రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వ్యతిరేకంగా పోరుకు ముందుకు వచ్చిన రక్షణ పి.ఎస్.యు.లు., మరియు ఓ.ఎఫ్.బి.
Posted On:
05 APR 2020 10:38AM by PIB Hyderabad
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా కొనసాగుతున్న జాతీయ పోరాటానికి మద్దతుగా రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు (డి.పి.ఎస్.యు.లు), రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్డనెన్సు ఫ్యాక్టరీ బోర్డు (ఓ.ఎఫ్.బి.) ముందుకు వచ్చాయి.
వైద్య సదుపాయాలు :
ఆర్దినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఉన్న 10 ఆసుపత్రుల్లో 280 ఐసోలేషన్ పడకలను కోవిడ్-19 కోసం కేటాయించింది. ఆ ఆసుపత్రులు జబల్పూర్ లోని వెహికల్ ఫ్యాక్టరీ; పశ్చిమ బెంగాల్, ఇషాపూర్ లోని మెటల్ & స్టీల్ ఫ్యాక్టరీ; పశ్చిమ బెంగాల్, కాస్సిపోరే లోని గన్ & షెల్ ఫ్యాక్టరీ; మహారాష్ట్ర, ఖడ్కి లోని అమ్యూనేషన్ ఫ్యాక్టరీ; ఉత్తరప్రదేశ్, కాన్పూర్ లోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ; తమిళనాడు, ఖమరియా లోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ; తమిళనాడు, ఆవడి లోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీ; తెలంగాణా, మెదక్ లోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ లలో ఉన్నాయి.
బెంగళూరు లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ (హెచ్.ఏ.ఎల్.) ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మూడు పడకలతో ఐసోలేషన్ వార్డు సదుపాయం ఉంది. ఇతర వార్డుల్లో 30 పడకలు ఉన్నాయి. వీటికి అదనంగా, 30 గదులతో ఒక భవనాన్ని కూడా సిద్ధం చేశారు. మొత్తం 93 మందికి వసతి కల్పించడానికి హెచ్.ఏ.ఎల్. లో సదుపాయం ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ లోని కోవిడ్-19 రోగుల కోసం ఓ.ఎఫ్.బి. 50 ప్రత్యేకమైన గుడారాలను అతి తక్కువ సమయంలో తయారుచేసి, సరఫరా చేసింది.
శానిటైజర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఎఫ్.ఓ.బి. కి చెందిన ఫ్యాక్టరీలు హ్యాండ్ శానిటైజర్ ను అభివృద్ధి చేసి ఉత్పత్తిచేస్తున్నాయి. కేంద్రీకృత సేకరణ కోసం భారత ప్రభుత్వం చేత నోడల్ ఏజెన్సీ గా నియమించబడిన హెచ్.ఎల్.ఎల్. లైఫ్ కేర్ లిమిటెడ్ (హెచ్.ఎల్.ఎల్.) నుండి వీరికి 13,000 లీటర్ల శానిటైజర్ కావాలని ఆర్డర్ లభించింది. మొదటి విడతగా 2020 మర్చి 31వ తేదీన తమిళనాడు, అరువన్ కాడు లోని కోర్ డైట్ ఫ్యాక్టరీ నుండి 1500 లీటర్ల శానిటైజర్ ను పంపించారు. మరో రెండు ఫ్యాక్టరీ లు - మధ్య ప్రదేశ్, ఇటార్సీ లోని ఆర్డనెన్సు ఫ్యాక్టరీ, అలాగే మహారాష్ట్ర, భండారా లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లు భారీ స్థాయిలో శానిటైజర్ ను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు ఫ్యాక్టరీలు కలిసి జాతీయ అవసరాన్ని తీర్చడానికి వీలుగా రోజుకు 3,000 లీటర్ల శానిటైజర్ ను ఉత్త్పతి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.
రక్షణ సామాగ్రి : కోటులు (కవర్ ఆల్) మరియు మాస్కులు
కాన్పూర్, షాజహాన్ పూర్, ఫిరోజాబాద్ లోని హజరత్ పూర్, మరియు చెన్నై లలో ఉన్న ఆర్డనెన్సు ఎక్విప్ మెంట్ (పరికరాల) ఫ్యాక్టరీలు కోటులు (కవర్ ఆల్స్) మరియు మాస్కులు తయారుచేసే పనిలో ఉన్నాయి. అతి తక్కువ సమయంలో ఈ దుస్తులు తయారుచేయడానికి అవసరమైన ప్రత్యేక హీట్ సీలింగ్ యంత్రాలను కూడా వారు ఏర్పాటు చేశారు.
10
ముందుగా తయారుచేసిన కవర్ ఆల్స్ (కోటులు) నమూనాలను పరీక్షించవలసిందిగా, గ్వాలియర్ లోని డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ ను ఫ్యాక్టరీస్ బోర్డు విజ్ఞప్తి చేయగా వాటిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. కాగా, మాస్కులను, కోయింబత్తూర్ లోని సౌత్ ఇండియా టెక్స్టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (ఎస్.ఐ.టి.ఆర్.ఏ.) పరీక్షించవలసి ఉంది. ఓ.ఎఫ్.బి. వారానికి 5,000 నుండి 6,000 కవర్ ఆల్స్ ను తయారుచేసే భారీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. కవర్ ఆల్స్ మరియు మాస్కుల సామర్ధ్యాన్ని పరీక్షించడం కోసం అభివృద్ధి చేసిన మూడు యంత్రాలను ఎస్.ఐ.టి.ఆర్.ఏ. ఆమోదించింది. ప్రమాణాలను పరీక్షించడం కోసం వీటిని ఉత్పత్తిలో ఉపయోగిస్తారు.
వెంటిలేటర్లు
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకు, ఐ.సి.యు. ల కోసం వచ్చే రెండు నెలల్లో 30,000 వెంటిలేటర్లను తయారుచేసి, సరఫరా చేయడానికి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బి.ఈ.ఎల్.) ముందుకు వచ్చింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ముందుగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ఈ వెంటిలేటర్లను, బి.ఈ.ఎల్. తో కలిసి పనిచేస్తున్న మైసూర్ లోని స్కాన్ రే సంస్థ మరింత మెరుగుపరచింది. హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రుల్లోని వెంటిలేటర్ల మరమ్మత్తు పనులను మెదక్ లోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ చేపట్టింది.
*******
(Release ID: 1611335)
Visitor Counter : 250
Read this release in:
Assamese
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam