ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భారత్లో సంక్షోభాన్ని తరిమికొట్టండి, కొవిడ్-19 మహమ్మారికి పరిష్కారానికి ఆన్లైన్ హాకాథాన్ను ప్రారంభించిన శ్రీ సంజయ్ ధోత్రే
కొవిడ్-19పై పోరాటాన్ని ఉధృతం చేయడమే లక్ష్యంగా ఈ హాకాథాన్
Posted On:
03 APR 2020 7:46PM by PIB Hyderabad
కొవిడ్-19 విశ్వమహమ్మారిపై పోరాటంలో భాగంగా ఈ సమస్యకు పరిష్కారం కోసం భారత్లో సంక్షోభాన్ని తరిమికొట్టండి అనే ఆన్లైన్ హాకాథాన్ను కేంద్రా ఎలక్ట్రానిక్స్ మరియు సాంకేతిక సమాచార, మానవాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ప్రారంభించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న ప్రయత్నం, దీనికి ’హాక్ ఏ కాజ్-ఇండియా’ మరియు ’ఫిక్కి మహిళా సంస్థ పూణె’ వారు భారత్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వపు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ(ఎంఇఐటివై) వారు సహకారం అందిస్తున్నారు.
కొవిడ్-19పై పోరాటమే ఈ హాకాథాన్ లక్ష్యం కాగా ఈ కార్యక్రమంలో అమలుకు అనువైన పరిష్కారాలను అందించిన కొన్ని ఉత్తమ బృందాలు కొరొనా సంక్షోభ నివారణకు భారతదేశానికి మరియు ప్రపంచ ప్రజలకు సహాయం చేసినవారవుతారు. కొవిడ్ -19 ప్రపంచానికి అదే విధంగా పరిశ్రమలకు ఒక సవాలును విసిరిందన్నారు. ఈ క్లిష్ట సమయంలో అన్ని ప్రభుత్వాలు, పరిశ్రమలు మరియు ప్రజలు వ్యక్తిగతంగా అందరూ ఈ తమ వంతు సహకారాన్ని విరాళాలను అందించి తమ మానవత్వాన్ని చాటుకోవాలని ఆయన కోరారు.
ఈ పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధిస్తామని మరియు దృఢమైన దేశంగా ఆవిర్భవిస్తామని, తప్పకుండా మానవత్వాన్ని వ్యాపింపజేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. కష్టాల్లోనే అవకాశాలు ఉంటాయన్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాక్యాన్ని ఆయన గుర్తుచేసారు.
గౌరవ శ్రీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వంతోపాటు వివిధ సంస్థలు ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఎదర్కొనడానికి తమ వంతు ప్రయత్నాలను చేస్తూ త్వరితగతిన తేరుకోవడాని ప్రయత్నాలను చేస్తున్నారు అని శ్రీ సంజయ్ ధోత్రే అన్నారు.
సామాజికి దూరం అవశ్యమైన ఈ తరుణంలో డిజిటల్ పరిష్కారాలు మరియు ఉత్పత్తులు ప్రజలును చేరుకోవడం వలన ఆర్థిక స్థిరత్వాన్ని కూడా త్వరలోనే సాధించగలమన్న నమ్మకముందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 పరిష్కారానికి ఈ హాక్ ది క్రిసిస్ –ఇండియా హాకాథాన్ను ప్రారంభించడం తనకు లభించిన గౌరవమన్నారు. ఇది ప్రపంచ ప్రయత్నమని దీని మన దేశం తరపున ప్రభుత్వం మరియు వివిధ సంస్థల సహకారం ఉందన్నారు.
ఈ హాకాథాన్ ప్రారంభించిన 48 గంటల్లోనే భారత్, ఈస్టోనియా మరియు ఫిన్లాండ్ దేశాల నుండి సుమారు 2000 బృందాలు మరియు 15000 మంది నిపుణులు తాము తయారుచేసిన నమూనాలను ప్రదర్శించారు. రానున్న వారాల్లో భారత్ నుండి ఉత్తమమైన బృందాలు ’హాక్ ది క్రిసిస్-వరల్డ్’ అనే ప్రపంచ హాకాథాన్లో పాలుపంచుకుంటాయని మంత్రి తెలిపారు. ప్రపంచం ఇప్పటి వరకు ఏన్నో సంక్షోభాలను తట్టుకొందని ప్రస్తుతం ఈ కొవిడ్ సంక్షోభాన్ని కూడా తట్టుకుని నిలబడి దీనిని ఒక అవకాశంగా మలచుకుంటుందని నిశ్చయంగా తెలిపారు. ఈ హాకాథాన్లో పాల్గొంటున్న అన్ని బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు, క్రొత్త ఆలోచనలతో ఈ మహమ్మారికి తగిన పరిష్కారాన్ని కనుగొనాలని మరియు అందరూ సురక్షితంగా ఉండాలని శ్రీ సంజయ్ ధోత్రే కోరారు.
(Release ID: 1610850)