చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తో, రెగ్యులర్ ఇంటరాక్టివ్ సెషన్లను ప్రారంభించిన ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2020 6:33PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని అదుపుచేసేందుకు విధించిన లాక్‌డౌన్ సమయంలో అందుబాటులోకి వచ్చిన 21 రోజుల సమయాన్ని సమర్ధంగా వినియోగించుకునేందుకు ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్ (ఐటిఎటి) ఈరోజు (ఏప్రిల్ 3)న రెగ్యులర్ ఇంటరాక్టివ్ సెషన్లతో కూడిన వీడియో కాన్ఫరెన్సులను ప్రారంభించింది. ఐటిఎటి ప్రెసిడెంట్, జస్టిస్ పి.పి .భట్, ట్రిబ్యూనల్ వైస్ ప్రెసిడెంట్, ఇతర సభ్యులకు ఒక సందేశం పంపుతూ, ఇలాంటి సమావేశాలు పరస్పరం అభిప్రాయాలు తెలుసుకోవడానికి, కేసుల సత్వర పరిష్కార రేటును మరింత మెరుగుపరచడానికి తీసుకోవలసిన చర్యలపై తగిన వ్యూహాలు రూపొందించుకోవడానికి, అలాగే జుడిషియల్ ఉత్తర్వులలో నాణ్యతకు సంబంధించిన అంశాలు చర్చించడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.
స్వీయ క్వారంటైన్, సామాజిక దూరం పాటించడం వంటి వాటి ద్వారా కేంద్రప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా పాటించాలని పునరుద్ఘాటిస్తూ జస్టిస్ భట్, ప్రస్తుత పరిస్థితులలో ఆఫీసులనుంచి పనిచేయడం కష్టసాధ్యమైనదని ,సాధారణ రోజులలో పనిచేసిన స్థాయిలో పనిసాగడం కష్టమని అన్నారు.అయితే ఈ సమయాన్ని మన నైపుణ్యాలు , సమర్థత పెంచుకోవడానికి వినియోగించుకోవలని ఆయన సూచించారు.
“ మనకున్న రోజువారీ జుడిషియల్ పని భారంలో పాలన, మౌలికసదుపాయాలు , సిబ్బంది క్రమశిక్షణకు సంబంధించిన అంశాలపైన దృష్టిపెట్టడానికి తగినంత సమయం అందుబాటులో ఉండదు.అందువల్ల ఇలాంటి సమావేశాలు పాలనాపరంగా మన పని సామర్ధ్యాన్ని పెంచడానికి దోహదపడతాయ,”ని జస్టిస్ భట్ అన్నారు.
ఏప్రిల్ 13 వతేదీ సోమవారం వరకు అన్నిపనిదినాలలో 7 ఇంటరాక్టివ్ సెషన్‌లను డొమైన్, నాన్ డొమైన్ అంశాలపై జాతీయ, జోనల్ స్థాయిలో, పెద్ద మల్టిపుల్ బెంచ్ స్టేషన్ల స్థాయిలో నిర్వహిస్తారు. డొమైన్ అంశాలలో ఆదాయపన్ను, దాని సంబందిత చట్టాలకు సంబంధించిన అంశాలు ఉండగా, నాన్ డొమైన్ అంశాలలో మెరుగైన జీవనం, ఆరోగ్యం, ధ్యానం, సంపూర్ణ స్వస్థత వంటివి ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, పాలనా పరమైన అంశాలకు సంబంధించి స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారంపై ఆయా కేంద్రాలలోని సభ్యులు తమలో తాము సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ సెషన్‌లలో చర్చించనున్న అంశాలు కింది విధంగా ఉన్నాయి.:
1) జనరల్ యాంటీ అవైడెన్స్ రూల్ (జిఎఎఆర్)- అసెస్ మెంట్‌లలో జిఎఎఆర్ వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే అంశాలు.
2) ప్రత్యక్షపన్నుల వివాద్ సే విశ్వాస్ చట్టం 2020- ఐటిఎటి ఆకాంక్షలు
3) ఫైనాన్స్ చట్టం 2020 సవరణలు
4) బిఇపిఎస్, చట్టపరమైన సవరణల నేపథ్యంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పర్మినెంట్ ఎస్టాబ్లిష్మెంట్, బిజినెస్ కనక్షన్, పన్నుల విషయంలో మారుతున్నభావనలు
5) అసెస్‌మెంట్లు, దాని నుంచి తలెత్తే అంశాలపై ఐసిడిఎస్ ప్రభావం
సమావేశాల సందర్భంగా చర్చించే మౌలిక అంశాలు:
1) బిజినెస్ కనెక్షన్
2)సెక్షన్ 9 కింద ఆదాయాలు, ఎఫ్‌టిఎస్ , రాయల్టీలు
3) శాశ్వత ఎస్టాబ్లిష్‌మెంట్, లాభాల వర్తింపు
4) కేస్ స్టడీలు- కొన్ని కీలక జుడిషియల్ ఆనవాయితీలు-గుర్తుంచుకోవలసిన కీలకాంశాలు
5) అసెస్‌మెంట్ రిపోర్టింగ్, రివిజన్ ఆఫ్ అసెస్‌మెంట్
చర్చించనున్న నాన్ డొమైన్ అంశాలు:
1) ఆర్ట్ ఆఫ్ లివింగ్- సానుకూల దృక్ఫథంతో లాక్‌డౌన్ పరిస్థితులను ఎదుర్కొవడం
2) ఇంటినుంచే పనిచేయడం( వర్క్ ఫ్రం హోం- డబ్ల్యుఎఫ్‌హెచ్) పని- జీవితంలో సమతూకం సాధించేందుకు లభించిన అవకాశం
3) యోగా చిట్కాలు
ఇంటరాక్టివ్ సెషన్ ప్రారంభ కార్యక్రమంలో జస్టిస్ భట్ మాట్లాడుతూ, ఐటిఎటి వైస్‌ప్రెసిడెంట్, ఇతర సభ్యులతో జరిగే ఒక ఇంటరాక్టివ్ సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ని కోరినట్టు చెప్పారు. ప్రముఖ న్యాయనిపుణులు వివిధ ఇంటరాక్టివ్ సెషన్‌లనుద్దేశించి మాట్లాడతారని , ఈ సెషన్‌లలో పాల్గొంటారని కూడా ఆయన చెప్పారు.
(రిలీజ్ ఐడి: 1610913)
సందర్శకుల సూచీ సంఖ్య : : 121