రక్షణ మంత్రిత్వ శాఖ
బహిరంగ ప్రదేశాలను సమర్థవంతంగా శుభ్రపరించే పరికరాలను అభివృద్ధి చేస్తున్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)
Posted On:
03 APR 2020 6:27PM by PIB Hyderabad
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశీయ పరిష్కారాలను అభివృద్ధి చేసే నిరంతర అన్వేషణలో భాగంగా భారీ జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలను శుభ్రపరిచే పరికరాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) సిద్ధమైంది. ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ ప్లోజివ్ మరియు ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ (సి.ఎఫ్.ఈ.ఈ.ఎస్) రెండు పరిశుభ్రతా పరికరాలను అభివృద్ధి చేసింది. అగ్నిమాపక సాంకేతిక పరిజ్ఞానం నుంచి వీటిని అభివృద్ధి చేశారు.
పోర్టబుల్ బ్యాక్ ప్యాక్ ఏరియా శానిటైజేషన్ ఎక్విప్ మెంట్
ఢిల్లీలోని సి.ఎఫ్.ఈ.ఈ.ఎస్. తన పరిశ్రమ భాగస్వామి సాయంతో అనుమానాస్పద ప్రాంతం యొక్క పరిశుభ్రత కోసం ఒక శాతం హైపో క్లోరైడ్ ద్రావణంతో కూడిన పోర్టబుల్ శానిటైజేషన్ పరికరాలను అభివృద్ధి చేసింది. ఈ పరికరాన్ని వీపుకు సంచిలా తగిలించుకుని సులభంగా వినియోగించవచ్చు. అంతే కాకుండా ఇందులో గాలి, క్రిమి సంహారక ద్రావణాల జంటపీడన సాంకేతికత ఉంటుంది. ఇది 300 చదరపు మీటర్ల వీస్తీర్ణంలో క్రిమి సంహారకం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆసుపత్రులు, డాక్టర్ ఛాంబర్స్, కార్యాలయాలు, కారిడార్లు, రహదారులు, మెట్రో మరియు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు మొదలైన ప్రదేశాలను వీటితో శుభ్రపరచవచ్చు.
ట్రాలీ మౌంటెడ్ లార్జ్ ఏరియా శానిటైజేషన్ ఎక్విప్ మెంట్
తన పరిశ్రమ భాగస్వామితో కలిసి ట్రాలీతో తీసుకువెళ్ళగలిగే అత్యంత అధిక సామర్థ్యం కలిగిన పరిశుభ్రత పరికరాన్ని సైతం ఈ సంస్థ అభివృద్ధి చేసింది. 3,000 చదరపు మీటర్ల వీస్తీర్ణంలో ఇది క్రిమి సంహారక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 50 లీటర్ల ట్యాంక్ సామర్థ్యంలో 12-15 మీటర్ల వీస్తీర్ణం కలిగిన ఆసుపత్రులు, మాల్స్, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, ఐసోలేషన్ ప్రాంతాలు, క్వారంటైన్ కేంద్రాలు మరియు అధిక ప్రమాదం ఉన్న నివాస ప్రాంతాలను క్రిమి సంహారకం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఈ రెండు వ్యవస్థలను తక్షణ ఉపయోగం కోసం ఢిల్లీ పోలీసులకు అందిస్తున్నారు. పరిశ్రమ భాగస్వాముల సాయంతో ఇతర ఎజెన్సీలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంది.
(Release ID: 1610827)
Visitor Counter : 200