హోం మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌నుంచి వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు, విడిభాగాలు మ‌రియు రిపేరు నుంచి మిన‌హాయింపునిస్తూ అనుబంధ మార్గ‌ద‌ర్శ‌కాలు

Posted On: 03 APR 2020 10:15PM by PIB Hyderabad

కోవిడ్ 19 నిరోధానికి దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తూ విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుబంధం విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం. వీటిని అన్ని మంత్రిత్వ‌శాఖ‌ల‌కు, విభాగాల‌కు పంపారు. దీని ప్ర‌కారం లాక్ డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌నుంచి వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు, వాటి విడిభాగాల‌ను, ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై రిపేర్ల‌ను చేసే షాపుల‌ను, ముఖ్యంగా పెట్రోలు బంకుల ద‌గ్గ‌ర వున్న‌వాటిని, టీ ప‌రిశ్ర‌మ‌ను, తేయాకు తోట‌ల‌ను ( అత్య‌ధికంగా 50 శాతం కూలీల‌కు ప‌రిమితం చేస్తూ) మిన‌హాయించారు. 
 


(Release ID: 1610910)