హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వల్ల విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో పీఎం-జికెవై లబ్దిదారులకు నగదు పంపిణీ సజావుగా అయ్యేలా చూడాలని రాష్ట్రాలు/యూటీ లకు హోంమంత్రిత్వ శాఖ లేఖ

Posted On: 02 APR 2020 5:02PM by PIB Hyderabad

21 రోజుల లాక్డౌన్ సమయంలోప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన (పిఎం-జికెవై) లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా నగదు పంపిణీపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన  ఆర్థిక సేవల విభాగం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ మార్గదర్శకాలను అనుసరించికేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా అన్ని రాష్ట్రాలు / యుటిలకు లేఖ రాశారుపిఎమ్-జికెవై లబ్ధిదారులకు డబ్బు సజావుగా పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో  సామాజిక దూరం నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ / కేంద్రపాలిత ప్రాంతలలో సంబంధిత శాఖల యంత్రాంగంజిల్లా అధికారులుక్షేత్ర స్థాయిలో పనిచేసే సంస్థలకు మార్గదర్శకాలను వివరించి అవి కచ్చితంగా అమలయ్యేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

 Click here to see Communication to States

                                                                                                            *****


(Release ID: 1610378) Visitor Counter : 192