రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వల్ల లాక్ డౌన్ తో నిత్యవసర సరకులు, ఇతర వస్తువుల రవాణాకు పెద్ద ఊతం ఇస్తున్న పార్సిల్ రైళ్లు

సరఫరా అనుసంధాన వ్యవస్థ సజావుగా సాగడానికి నిర్దిష్ట సమయ పట్టికతో పార్శిల్ రైళ్లు 10 రూట్లల్లోనూ, ప్రత్యేక పార్శిల్ రైళ్లు సుమారు 18 రూట్ల లోను నడపడానికి ప్రణాళిక

దేశంలో వివిధ ప్రాంతాలకు ఇప్పటివరకు 30 ప్రత్యేక పార్శిల్ రైళ్లను నడిపిన భారతీయ రైల్వేస్

వినియోగదారుల డిమాండ్ మేరకు పాలు, ఆహార ఉత్పత్తుల పార్శిల్ రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వేస్

రాష్ట్రంలో స్వల్ప దూర ప్రయాణానికి పార్శిల్ రైళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను నెరవేర్చడానికి రైల్వే సర్వసన్నద్ధం

కోవిడ్-19లో అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ పౌరులకు అవసరమైన వస్తువుల కొరత లేకుండా చేస్తున్న రైల్వే సిబ్బంది .

Posted On: 02 APR 2020 12:56PM by PIB Hyderabad

కోవిడ్-19 వల్ల ఏర్పడ్డ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలోదేశ పౌరుల అవసరాలను తీర్చడానికి కావలసిన వస్తువులు మరియు ఇతర సరుకులను దేశవ్యాప్తంగా రవాణా చేయడానికి భారత రైల్వే- పార్సెల్ రైళ్ల నిరంతరాయ సేవలను అందిస్తోంది. భారతీయ రైల్వే ఇప్పటికే సరుకు రవాణా రైళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులను రవాణా చేస్తోంది. రైల్వేలు సరుకు రవాణా కార్యకలాపాలు ఆహార ధాన్యాలువంట నూనెఉప్పుచక్కెరబొగ్గుసిమెంట్పాలుకూరగాయలుపండ్లు వంటి ముఖ్యమైన వస్తువుల భారీ రవాణా అవసరాలను తీర్చగామరో వైపు పార్శిల్ రైళ్లు చిన్న పరిమాణాలలో పంపిణీ చేయవలసిన వివిధ వస్తువులను రవాణా చేస్తున్నాయి.

ఇప్పటివరకుభారతీయ రైల్వే 30 ప్రత్యేక పార్శిల్ రైళ్లను దేశవ్యాప్తంగా వివిధ గమ్యస్థానాలకు చేర్చింది.  

ఈ కార్యకలాపాలను నిర్వహించే సిబ్బంది కోవిడ్ -19 లో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారుపౌరులకు  అవసరమైన వస్తువుల కొరత ఉందనే భావనే రానీయకుండా కృషి చేస్తున్నారు. 

తన ఉద్యోగుల అత్యుత్తమ పనితీరు ప్రోత్సాహంతో జోనల్ రైల్వే ఇప్పుడు మార్చి 31, 2020 నుండి నిర్దిష్ట సమయ పట్టికతో కూడిన పార్సెల్ రైళ్లను నడపడం ప్రారంభించింది. 

లాక్ డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా ముఖ్యమైన వస్తువులుసరుకు అవసరాలను తీర్చేందుకు వేగవంతంగా వాటిని గమ్యానికి చేర్చే ప్రయత్నం రైల్వేస్ చేస్తోంది. ప్రస్తుతమున్న రూట్లలోనే కాకుండా ఇతర ప్రాంతాలకు మార్గాలను కూడా గుర్తిస్తోంది. ప్రత్యేక పార్శిల్ రైళ్లను కూడా డిమాండ్ ప్రకారం ప్రణాళిక చేసుంటోంది.  ప్రత్యేక పార్శిల్ రైళ్లను కీలకమైన కారిడార్లతో  అనుసంధానించడానికి జోనల్ రైల్వేలు కొన్ని రూట్లను గుర్తించాయి:

1. న్యూ ఢిల్లీ - గువహతి
2. న్యూ ఢిల్లీ - ముంబై సెంట్రల్

3. న్యూ ఢిల్లీ -కల్యాణ్‌

4. చండీఘర్ - జైపూర్‌

5. మోగా - చాంగ్‌సారీ

6. కళ్యాణ్ -న్యూ ఢిల్లీ 

7. నాసిక్-న్యూ ఢిల్లీ 

8. కళ్యాణ్-సంత్రాగచ్చి 

9. కళ్యాణ్ - చాంగ్‌సరి

10. కోయంబత్తూర్ - పటేల్ నగర్ (ఢిల్లీ రీజియన్)

11. పటేల్ నగర్ (ఢిల్లీ రీజియన్) -కోయంబత్తూర్ 

12. కోయంబత్తూరు - రాజకోట్ 

13. రాజకోట్ -  కోయంబత్తూరు 

14. కోయంబత్తూరు - జైపూర్ 

15. జైపూర్- కోయంబత్తూర్ 

16. సేలెం - బటిండా

17. కంకరి-లుధియానా 

18. సంక్రైల్ - బెంగళూరు 

19. అవసరం మేరకు ఇతర మార్గాలు 

ప్రస్తుత కాలంలో వినియోగదారుల డిమాండ్ ప్రకారం భారతీయ రైల్వే ఇతర పార్సెల్ రైళ్లను కూడా నడుపుతోంది - వీటిలో: 

ఎ) పలన్‌పూర్ (గుజరాత్) నుండి పాల్వాల్ (ఢిల్లీకి సమీపంలో)మరియు రేణిగుంట (ఎపి) నుండి ఢిల్లీ వరకు 'మిల్క్ స్పెషల్స్'

బి) కంకరియా (గుజరాత్) నుండి కాన్పూర్ (యుపి) మరియు సంక్రైల్ (కోల్‌కతా సమీపంలో)కి  పాల ఉత్పత్తులు 

సి) మోగా (పంజాబ్) నుండి చాంగ్సరి (అస్సాం)కి  ఆహార ఉత్పత్తులు 

జోనల్ రైల్వేలు రాష్ట్రంలోని తక్కువ దూరానికి రవాణా అవసరాన్ని గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటున్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకుపశ్చిమ మధ్య రైల్వే పార్శిల్  స్పెషల్స్‌ను మధ్యప్రదేశ్‌లో ఈ క్రింది మార్గాల్లో నడిపేందుకు చొరవ తీసుకుంది:

భోపాల్- గ్వాలియర్ 

ఇటార్సీ - బినా

భోపాల్- ఖండ్వా

రేవా- అనూప్పూర్

రేవా - సింగ్రౌలి

భారతీయ రైల్వే  ప్రత్యేక పార్శిల్ సేవలు సమయ పట్టిక ప్రకారం నడుస్తున్నాయని ఇక్కడ గమనించాలి. ఈ టైమ్‌టేబుల్ రైళ్లు ముందుగా నిర్ధారించిన షెడ్యూల్ స్టాప్ లను  కలిగి ఉన్నాయి. ఏదైనా సరుకును ఇలా స్టాపేజ్ ఉన్న ఏ స్టేషన్లలోనైనా  బుక్ చేసుకోవచ్చువాటిలో ఏ స్టేషన్ల వరకైనా బుక్ చేసుకోవచ్చు. సకాలంలో సరుకుల నిల్వలను పంపిణీ చేయడం కోసంసమర్థవంతంగా తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

స్థానిక పరిశ్రమలుఇ-కామర్స్ కంపెనీలుఏదైనా ఆసక్తిగల గ్రూపులుసంస్థలువ్యక్తులు జోనల్ స్థాయిలో రైల్వే అధికారులను సంప్రదించవచ్చువివిధ స్టేషన్లలోని రైల్వే అధికారుల సంప్రదింపు వివరాలు కూడా అందుబాటులో ఉంచాము. తద్వారా ఎవరైనా లోడ్ చేయటానికి సంప్రదించవచ్చు.  ప్రకటనలతో సహా వివిధ రకాల సమాచార మార్గాల ద్వారా  జోనల్ రైల్వే కొత్త ఖాతాదారుల వరకు  చేరుతోంది.

                                                                                                ****(Release ID: 1610342) Visitor Counter : 205