రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

పీఎం కేర్స్ నిధికి ఇండియన్ పోటాష్ లిమిటెడ్ రూ.5 కోట్ల విరాళం : రూ.32 కోట్లకు చేరుకున్న ఫెర్టిలైజర్స్ పీఎస్ యూ ల విరాళాలు

ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎన్ఎఫ్ఎల్, ఎఫ్ఏసిటి ఉద్యోగులను ప్రశంసించిన శ్రీ గౌడ

Posted On: 03 APR 2020 4:27PM by PIB Hyderabad

కోవిడ్-19పై చేస్తున్న పోరులో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలోని పిఎస్‌యు ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపిఎల్) ముందుకు వచ్చింది. ప్రధానమంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల్లో సహాయం (పిఎం కేర్స్) నిధికి 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. దీనితో  ఎరువుల సిపిఎస్‌యుల సహాయం రూ.32 కోట్లకు చేరింది. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ అందించిన సహకారాన్ని ప్రశంసించిన శ్రీ గౌడకోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు ఇది బాసటగా నిలుస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

రెండు వేర్వేరు ట్వీట్లలో మంత్రి నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్)ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (ఫాక్ట్) ఉద్యోగులనుప్రశంసించారు. ఒకరు రూ.88 లక్షలుమరొక పీఎస్ యూ రూ.50 లక్షలు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు.

ఇఫ్కోక్రిభ్కోఎన్ఎఫ్ఎల్-కిసాన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు రూ.27 కోట్లకు పైగా విరాళాన్ని సహాయ నిధికి ఇచ్చారు.

లాభాలు ఆర్జిస్తున్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సామజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధి నుండి విరాళాలు ఇవ్వాల్సిందిగా శ్రీ గౌడ కోరారు. సంబంధిత సీఎండీ లకు ఆయన లేఖ రాసారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఆరోగ్యానికి ఎదురవుతున్న సవాళ్లకు స్పందించి సమాజంలో అన్ని వర్గాల వారు తగు రీతిలో స్పందించాలనికార్పొరేట్ సామజిక బాధ్యత నిధి నుండి విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

కోవిడ్-19 మహమ్మారి వంటి అత్యవసర లేదా విపత్కర పరిస్థితులను ఎదుర్కోనే ప్రాధమిక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్  నిధిని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఈ నిధికి ఇచ్చే ఎటువంటి సహాయమైనా కంపెనీల చట్టం 2013 ప్రకారం  సిఎస్ఆర్ ఖర్చుగా అర్హత ఉంటుందని ఇప్పటికే  కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా స్పష్టత ఇచ్చిందని శ్రీ గౌడ వివరించారు.

 

ట్వీట్ లింకులు :

1.(https://twitter.com/DVSadanandGowda/status/1245620869944070146?s=03 )

2. (https://twitter.com/DVSadanandGowda/status/1245957819255287808?s=03 )

3.(https://twitter.com/DVSadanandGowda/status/1245955359002386433?s=03 )

 

****



(Release ID: 1610783) Visitor Counter : 94