రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై పోరాటానికి సుమారు 2,000 మంది ఎన్.సి.సి క్యాడెట్లకు విధులు కేటాయింపు, మరో 50,000 మంది స్వచ్ఛంద సేవలు
Posted On:
11 APR 2020 4:20PM by PIB Hyderabad
కోవిడ్-19 పై యుద్ధానికి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి) వాలంటీర్లు అనేక రాష్ట్రాల్లో పాలన యంత్రాంగం, డిఫెన్స్, పోలీస్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. 'ఎక్సరసైజ్ ఎన్.సి.సి యోగదాన్' పేరుతో ఏప్రిల్ 1వ తేదీ నుండి విస్తృతంగా సేవలందిస్తున్నారు. ఇప్పటికే 2,000 మంది 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ కొనసాగుతుండడం వల్ల అనేక రాష్ట్రాల నుండి వివిధ అవసరాలకు వినతులు వస్తున్నాయి. ఎన్.సి.సి డైరెక్టర్ జనరల్ ప్రధాన కార్యాలయం పర్యవేక్షణలో సుమారు 50,000 మంది క్యాడెట్లను దేశ వ్యాప్త అవసరాల మేరకు ఎక్సరసైజ్ ఎన్.సి.సి. యోగదాన్ సేవలకు వినియోగిస్తున్నారు.
18 ఏళ్లకు పైబడిన యువతీయువకులను ప్రత్యేకంగా ఈ కోవిడ్ లాక్ డౌన్ సందర్బంగా వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. వీరందరూ సురక్షితంగా ఉండేందుకు తగిన పరికరాలు, ఏర్పాట్లను రాష్ట్రాలు చేస్తున్నాయి. వీరిని హాట్ స్పాట్ లు, నిర్బంధ ప్రాంతాల్లో వినియోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, వస్తు సరఫరా వ్యవస్థల్లోనూ, ఆహార పదార్థాల ప్యాకేజింగ్, ఆహారం, నిత్యావసర వస్తువుల పంపిణీ సందర్బంగా స్థానిక యంత్రంగానికి సహకారం, సామాజిక దూరం పాటించే దగ్గర, సీసీ టివి కంట్రోల్ రూంలు ... ఇలా వివిధ ప్రదేశాల్లో వారి సేవలను వినియోగిస్తున్నారు. అలాగే కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలను సామజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేసే పని కి కూడా ఎన్.సి.సి క్యాడెట్లను వినియోగిస్తున్నారు.
ఆపత్కాల పరిస్థితుల్లో ఆదుకోడానికి ఎన్.సి.సి. క్యాడెట్లు సన్నద్ధంగా ఉంటారని మరో సారి ఈ సంక్షోభ కాలంలో రుజువు అయింది. దేశవ్యాప్తంగా 17 డైరెక్టరేట్ల పరిథిలో 14 లక్షల మంది క్యాడెట్లు ఏ సమయంలోనైనా తమ సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారు.
****
(Release ID: 1613334)
Visitor Counter : 233
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam