శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

శ్వాసకోశ స్రావాల సురక్షిత నిర్వహణ కోసం మేలైన శోషక పదార్థాన్ని రూపొందించిన శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి)

సురక్షితంగా సేకరణతో పాటు క్రిమిసంహార జెల్ మరియు క్వారంటైన్ ఉన్న వారికి ఉపయోగించడం కోసం మంచి ప్రతిపాదన అంటున్న డి.ఎస్.టి. కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ

“చిత్ర యాక్రిలోసోర్బ్ సెక్రిషన్ సాలిడిఫికేషన్ సిస్టమ్” గా పదార్థానికి పేరు నిర్ణయం

Posted On: 09 APR 2020 10:33AM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ (డి.ఎస్.టి) ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్త సంస్థ అయిన శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్.సి.టి.ఎమ్.ఎస్.టి)లోని శాస్త్రవేత్తలు శ్వాసకోశ స్రావాల సురక్షిత నిర్వహణ కోసం మేలైన శోషక పదార్థాన్ని రూపొందించారు. ఇది మరింత సమర్థవంతమైన సూపర్ ఆబ్జార్బెంట్ పదార్థం.

ఎస్.సి.టి.ఎమ్.ఎస్.టి. లోని బయో మెడికల్ టెక్నాలజీ విభాగం ఒక్క బయో మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్ మంజు.ఎస్ మరియు డాక్టర్ మనోజ్ కోమత్ చే అభివృద్ధి చేయబడిన చిత్ర యాక్రిలోసోర్బ్ సెక్రిషన్ సాలిడిఫికేషన్ సిస్టమ్ అన్ని రకాల శ్వాస కోశ ద్రవాల ఘనీకరణకు అత్యంత సమర్థవంతమైనది మరియు క్రిమి సంహారకం.

వివిధ అంటు వ్యాధులకు గురైన రోగుల నుంచి వచ్చిన శ్వాస కోశ స్రావాలను సురక్షితంగా పారవేయడం చాలా కీలకమైనదని డి.ఎస్.టి. కార్యదర్శి ప్రొ. అశుతోష్ శర్మ తెలిపారు. క్రిమిసంహారక పదార్థాలతో కూడిన ఈ జెల్ కారణంగా సేకరించడం సులువు, అదే సమయంలో పారవేయడం సులువు కావున ఇది ఆకర్షణీయమైన ప్రతిపాదన అని, స్రావాలను నిర్బంధించి పారవేసే అవకాశం దీనిలో ఉంటుందని ఆయన తెలిపారు.

యాక్రిలోసోర్బ్ దానిలో ఉండే పొడి బరువు కంటే కనీసం 20 రెట్లు ఎక్కువ ద్రవాలను అది పీల్చుకోగలదు. అంతే కాకుండా క్రిమి సంహారక పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఈ పదార్థంతో నిండిన కంటైనర్లు కలుషితమైన ద్రవాన్ని జెల్ గా తయారు చేస్తాయి. దాని వల్ల పడేసినప్పుడు చిందరవందర కావడమనే పరిస్థితి ఏర్పడదు. ఈ పదార్థం తర్వాత బయో మెడికల్ వ్యర్థాలుగా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆసుపత్రి సిబ్బందికి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సీసాలు మరియు డబ్బాలు తిరిగి శుభ్రపరచడానికి సిబ్బంది అవసరం లేదు. పారవేయడం కూడా సులభం అవుతుంది.

 ప్రస్తుతం చూషణ డబ్బాలు, పునర్వియోగించని స్పిట్ బ్యాగులు యాక్రిలోసోర్బ్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన వాటిలో ఉన్నాయి. ఇవి విపరీతమైన శ్వాసకోశ స్రావాల ఇబ్బందులు ఉన్న వారి నుంచి స్రావాలను సేకరిస్తాయి. ఉపయోగం తర్వాత కంటైనర్ స్పిల్ ప్రూఫ్ కావడమే కాకుండా సీలు వేయడానికి అవకాశం ఉంటుంది. శ్వాసకోశ రోగులు వినియోగించిన ఈ పదార్థాలను తర్వాత కాల్చివేయవచ్చు.

 

కోవిడ్ -19 లాంటి అంటు వ్యాధులతో బాధపడుతున్న రోగుల స్రావం విషయంతో పాటు ఇతర అంటువ్యాధులు సోకిన రోగుల స్రావాల నిర్వహణ ఆస్పత్రులకు పెద్ద సవాలు. ముఖ్యంగా కోవిడ్ లాంటి వాటి విషయంలో ఆస్పత్రి సిబ్బందిని కూడా ఈ స్రావాలు ప్రమాదంలో పడేస్తాయి.

 

ఐసియూలో ఈ స్రావాన్ని పీల్చడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. తాత్కాలిక ఐసోలేషన్ వార్డుల్లో ఈ అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పదార్థం మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది.

 

(దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంప్రదించండి

శ్రీమతి స్వప్న వాసుదేవన్, పి.ఆర్.ఓ (ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి)

మెబైల్ -  9656815943,

ఈ మెయిల్: pro@sctimst.ac.in)

 

 

 

 

 

 

Fig: Suction canister with acrylosorb 

Fig: Disposable spit bag with acrylosorb                   

 

   

 (Release ID: 1612481) Visitor Counter : 168