హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 పోరులో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులకు, ఇతర వైద్య సిబ్బందికి అవసరమైన పోలీసు భద్రత కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాల సంబంధిత సిబ్బందికి అదేశాలు జారీ చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
11 APR 2020 8:18PM by PIB Hyderabad
ఈ మధ్య కాలంలో వైద్యులు, వైద్య సిబ్బందిని వేధింపులకు గురి చేసిన సంఘటనల నేపథ్యంలో ఆసుపత్రుల వద్ద కోవిడ్ -19 నిర్ధారణ అయిన రోగుల వద్ద సేవలు అందిస్తున్న వారికి అవసరమైన పోలీసు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించింది.
వ్యాధి లక్షణాలు తెలుసుకోవడానికి వస్తున్న ప్రజలను పరీక్షించే వివిధ ప్రదేశాలను సందర్శించే వైద్యులు మరియు వైద్య సిబ్బందికి అవసరమైన భద్రత కల్పించాలని కూడా ఇందులో తెలియజేశారు.
(रिलीज़ आईडी: 1613468)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam