శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

డిబిటి/యాంటీ-కొవిడ్ల సంయోగంతో- కొవిడ్-19కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరక్షకాల తయారీతో చికిత్స చేయడానికి కృషి జరుగుతోంది.

జన్యు కణాలను వేరుపరచి ప్రతిరక్షకాలను సంకేతనం చేయడం సార్స్(ఎస్ఏఆర్ఎస్)-కోవ్(సిఓవి)-2, కొవిడ్19 కోసం నిర్బలకరణము చేయడం

Posted On: 12 APR 2020 11:43AM by PIB Hyderabad

సార్స్ కొరొనా వైరస్-2(ఎస్ఏఆర్ఎస్-సిఓవి-2) వలన వచ్చే కొవిడ్-19 వలన అనేక మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎటువంటి  ప్రత్యేక చికిత్స లేకుండానే ఈ వైరస్ సోకిన వారు చాలా మంది కోలుకొంటున్నారు. వైరస్ దాడికి ప్రతిస్పందనగా శరీరంలోప ప్రతిరక్షకాల ఉత్పత్తి వలన  ఇది జరుగుతోంది.

 గత కొన్ని సంవత్సరాలుగా, ఈ వైరస్ సోకి కోలుకుంటున్న రోగి యొక్క ప్లాస్మా నుండి ప్రతిరక్షకాలను తీసుకుని డిఫ్తీరియా, టెటానస్, రాబిస్ మరియు ఎబోలా వంటి  వివిధ వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతోంది. జన్యుకణ-ఆధారిత రికంబిటాంట్ సాంకేతికత ద్వారా అటువంటి ప్రతిరక్షకాలను ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయడం జరుగుతోంది. సార్స్-2(ఎస్ఏఆర్ఎస్-సిఓవి-2)కు ప్రతిరక్షకాలతో అటువంటి చికిత్స చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కృషి జరుగుతోంది.

భారత దేశంలో  ప్రొ.విజయ్ చౌధురి నేతృత్వంలో భారత ప్రభుత్వ శాస్త్ర మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని జీవసాంకేతిక విజ్ఞాన శాఖ వారి సహాయ సహకారాలతో ఢిల్లీ యూనివర్సిటీ దక్షిణ క్యాంప్లో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఇఫోక్షియస్ డిసీజ్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(యుడిఎస్సి-సిఐఐడిఆర్ఇటి)లో పరిశోధనలు జరుగుతున్నాయి.

వీరి బృందం జన్యుకణాలను వేరుచేసి ప్రతిరక్షకాలను సంకేతనం చేసి సార్స్-2(ఎస్ఏఆర్ఎస్-సిఓవి-2) నిర్బలకరణము చేస్తున్నారు. ఇప్పటికే వారు కొవిడ్-19 నుండి కోలుకున్న రోగుల నుండి ప్రతిరక్షకాలను భారీగా సేకరించి వారి ప్రయోగశాలలో నిలువచేసి ఉంచారు.

ఈ ప్రతిరక్షక జన్యువులు ప్రయోగశాలలో ప్రరక్షకాలను మరల తయారు చేయుటకు ఉపయోగపడతాయి, ఇవి వైరస్ను నిర్బలకరణము చేయుటలో విజయవంతంగా పనిచేస్తాయి. ఇవి వైరస్కు వ్యతిరేకంగా పనిచేసే రోగనిరోధక మరియు చికిత్సకు ఉపయోగపడే ప్రతిరక్షాల బహువార్షిక వనరులుగా పనిచేస్తాయి.

కొవిడ్-19 వ్యతిరేక పరిశోధనలో భాగంగా ప్రొ.విజయ్ చౌధురి నాయకత్వంలో జాతీయ వ్యాధినిరోధక చికిత్సావిధాన సంస్థ(ఎన్ఐఐ)లోని డా. అమూల్య పండా మరియు జెన్నోవా బయోఫార్మాసూటికల్ లిమిటెడ్, పూణె(జిబిఎల్)కు చెందిన డా. సంజయ్ సింగ్  ఈ పరిశోధనలు చేస్తున్నారు.

 [సంప్రదించవలసిన వ్యక్తి:ప్రొ.విజయ్ కె చౌధురి,ఇమెయిల్vkchaudhary@south.du.ac.in]

 



(Release ID: 1613566) Visitor Counter : 190