వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దేశంలో కోవిడ్-19 లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 24 నుంచి 14 రోజుల వ్యవధిలో 662 రేక్ లలో 18.54 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను దేశవ్యాప్తంగా తరలించిన ఎఫ్ సిఐ
Posted On:
06 APR 2020 8:06PM by PIB Hyderabad
పిఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) దేశవ్యాప్తంగా సమర్థవంతంగా అమలుపరచడానికి అన్ని రాష్ర్టాలకు తగినంత పరిమాణంలో ఆహార ధాన్యాలు పంపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) లబ్ధిదారులందరికీ రానున్న మూడు నెలల పాటు మనిషికి 5 కిలోల వంతున ఆహారధాన్యాలు ఉచితంగా పంపిణీ చేస్తారు. యుపి, బీహార్, తెలంగాణ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, కేరళ, మిజోరం వంటి రాష్ర్టాలు ఇప్పటికే ఈ పథకం కింద ఎఫ్ సిఐ నుంచి ఆహారధాన్యాలు తరలించుకోవడం ప్రారంభించాయి. రానున్న రోజుల్లో మిగతా రాష్ర్టాలు కూడా పిఎంజికెఎవై కింద ఈ ఆహార ధాన్యాల తరలింపును ప్రారంభిస్తాయి. దేశవ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా దేశంలోని ప్రతీ ఒక్క ప్రదేశంలోను తగినన్ని ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచేందుకు ఎఫ్ సిఐ నిరంతరాయంగా శ్రమిస్తోంది. కోవిడ్-19 మహమ్మారిని నిర్మూలించడం లక్ష్యంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 3, 2020 నుంచి గత 13 రోజుల కాలంలో రోజుకి సగటున 1.41 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు ఎఫ్ సిఐ తరలించింది. గత లాక్ డౌన్ ల సమయంలో తరలించిన రోజువారీ ఆహార ధాన్యాల పరిమాణం 0.8 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా ఇది అధికం. ఈ 13 రోజుల కాలంలో 603 రేక్ లలో మొత్తం 16.88 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు తరలించింది. మరో 1.65 లక్షల మెట్రిక్ టన్నుల పరిమాణంతో 59 రేక్ లు తరలింపునకు సిద్ధంగా ఉన్నాయి.
అలాగే ఆహార ధాన్యాలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడడానికి ఎన్ఎస్ఎఫ్ఏ కింద తరలించిన ఆహార ధాన్యాలు మాత్రమే కాకుండా ఓపెన్ మార్కెట్ లో విక్రయించేందుకు ఇ వేలంతో సంబంధం లేకుండా రాష్ట్రప్రభుత్వాలకు ఎఫ్ సిఐ గోధుమ, బియ్యం సరఫరా చేస్తోంది. గోధుమ పిండి, ఇతర గోధుమ ఉత్పత్తుల తయారీదారుల అవసరాలు తీర్చేందుకు ఆయా జిల్లా మెజిస్ర్టేట్లు అందించిన అంచనాల మేరకు ఎఫ్ సిఐ ఈ గోధుమ అందిస్తోంది. ఈ ఓపెన్ మార్కెట్ విక్రయం కోసం ఎఫ్ సిఐ ఇప్పటివరకు13 రాష్ర్టాలకు 1.38 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ, 8 రాష్ర్టాలకు 1.32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించింది.
ఈ కాలంలో లోడింగ్, అన్ లోడింగ్ అయిన ఆహారధాన్యాల వివరాలు ఈ దిగువ లింక్ లలో అందుబాటులో ఉన్నాయి.
1. Statewise details of rakes loaded during lockdown period
2. Statewise details of rakes unloaded during lockdown period
(Release ID: 1611857)
Visitor Counter : 238