున్నాయి
ఈ ప్లాట్ ఫామ్ వివిధ మండీలమధ్య వాణిజ్యంలో పెరుగుదలను సాధించింది. అలాగే, ఇటీవల, రాష్ట్రాల మధ్య కూడా పెరుగుదల సాధించింది.. ఇప్పటివరకు 13 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్రాష్ట్ర వాణిజ్యంలో పాల్గొన్నాయి (ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చండీగడ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్ తమిళనాడు) .అంతర్ రాష్ట్ర వాణిజ్యం . 20 వస్తువులలో నమోదైంది. (వీటిలో కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నూనెగింజలు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి ఉన్నాయి)
(Release ID: 1614197)
Visitor Counter : 226