మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మానసిక-సామాజిక ప్రభావం గురించి కమ్యూనిటీ అవగాహనను అంచనా వేయడానికి, భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు చెందిన జాతీయ బుక్ ట్రస్ట్, ఆన్ లైన్ ప్రశ్నావళిని విడుదల చేసింది.

Posted On: 02 APR 2020 4:30PM by PIB Hyderabad

కోవిడ్-19, తదనంతర లాక్ డౌన్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన బహుముఖ చర్యల కొనసాగింపులో భాగంగా,   మానవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కింద పుస్తకాల ప్రచురణ, ప్రమోషన్ కోసం కృషి చేస్తున్న జాతీయ సంస్థ,  నేషనల్ బుక్ ట్రస్ట్ -  ఈ మహమ్మారి యొక్క మానసిక-సామాజిక ప్రభావం పై కమ్యూనిటీ అవగాహనను అంచనా వేయడానికి ఇటీవల ప్రారంభించిన కరోనా అధ్యయనాల పరంపరలో భాగంగా మానసిక శాస్త్రవేత్తలు, సలహాదారుల అధ్యయన బృందం ద్వారా,  మానసిక-సామాజిక ప్రభావం మరియు ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై ఏడు చిన్న పుస్తకాలను రూపొందించే ప్రక్రియలో ఉంది. 

లాక్కో డౌన్ మరియు విడ్-19 మానసిక-సామాజిక ప్రభావాన్నీ, వాటిని ఎలా ఎదుర్కోవాలీ అనే విషయాలపై అంచనా వేయడానికి ఎన్.బి.టి. అధ్యయన బృందం (ప్రముఖ మానసిక శాస్త్రవేత్తలు, సలహాదారుల బృందం) హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఏడు విభాగాలకు ప్రశ్నావళి సెట్ ను విడుదల చేసింది. 

ప్రజలను ఏడు విభాగాలుగా విభజించారు: అవి - 

     1.      తల్లిదండ్రులు, తల్లులు & మహిళలు;  

     2.      పిల్లలు, కౌమారులు & యువతీ, యువకులు; 

     3.      ఉద్యోగులు, నిపుణులు, స్వయం ఉపాధి పొందినవారు & కార్మికులు;  

     4.      దివ్యాంగులు;  

     5.      కోవిడ్-19 బాధిత కుటుంబాలు; 

     6.      వైద్య సేవలు & నిత్యావసర సేవలు అందించేవారు; 

     7.      వృద్దులు (60 సంవత్సరాలు, ఆపైన వయస్సు కలిగిన వారు) 

సమాజ భాగస్వామ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, లాక్ డౌన్ సమయంలో భావోద్వేగాలను ఒకరి కొకరు పంచుకోవడం వంటి వాటిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రశ్నావళిని ప్రజల్లోకి తీసుకురావడమైంది.   ఈ అధ్యయనం అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో, పాఠకులు, సాధారణ ప్రజలు ఈ ఆన్ లైన్ ప్రశ్నావళి లో పాల్గొని, తమ అభిప్రాయాలు, అనుభవాలను తెలియజేయవలసిందిగా ప్రోత్సహించడం జరుగుతుంది.  కరోనా ప్రభావిత కుటుంబాల సభ్యులు పాల్గొని, తమ స్పందనలను తెలియజేయవలసిందిగా ప్రోత్సహించడం జరిగింది. 

ప్రశ్నావళిని ఈ లింకు ద్వారా పొందవచ్చు : 

https://nbtindia.gov.in/home__92__on-line-questionnaire-for-nbt-study.nbt.

ఎన్.బి.టి. అధ్యయన బృందంలో - డాక్టర్ జితేంద్ర నాగపాల్, డాక్టర్ హర్షిత, స్క్వాడ్రన్ లీడర్ మీనా అరోరా, లెఫ్టనెంట్ కల్నల్ తరుణ్ ఉప్పల్, శ్రీమతి రేఖా చౌహన్, శ్రీమతి సోనియా సిద్దు, కుమారి అపరాజిత దీక్షిత్ ఉన్నారు.  వీరు ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ - " కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం సృష్టిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో తనకు అప్పగించిన సవాలుతో కూడిన ఈ కష్టమైన పని గురించి, ఈ అధ్యయన బృందానికి పూర్తి అవగాహన ఉంది.  వివిధ విభాగాలలో సులభంగా చదవగలిగే సామాగ్రి ద్వారా పరిశోధన, అధ్యయనాలు, ఇంటర్వ్యూ ల సహాయంతో ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోడానికి ఈ బృందం, పద్ధతులు, ఆచరణాత్మక చిట్కాలను రూపొందిస్తుంది.  సర్వతోముఖ సాధికారత, లాక్ డౌన్ తో వ్యవహరించడానికి తగిన అవగాహనతో పాటు ఉత్తమ భావోద్వేగ శక్తి మరియు ధైర్యం కూడగట్టుకోడానికి ఇది సహాయపడుతుంది." - అని పేర్కొన్నారు. 

*****



(Release ID: 1610481) Visitor Counter : 168