శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19, సంబంధిత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి ఆమోదించిన మొదటి ప్రాజెక్టులను ప్రకటించిన డిఎస్టి-ఎస్ఈఆర్బి

Posted On: 02 APR 2020 6:21PM by PIB Hyderabad

కోవిడ్-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా చాల వేగంగా వ్యాపించిందిఈ సంక్షోభాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మహమ్మారిగా పేర్కొంది. తగిన కెమోథెరపీటిక్ సౌకర్యంసమర్థవంతమైన వ్యాక్సిన్ లభ్యత లేకపోవడం వల్ల ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తికి ప్రపంచ జనాభా తీవ్రంగా దెబ్బతింది. భారతదేశంలో కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువవ్వడం వల్లశాస్త్ర సాంకేతిక విభాగం - సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డ్ (డిఎస్టి-ఎస్ఇఆర్బి) ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి జాతీయ స్థాయిలో పరిశోధన అభివృద్ధి చర్యలను అత్యవసరంగా పెంచడానికి అనేక ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టులకు పిలుపునిచ్చింది. అయిదు ప్రాజెక్టుల మొదటి సెట్‌ను డిఎస్టి-ఎస్ఈఆర్బి ఎంపిక చేసిందిఅమలులోకి తేగలిగే సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. 

ఈ మూడు ప్రాజెక్టులలో మూడు ముఖ్యమైన సవాళ్లు  ప్రస్తావనకు వచ్చాయి. ఒకటి, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) వంటి నిర్జీవ ఉపరితలాలుపై  యాంటీవైరల్ మరియు వైరస్టాటిక్ పూతమరొకటి కోవిడ్-19 సోకిన రోగులలో జీవ కణ ప్రక్రియకు సంబంధించిన మెటాబోలైట్ బయోమార్కర్ల గుర్తింపుదానితో చికిత్సా లక్ష్యాన్ని తెలుసుకోడానికి  వీలు కలుగుతుందిచివరిది కరోనావైరస్ యొక్క బాహ్య పొర అయిన  గ్లైకోప్రొటీన్ కి అతికి ఉన్న ముల్లుల్లాంటి ఆకారాలకు ఉండే గ్రాహక స్వభావానికి వ్యతిరేకంగా ప్రతిరోధకాల అభివృద్ధికి సంబంధించినది. 

 

ఇవీ ఆ ప్రాజెక్టులు: 

కోవిడ్-19 సోకిన రోగుల్లో  గ్లోబల్ మెటాబోలైట్ బయోమార్కర్ల గుర్తింపుదానితో చికిత్సా లక్ష్యాన్ని గుర్తించడం: 

ఈ ప్రాజెక్టు కోవిడ్-19 సోకిన రోగులలో గ్లోబల్ మెటాబోలైట్ బయోమార్కర్లను గుర్తించే మార్గాలను శోధిస్తుంది. ఇది వైరస్ సంక్రమణకు అవకాశం ఉన్న బయోమార్కర్ ఛాయలను శోధించడానికి,  చికిత్స కోసం కొత్త లక్ష్యాలను గుర్తించడంలో సహాయపడుతుంది.

{వివరాల కోసం ఐఐటి బొంబాయి బయోసైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగాయానికి చెందిన డాక్టర్ సంజీవ శ్రీవాస్తవ ని సంప్రదించవచ్చు (sanjeeva@iitb.ac.in )}

 

నివారణ మరియు తక్కువ ఖర్చుతో కూడిన యాంటీవైరల్ ప్రయోగాల  కోసం తిరిగి వినియోగపరచగలిగే బహుళ-లక్ష్య వైరిసిడల్ ఏజెంట్లు / ఔషధాలతో క్రియాత్మకమైన నిర్జీవ ఉపరితలాల అభివృద్ధి చేయడం :

తీవ్రమైన శ్వాసకోశ సమస్య -సంబంధిత నొవెల్ కరోనావైరస్సార్స్-సీఓవి-2  వంటి వ్యాధి కారకాల వల్ల కలిగే అంటు వ్యాధుల నివారణకు ఈ ప్రాజెక్టులో మార్గాలను శోధిస్తారు. శస్త్రచికిత్సా మాస్కుల వంటి ఆరోగ్య సంరక్షణ చర్యలలో ఉపయోగించే నిర్జీవ ఉపరితలాల కోసం వైరిసైడల్ పూతలను అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది.

