రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నాలుగు నెలల అనంతరం వ్యూహాత్మక శ్రీనగర్- లే రహదారిని ప్రారంభించిన బి.ఆర్.ఓ.

Posted On: 12 APR 2020 11:01AM by PIB Hyderabad

లడఖ్ ను బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసే వ్యూహాత్మక శ్రీనగర్ - లే రహదారిని సరిహద్దు రహదారి సంస్థ (బి.ఆర్.ఓ.) శనివారం ప్రారంభించింది.  సుమారు 18 చమురు ట్యాంకులు మరియు ఇతర నిత్యావసర వస్తువులతో ఉన్న వాహనాలను జోజిలా  పాస్ నుండి లే / లడఖ్ వైపు వెళ్లేందుకు ప్రాధమికంగా అనుమతించారు.  జోజిలా పాస్ వద్ద ఇటీవల మంచు కురిసినప్పటికీ ఈ వాహనాలకు అనుమతినిచ్చారు. 

 

 

జోజిలా పాస్ వద్ద భారీగా మంచు కురుస్తూ ఉండడంతో గత ఏడాది డిసెంబర్ నుండి 524 కిలోమీటర్ల ఈ రహదారిని మూసి ఉంచారు.  కేంద్ర పాలిట ప్రాంతమైన లడఖ్ లో నిత్యావసర వస్తువులు నిల్వ చేయవలసిన ఆవశ్యకత ఏర్పడడంతో లడఖ్ డివిషనల్ కమీషనర్ ఆదేశాల మేరకు రహదారిని తెరిచారు.  ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, 11,500 అడుగుల ఎత్తులో ఉన్న రహదారిపై తాజాగా పడిన మంచును ప్రాజెక్ట్ బీకాన్ మరియు ప్రాజెక్ట్ విజయక్  బృందాలు తొలగించాయి

 

 

 

గత ఆరు దశాబ్దాల రికార్డును అధిగమిస్తూ ఈ ఏడాది అత్యధికంగా మంచు కురిసింది. మంచు తొలగించే కార్యక్రమాన్ని బి.ఆర్.ఓ. కి చెందిన ప్రాజెక్ట్ బీకాన్ బృందం గగన్ గిర్ నుండి జీరో పాయింట్ వరకు చేపట్టగాజీరో పాయింట్ నుండి దాస్ వరకు ప్రాజెక్ట్ విజయక్ చేపట్టింది

 

  

 

***


(Release ID: 1613565) Visitor Counter : 170