ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
వైద్య పరికరాలు, నిత్యావసర సరకుల తో సహా ఈశాన్య రాష్ట్రాలకు రెగ్యులర్‌గా అందుతున్న విమాన సరకు రవాణా సేవలు : డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
05 APR 2020 5:45PM by PIB Hyderabad
వైద్య పరికరాలు, నిత్యావసర సరకుల తో సహా ఈశాన్య రాష్ట్రాలకు రెగ్యులర్‌గా విమాన సరకు రవాణా సేవలు చేరుతున్నట్టు ఈశౄన్య ప్రాంత అభివృద్ధి, కేంద్ర సహాయ మంత్రి ( స్వతంత్ర), , సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష వ్యవహారాలు,ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈశాన్య ప్రాంతంలో దేనికీ కొరత లేదని ,భవిష్యత్తులో కూడా కొరత ఉండదని చెప్పారు.
ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు తెలియజేస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ చొరవ మేరకు ఈశాన్య ప్రాంతం, అలాగే దూరంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము కాశ్మీర్, లద్దాక్, ఇతర దీవుల భూభాగాలకు నిత్యావసర సరఫరాలు తీసుకెళ్లే సరకు రవాణా విమానాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన నడపాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఎయిర్‌కార్గో విమానాలను ఎయిర్ ఇండియతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నడుపుతున్నట్టు ఆయన తెలిపారు.
ఎయిర్ ఇండియా ద్వరా తొలి కార్గో సరకు రవాణా విమానం మార్చి 30 అర్థరాత్రి గౌహతి విమానాశ్రయంలో దిగిందని, ఆ పక్కరోజే అంటే 31 మార్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం దిమాపూర్ విమానాశ్రయంలో దిగిందని చెప్పారు. అప్పటి నుంచి ఎయిర్ కార్గో సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు. దీనితో నాగాలాండ్ ఇప్పటికే మూడు పెద్ద కార్గో లలో సరకులు అందుకున్నదని , మణిపూర్ మూడు ఎయిర్ కార్గోలలో సరకులు అందుకున్నదని చెప్పారు.
ఇక ముఖానికి వాడే మాస్క్‌లకు సంబంధించి మాట్లాడుతూ డాక్టర్ జితేంద్ర సింగ్, 30,000 ఎన్ -95 మాస్క్‌లు పంపిణీకోసం ఇప్పటికే గౌహతికి చేరాయని చెప్పారు. ఇదిలా ఉండగా మాస్క్‌లు,శానిటైజర్లు తయారు చేసేందుకు ముందుకు వచ్చిన స్వయం సహాయక బృందాలను ఆయన అభినందించారు.
ఇక ముందు కూడా ఏదైనా అవసరం ఏర్పడితే ఎయిర్ కార్గో విమానాలను పంపే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సరకు రవాణా పరిమాణాన్ని బట్టి ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ ఫోర్సులు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేస్తూ సరకు రవాణాకు నిర్ణయం తీసుకుంటున్నాయన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నదని,ఇందుకు ఒక యంత్రాంగం ఏర్పాటైందని చెప్పారు.
అలాగే దేశ ఈశాన్య ప్రాంతం వెంట గల 5,500 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దులను పూర్తిగా మూసివేసినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇది ఉపకరించినట్టు ఆయన తెలిపారు.
(Release ID: 1611409)
Visitor Counter : 159