ఆర్థిక మంత్రిత్వ శాఖ

టి.డి.ఎస్ / టి.సి.ఎస్. నిబంధనలను పాటించడం వల్ల పన్ను చెల్లింపుదారులకు తలెత్తే ఇబ్బందులను తగ్గించడానికి ఆదాయపు పన్ను ఆదాయపు పన్ను చట్టం 1961లోని యు/ఎస్. 119 ఆదేశాలను జారీ చేసిన సి.బి.డి.టి.

Posted On: 04 APR 2020 4:38PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల సాధారణ పనిలో తీవ్ర అంతరాయం ఎదురౌతోంది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులు తగ్గించడానికి, ఆదాపు పన్ను చట్టం – 1961లోని  యు/ఎస్. 119 అధికారాన్ని వినియోగించడం ద్వారా సి.బి.డి.టి. ఈ క్రింది ఆదేశాలను / స్పష్టీకరణను జారీ చేసింది.

2020-21 ఆర్థిక సంవత్సరం కోసం టి.డి.ఎస్ /టి.సి.ఎస్.ల తగ్గింపు లేదా పూర్తి మినహాయింపు కోసం దరఖాస్తు చేసిన మదింపు దారుల్లో ఎవరి దరఖాస్తులు అయితే ఇప్పటి వరకూ డిస్పోజ్ అవ్వకుండా పెండింగ్ లో ఉన్నాయో వారి కోసం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ధృవపత్రాలు జారీ చేయబడ్డాయి. ఇవి 30 జూన్ 2020 వరకూ వర్తిస్తాయి. వీటినే అసెస్టింగ్ ఆఫీసర్లు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. అయినప్పటికీ లావాదేవీల వివరాలను సంబంధిత అధికారులకు వీలైనంత త్వరగా అందజేయాలి. అంతే కాకుండా పైన పేర్కొన్న దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో శాశ్వత స్థాపన కలిగిన ప్రవాసులకు (విదేశీ కంపెనీలు సహా) చెల్లింపులపై, చేసిన చెల్లింపులపై పన్ను సర్ చార్జ్ (సెస్ తో కలుపుకుని) 10 శాతం సబ్సిడీ ఇవ్వబడుతుంది. (31.03,2020న ఈ ఆర్డర్ ఆమోదించబడింది.)

ఆర్థిక సంవత్సరం 2019-20 కోసం టి.డిఎస్/టి.సి.ఎస్ దరఖాస్తులు తగ్గింపు లేదా మినహాయింపు కోసం పెండింగ్ లో ఉంటే లిబరల్ విధానంలో అసెస్సింగ్ ఆఫీసర్లు ఆ దరఖాస్తులను 2020 ఏప్రిల్ 27 నాటికి డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. తద్వారా పన్ను చెల్లింపు దారులు  వారి ద్రవ్య సమస్యలకు కారణం అయ్యే అదనపు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. (03.04.2020 న ఆర్డర్ జారీ చేయబడింది)

చిన్న పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను తగ్గించడానికి, ఆర్థిక సంవత్సరం 2019-20 కోసం ఒక వ్యక్తి 15జి లేదా 15 హెచ్ ఫారమ్ ను బ్యాంకులు లేదా ఇతర సంస్థలకు సమర్పించి ఉంటే అవి, 2020 జూన్ 30 వరకూ చెల్లుబాటు అవుతాయి. పన్ను బాధ్య లేని చోట టి.డి.ఎస్. స్థానంలో చిన్న పన్ను చెల్లింపు దారులకు ఇది ఊరట ఇస్తుంది. (2020 ఏప్రిల్ 3న ఇచ్చిన ఉత్తర్వు)

 పైన పేర్కొన్న అన్ని ఉత్తర్వులు యు /ఎస్ 119 కింద మిస్ లీనియస్ కమ్యూనికేషన్స్ శీర్షికలో www.incometaxindia.gov.in లో లభిస్తాయి.



(Release ID: 1611093) Visitor Counter : 162