హోం మంత్రిత్వ శాఖ
సరిహద్దు రక్షణ దళంతో భారత్-పాకిస్థాన్ మరియు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల కాపలా ఏర్పాట్లను సమీక్షించిన కేంద్ర హోం మంత్రి
కొవిడ్-19 గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు సరిహద్దుల గుండా దేశంలోనికి ప్రవేశాల రద్దు: సరిహద్దు రక్షణ దళంతో కేంద్ర హోం మంత్రి
Posted On:
10 APR 2020 5:54PM by PIB Hyderabad
సరిహద్దు రక్షణ దళం కమాండ్ మరియు సెక్టార్ ప్రధాన కార్యాలయాలతో భారత-పాకిస్థాన్ మరియు భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల కాపలా ఏర్పాట్లను నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అవిత్ షా. సరిహద్దుల వెంట ముఖ్యంగా కంచె లేని చోట భద్రతను మరింత పెంచాలని తద్వారా సరిహద్దుల నుండి దేశంలోనికి ప్రవేశించడానికి అనుమతించకుండా చర్యలు తీసుకోవచ్చని సరిహద్దు భద్రతా దళ అధికారులను ఆదేశించారు.
సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు కొవిడ్-19 గురించి మరియు నివారణ గురించిన అవగాహన కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. సరిహద్దు భద్రతా దళం స్థానికి జిల్లా పరిపాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ముందుకు పోవడం వలన ఏమరుపాటుగానైనా సరిహద్దులను దాటి ఇతరులు లోనికి వచ్చే అవకాశాలు ఉండవన్నారు.ప్రస్తుతం సరిహద్దు భద్రతా దళం కొవిడ్-19 విషయంలో చేస్తున్న కార్యక్రమాలు మరియు లాక్డౌన్ సందర్భంగా వారి సహాయ సహకారాలను హోం మంత్రి కొనియాడారు.
· అవగాహనా శిబిరాలు: కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ వారి మార్గదర్శకాల ప్రకారం
· పరిశుభ్రతా కార్యక్రమాలు, గ్రామల్లో సాధ్యమైన మేరకు
· ముఖానికి మాస్కులను మరియు చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులను సమకూర్చడం
· దూర ప్రాంతంలోని గ్రామాలకు, వలస కార్మికులకు, రోజు కూలీలకు మరియు సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న ట్రక్కుల డ్రైవర్లకు, అవసరమైన ప్రజలకు రేషన్, నీటి ప్యాకెట్లు మరియు వైద్య సౌకర్యాలను సమకూర్చడం.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి మరియు శ్రీ నిత్యానంద రాయ్ లతో పాటు కేంద్ర హోం కార్యదర్శి, సరిహద్దు నిర్వహణా కార్యదర్శి మరియు సరిహద్దు భద్రతా దళం డిజి పాల్గొన్నారు.
(Release ID: 1613061)
Visitor Counter : 167
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam