వ్యవసాయ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా - నిరంతరాయంగా కొనసాగుతున్న వేసవి పంటలు విత్తే ప్రక్రియ.
వేసవి పంటలు విత్తిన ప్రాంతం 11.64 శాతం మేర గణనీయంగా పెరిగింది. 8.77 శాతం మేర పెరిగిన వరి సాగు.
Posted On:
11 APR 2020 5:37PM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాధిని అరికట్టే చర్యల్లో భాగంగా 24వ తేదీ అర్ధరాత్రి నుండీ అమలులో ఉన్న 21 రోజుల లాక్ డౌన్ వల్ల తలెత్తుతున్న ఇబ్బందులనూ, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి వల్ల ఎదురౌతున్న సమస్యలను అధిగమిస్తూ, వేసవి పంటలు విత్తే కార్యక్రమం సంతృప్తికరంగా కొనసాగుతోంది. గత నెల నుంచీ, ముఖ్యంగా, 2020 ఏప్రిల్ 25వ తేదీ నుండి లాక్ డౌన్ నేపథ్యంలో, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ - వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమశాఖ సేకరించిన గణాంకాల ప్రకారం, 2020 ఏప్రిల్ 10వ తేదీ వరకు, బియ్యం, పప్పులు, తృణ ధాన్యాలు, నూనె గింజలతో సహా వేసవి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి, గత ఏడాది కంటే 11.64 శాతం ఎక్కువగా నమోదయ్యింది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 37.12 లక్షల హెక్టార్లలో వేసవి పంటలు సాగవ్వగా, 2019-20 సంవత్సరంలో ఈ పంటల సాగు 48.76 లక్షల హెక్టార్లకు పెరిగింది. గత సంవత్సరం సంబంధిత వారంలో ఏప్రిల్ 10వ తేదీ వరకు 41.81 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి.
మొత్తం వేసవి పంటలలో వరి 8.77 శాతం ఎక్కువ విస్తీర్ణంలో విత్తినట్లు నమోదయ్యింది. మిగిలిన పంటలన్నీ 1 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నట్లు నమోదయ్యింది. అయితే రాగి పంట మాత్రం గత ఏడాది కంటే 0.06 శాతం తక్కువగా సాగక్కుతున్నట్లు నమోదయ్యింది. వేసవి వరి గత ఏడాది ఇదే సమయంలో 23.81 లక్షల హెక్టార్లలో సాగు కాగా, ఈ ఏడాది 32.58 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు వార్తలందాయి.
కాగా, రాష్ట్రాల వారీగా నమోదైన వారి సాగు వివరాలు ఇలా ఉన్నాయి :
పశ్చిమ బెంగాల్ - 11.25 లక్షల హెక్టార్లు,
తెలంగాణా - 7.45 లక్షల హెక్టార్లు,
ఒడిశా - 3.13 లక్షల హెక్టార్లు,
అస్సాం - 2.73 లక్షల హెక్టార్లు,
కర్ణాటక - 1.64 లక్షల హెక్టార్లు,
ఛత్తీస్ ఘడ్ - 1.50 లక్షల హెక్టార్లు,
తమిళనాడు - 1.30 లక్షల హెక్టార్లు,
బీహార్ - 1.22 లక్షల హెక్టార్లు,
మహారాష్ట్ర - 0.65 లక్షల హెక్టార్లు,
మధ్యప్రదేశ్ - 0.59 లక్షల హెక్టార్లు,
గుజరాత్ - 0.54 లక్షల హెక్టార్లు,
కేరళ - 0.46 లక్షల హెక్టార్లు.
పప్పు ధాన్యాల విషయానికి వస్తే, గత ఏడాది ఇదే సమయంలో 3.97 లక్షల హెక్టార్లలో సాగు కాగా, ఈ ఏడాది 3.01 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు నివేదికలందాయి.
రాష్ట్రాల వారీగా పప్పుధాన్యాల సాగు వివరాలు ఇలా ఉన్నాయి :
తమిళనాడు - 1.46 లక్షల హెక్టార్లు,
ఉత్తరప్రదేశ్ - 0.73 లక్షల హెక్టార్లు,
పశ్చిమ బెంగాల్ - 0.59 లక్షల హెక్టార్లు,
గుజరాత్ - 0.51 లక్షల హెక్టార్లు,
ఛత్తీస్ గఢ్ - 0.24 లక్షల హెక్టార్లు,
బీహార్ - 0.18 లక్షల హెక్టార్లు,
కర్ణాటక - 0.08 లక్షల హెక్టార్లు,
పంజాబ్ - 0.05 లక్షల హెక్టార్లు,
మహారాష్ట్ర - 0.04 లక్షల హెక్టార్లు,
మధ్య ప్రదేశ్ - 0.03 లక్షల హెక్టార్లు,
జార్ఖండ్ - 0.03 లక్షల హెక్టార్లు,
తెలంగాణా - 0.02 లక్షల హెక్టార్లు,
ఉత్తరాఖండ్ - 0.01 లక్షల హెక్టార్లు.
తృణ ధాన్యాల సాగును గమనిస్తే, గత ఏడాది ఇదే సమయంలో 4.33 లక్షల హెక్టార్లలో సాగు కాగా, ఈ ఏడాది 5.54 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు నివేదికలందాయి.
రాష్ట్రాల వారీగా తృణ ధాన్యాల సాగు వివరాలు ఇలా ఉన్నాయి :
గుజరాత్ - 2.27 లక్షల హెక్టార్లు,
పశ్చిమ బెంగాల్ - 1.21 లక్షల హెక్టార్లు,
మహారాష్ట్ర - 0.63 లక్షల హెక్టార్లు,
బీహార్ - 0.41 లక్షల హెక్టార్లు,
కర్ణాటక - 0.39 లక్షల హెక్టార్లు,
ఛత్తీస్ గఢ్ - 0.29 లక్షల హెక్టార్లు,
తమిళనాడు - 0.26 లక్షల హెక్టార్లు,
మధ్యప్రదేశ్ - 0.08 లక్షల హెక్టార్లు,
ఝార్ఖండ్ - 0.01 లక్షల హెక్టార్లు,
నూనె గింజల సాగు విషయానికి వస్తే, గత ఏడాది ఇదే సమయంలో 5.97 లక్షల హెక్టార్లలో సాగు కాగా, ఈ ఏడాది 6.66 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు నివేదికలందాయి.
రాష్ట్రాల వారీగా నూనె గింజల సాగు వివరాలు ప్రధానంగా ఇలా ఉన్నాయి :
పశ్చిమ బెంగాల్ - 1.33 లక్షల హెక్టార్లు,
కర్ణాటక - 1.30 లక్షల హెక్టార్లు,
గుజరాత్ - 1.09 లక్షల హెక్టార్లు,
ఒడిశా - 0.62 లక్షల హెక్టార్లు,
మహారాష్ట్ర - 0.58 లక్షల హెక్టార్లు,
తమిళనాడు - 0.53 లక్షల హెక్టార్లు,
ఆంధ్రప్రదేశ్ - 0.41 లక్షల హెక్టార్లు,
ఉత్తరప్రదేశ్ - 0.28 లక్షల హెక్టార్లు,
తెలంగాణ - 0.21 లక్షల హెక్టార్లు,
ఛత్తీస్ గఢ్ - 0.18 లక్షల హెక్టార్లు,
హర్యానా - 0.06 లక్షల హెక్టార్లు,
పంజాబ్ - 0.04 లక్షల హెక్టార్లు,
బీహార్ - 0.03 లక్షల హెక్టార్లు,
మధ్యప్రదేశ్ - 0.02 లక్షల హెక్టార్లు.
వేసవి పంటల కింద సాగు విస్తీర్ణం వివరాల కోసం Click here ఇక్కడ క్లిక్ చేయండి.
*****
(Release ID: 1613428)
Visitor Counter : 161