మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఏ.ఐ.సి.టి.ఈ. అభివృద్ధి చేసిన ఎమ్.హెచ్.ఆర్.డి. ఏ.ఐ.సి.టి.ఈ. కోవిడ్-19 స్టూడెంట్ హెల్ప్ లైన్ పోర్టల్ ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి న్యూఢిల్లీ లో ప్రారంభించారు.

Posted On: 03 APR 2020 7:45PM by PIB Hyderabad

కోవిడ్-19 వ్యాప్తి కారణంగా, మార్చి 25వ తేదీ నుండి దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడంతో, కళాశాలలు, వసతి గృహాలు మూసివేయడంతో కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  అందువల్ల, అటువంటి విద్యార్థులకు సహాయం, చేయూత నందించడానికీ, వారి సమస్యలను పరిష్కరించడానికీ వీలుగా,  ఏ.ఐ.సి.టి.ఈ. (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి) ఒక వినూత్న "ఎమ్.హెచ్.ఆర్.డి.  ఏ.ఐ.సి.టి.ఈ.  కోవిడ్-19 స్టూడెంట్ హెల్ప్ లైన్ పోర్టల్" ను రూపొందించింది. 

https://helpline.aicte-india.org వెబ్ సైట్ తో కూడిన యు.ఆర్.ఎల్. ను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఈ రోజు ప్రారంభించారు.   ఈ కార్యక్రమంలో పాల్గొన్న - ఏ.ఐ.సి.టి.ఈ. ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే;  ఏ.ఐ.సి.టి.ఈ.  వైస్ ఛైర్మన్ శ్రీ ఎమ్.పి. పూనియా;  ఏ.ఐ.సి.టి.ఈ.  చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీ బుద్ధ చంద్రశేఖర్ తో పాటు ఈ పోర్టల్ ను ఒకే ఒక రోజు రికార్డు సమయంలో అభివృద్ధి చేసిన గ్రాఫిక్ ఎరా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్న్ షిప్ విద్యార్థులు శివాంషుఆకాష్ సమక్షంలో మంత్రి ఈ పోర్టల్ ను ప్రారంభించారు  

 

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  సహాయం అవసరమైన వారిని, సహాయం అందించే వారితో అనుసంధానం చేయడానికి ఈ పోర్టల్ అవసరం చాలా ఉందని పేర్కొన్నారు.  ఈ పోర్టల్ ద్వారా వసతి, ఆహారం, ఆన్ లైన్ తరగతులు, హాజరు, పరీక్షలుఉపకారవేతనాలు, ఆరోగ్యం, రవాణా, వేధింపులు మొదలైన వివిధ రకాల సహాయాన్ని అందించవచ్చు. 

అటువంటి కీలక సమయాల్లో మద్దతు ఇవ్వడానికి 6,500 కు పైగా కళాశాలలు ఇప్పటికే ముందుకు వచ్చాయని మంత్రి తెలియజేశారు.   ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా వారితో నేరుగా అనుసంధానమయ్యేలా ప్రోత్సహించాలి.   ఇటువంటి వినూత్న పోర్టల్ ను రూపొందించిన విద్యార్థుల కృషిని కూడా శ్రీ నిషాంక్ అభినందించారు. 

తమ పరిశోధనల ద్వారా ఆరోగ్య పరిరక్షణ సేవలను సాధికార పరచడం ద్వారా ప్రభుత్వానికి సహకరించేందుకు అనేక ఉన్నత విద్యా సంస్థలు ముందుకు వస్తున్నట్లు తెలుసుకుని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏ.ఐ.సి.టి.ఈ. ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే మాట్లాడుతూ - 6,500 కళాశాలలు మద్దతు ప్రకటించిన విధంగాస్వచ్చంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలుసామాజిక సంస్థలు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు 

ఆసక్తి గల సామాజిక సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, దాతలు cconeat@aicte-india.org6  ద్వారా ఏ.ఐ.సి.టి.ఈ. ని సంప్రదించవచ్చు.  

*****



(Release ID: 1610881) Visitor Counter : 163