ప్రపంచం కోవిడ్-19 లాక్ డౌన్ తో తల్లడిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లి దండ్రులకు ఇది పరీక్షా సమయం. ఈ క్లిష్ట సమయంలో విద్యాసంస్థల అధిపతులు, డిజిటల్ పద్ధతుల ద్వారా విద్యార్థులు సరైన రీతిలో సమయాన్ని వినియోగించుకుని, విద్య సంవత్సరం నష్ట పోకుండా చూడాలని కేంద్ర మానవ వనరుల అభివుద్ది శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్' సూచించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రాంతీయ కార్యాలయం ఫేస్ బుక్, యూట్యూబ్ ఐడి లు రూపొందించి VI నుండి XII విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాల బోధన ఏర్పాట్లు చేసారు.
ఇప్పటికే IX నుండి XII తరగతులకు పేస్ బుక్, యూట్యూబ్ లో లైవ్ ఆన్ లైన్ బోధనకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. సుమారు 90,000 వీక్షణలు, 40,000 కామెంట్లు ఈ రెండు రోజుల్లోనే వచ్చాయి. 13,343 మంది సబ్ స్క్రైబ్ర్లు చేరారు. అన్ని తరగతులు, పాఠ్యాంశాలకు ఎంపిక చేసిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బోధనా కార్యక్రమంలో పరస్పరం విద్యార్థులకు మధ్యలో వచ్చే సందేహాలను నివృతి చేసే అవకాశం కూడా ఉంది. ముందుగానే అన్ని పాఠ్యాంశాలకు కాలపట్టికను రూపొందించి విద్యాసంస్థల వాట్సాప్ గ్రూప్ ల ద్వారా సమాచారాన్ని విద్యార్థులకు చేరవేశారు. యూట్యూబ్ లో ప్లే లిస్ట్ ను కూడా రూపొందించి పాఠాలను విద్యార్థులు చూసుకునే అవకాశం కల్పించారు.
విద్య అంశాలను వీడియోల రూపంలో తయారు చేయడానికి మూవీమేకర్, పవర్ పాయింట్ విండోలు, స్క్రీన్ రికార్డర్ వంటి వివిధ సాఫ్ట్ వేర్ లను ఉపయోగించారు. హోంవర్క్, ఇంటి దగ్గర నుండి చేసే అభ్యాసాలను ఉపాధ్యాయులు సిద్ధం చేసి ఎప్పటికప్పుడు విద్యార్థులకు పంపుతున్నారు. గతంలో రోజువారీలా కాకుండా కాస్త వైవిధ్యంగా పరస్పరం అభ్యాస కార్యక్రమం జరుగడం విద్యార్థులకు ఆసక్తి కలిగిస్తుంది.


ప్రైమరీ తరగతులకు చెందిన చిన్నారుల కోసం ఉపాధ్యాయులు- వీడియోలు రూపొందించి వాట్సాప్, యూట్యూబ్ లోని అప్లోడ్ చేస్తున్నారు. విద్యార్థులు తల్లి దండ్రులు కామెంట్ సెక్షన్ లో ప్రస్తావించే సమస్యలకు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు సమాధానాలు చెబుతుంటారు. సామజిక దూరం, ఇళ్లల్లోనే విద్యార్థులు, తల్లిదండ్రులను సురక్షితంగా ఉండాలని కోరడం మంచి ఫలితాలు ఇస్తోంది. వారికి స్వయం, దీక్ష, ఈ-పాఠశాల వంటి బోధనా వనరులను పూర్తి అందుబాటులోకి తెచ్చారు. హోంవర్క్, అసైన్మెంట్ లను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు పరిశీలిస్తారు. రోజుకు కనీసం అయిదుగురు విద్యార్థులతో వారు మాట్లాడుతారు. ఇలా జరుగుతున్న బోధనా విధానం అటు విద్యార్థులు, తల్లి దండ్రులకు ఆసక్తికరంగా ఉండడమే కాకుండా, వారు పూర్తిగా దీనిలో భాగస్వామ్యం అవుతున్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా తగు రీతిలో పాఠ్యాంశాల బోధనకు ఉపక్రమిస్తున్నారు.
****