{వివరాల కోసం ఐఐటీ కాన్పూర్ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ నగ్మా ప్రవీణ్ ను (nagma@iitk.ac.inసంప్రదించవచ్చు}

 

ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల కలిగే అంటువ్యాధుల వ్యాప్తిని నివారించడానికి యాంటీవైరల్ ఉపరితల పూతల అభివృద్ధి:

ఉపరితలాలపై అతికి ఉన్న వైరస్ లు ప్రాణాంతక అంటువ్యాధుల వ్యాప్తికి దారితీస్తుండటంతోచిన్న పరమాణు మరియు పాలిమెరిక్ సమ్మేళనాలను అభివృద్ధి చేయటం  ఈ ప్రతిపాదన లక్ష్యం.  వివిధ ఉపరితలాలపై  వీటిని పూత పూయడంతో  శ్వాసకోశ వైరస్లను స్పర్శలోకి వచ్చిన వెంటనే పూర్తిగా చంపివేస్తాయి.

{వివరాల కోసం జెఎన్‌సిఎఎస్ఆర్బెంగళూరుకి చెందిన  డాక్టర్ జయంతా హల్దార్ సంప్రదించండి (jayanta@jncasr.ac.in)}

 

నిర్జీవ ఉపరితలాల పై సూక్ష్మజీవుల ప్రక్షాళన కు తగు మిశ్రమాల అభివృద్ధి :

ఇది వైరస్ కి ప్రతివ్యూహంగా ఉపయోగించబడే పదార్థాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అంటుకుని వుండే  వైరస్  లేదా బ్యాక్టీరియాను ఊడ్చిపెట్టేలా  ఉపరితలాలను క్రిమిసంహారం చేయడానికి జరిగే ప్రయత్నం ఇది.

{వివరాల కోసం టెక్స్‌టైల్ అండ్ ఫైబర్ ఇంజనీరింగ్ విభాగంఐఐటి ఢిల్లీకి చెందిన  డాక్టర్ బి. ఎస్. బుటోలా   ( bsbutola@iitd.ac.in సంప్రదించవచ్చు }

 

యాంటీబాడీ-ఆధారిత కొవ్వు నిరోధక 'సిటు జెల్ద్వారా 2019-ఎన్ సిఓవి గుర్తించి  క్రియారహితం చేయడం :

కణాన్ని గ్రహించే -ఉపరితల గ్రాహకాన్ని  సిఓవి కి చెందిన స్పైక్ గ్లైకోప్రొటీన్ రిసెప్టర్-బైండింగ్ గుర్తిస్తుంది. ఈ డొమైన్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుంది. జింక్ పెప్టైడేస్ యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ లు అని వీటి పేరు. ఈ ప్రాజెక్ట్ మరొక లక్ష్యం అసంతృప్త కొవ్వు ఆమ్ల-ఆధారిత ఎమల్షన్‌ను అభివృద్ధి చేయడం. ప్రవేశించే సమయంలోనే వైరస్ ను  నిష్క్రియం చేయడానికి ఇన్-సిటు జెల్స్‌ను లోడ్ చేస్తారు.

{వివరాల కోసం ఐఐటీ  బొంబాయి బియోసైన్సెస్బయో ఇంజనీరింగ్ శాఖకు చెందిన డాక్టర్ కిరణ్ కొండబాగిల్ ని ( kirankondabagil@iitb.ac.in సంప్రదించవచ్చు}

 

కోవిడ్ -19 ప్రాజెక్టుల ప్రత్యేక నిపుణుల కమిటీ లోతైన సమీక్షపరిశీలన తర్వాత ఈ ప్రాజెక్టులను ఎంపిక చేశారు.

డిఎస్టి-ఎస్ఈఆర్బి చేస్తున్న కోవిడ్-19 పరిశోధన అభివృద్ధి ప్రయత్నాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంప్రదించవలసింది :

సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిసెర్చ్ బోర్డు  కార్యదర్శి ప్రొఫెసర్ సందీప్ వర్మ 

Email: secretary@serb.gov.in}

 

*****



(Release ID: 1610533) Visitor Counter : 155