వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సందర్భంగా లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా దేశంలో ఆహార సరఫరాలు పెంచిన ఎఫ్ సీఐ

బుధవారం 53 రైల్ రేక్ లోడింగ్, మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి 352 రేక్ లతో 9.86 ఎల్ఎంటి ఆహారధాన్యాల తరలింపు

Posted On: 01 APR 2020 9:16PM by PIB Hyderabad

దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో గోధుమ, బియ్యం నిరంతరాయంగా సరఫరా అయ్యేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ) చర్యలు తీసుకుంటోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలో పిఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం పరిధిలోకి వచ్చే ప్రతీ ఒక్క లబ్ధిదారునికి నెలకు కిలో 5 రూపాయల ధరకు అందించాలని నిర్దేశించిన కోటా మాత్రమే కాకుండా వచ్చే 3 నెలల కాలానికి అదే 5 రూపాయల ధరకు ఒక్కో వ్యక్తికి అదనంగా 5 కిలోల ఆహారధాన్యాలు సరఫరా చేసేందుకు కూడా ఎఫ్ సిఐ పూర్తిగా సమాయత్తంగా ఉంది. 2020 మార్చి 31 నాటికి ఎఫ్ సిఐ వద్ద 56.75 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటి) ఆహారధాన్యాల (30.6 ఎంఎంటి బియ్యం, 26.06 ఎంఎంటి గోధుమ) అందుబాటులో ఉన్నాయి.

సరఫరా కార్యకలాపాల నిర్వహణ అత్యంత సవాలుగా ఉన్న వాతావరణంలో కూడా పెరుగుతున్న డిమాండుకు దీటుగా బియ్యం, గోధుమ రైళ్ల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు ఎఫ్ సిఐ పంపగలుగుతోంది. ఒక్క బుధవారంనాడే (01.04.2020) మొత్తం 1.48 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటి) ఆహారధాన్యాలు 53 రేక్ లలో లోడ్ చేసే పని నిర్వహించింది. దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన 2020 మార్చి 24వ తేదీ నుంచి ఎఫ్ సిఐ ఇప్పటికి 352 రేక్ లతో సుమారు 9.85 ఎల్ఎంటి ఆహార ధాన్యాలు తరలించింది.

మార్కెట్ లో ఆహార ధాన్యాల కొరతను తగ్గించేందుకు వీలుగా ప్యానెల్ లో ఉన్న ఫ్లోర్ మిల్లులు/  రాష్ట్ర ప్రభుత్వాలకు ఓపెన్ మార్కెట్ అమ్మకాల పథకం (ఒఎంఎస్ఎస్) కింద కూడా బహిరంగ మార్కెట్ లో ఎఫ్ సి ఐ ఆహారధాన్యాల ఇ-వేలం నిర్వహిస్తోంది. మార్చి 31వ తేదీన నిర్వహించిన ఇ-వేలంలో 1.44 ఎల్ఎంటి గోధుమకు బిడ్లు దాఖలయ్యాయి. 

ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి త్వరితగతిన వ్యాపిస్తున్న కారణంగా రాష్ర్టాల్లోని ఫ్లోర్ మిల్లులు గోధుమ అనుబంధ ఉత్పత్తుల తయారీదారులకు సరఫరా చేసేందుకు ఇ-వేలంతో పని లేకుండా  ఒఎంఎస్ఎస్ విధానం కింద ఎఫ్ సిఐ నుంచి నేరుగా గోధుమ కొనుగోలు చేసేందుకు జిల్లా మెజిస్ర్టేట్లు/ కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. ఇప్పటివరకు ఈ విధానంలో 79,027 మెట్రిక్ టన్నుల గోధుమ కేటాయించారు.

 

క్రమ సంఖ్య

రాష్ట్రం

మొత్తము

(మెట్రిక్ టన్నుల్లో)

 

i

ఉత్తరప్రదేశ్

35675

ii

బీహార్

22870

iii

హిమాచల్ ప్రదేశ్

11500

iv

హర్యానా

4190

v

పంజాబ్

2975

vi

గోవా

1100

vii

ఉత్తరాఖండ్

375

viii

రాజస్తాన్ 

342

 

 

బియ్యం ఇ-వేలం కూడా నిర్వహించారు. మార్చి 31వ తేదీన జరిగిన ఇ-వేలంలో 77 వేల మెట్రిక్ టన్నుల బియ్యానికి తెలంగాణ, తమిళనాడు, జమ్ము-కాశ్మీర్ నుంచి బిడ్లు దాఖలయ్యాయి. 

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఇ-వేలంలో పాల్గొనకుండానే ఒఎంఎస్ఎస్ కింద కిలో రూ.22.50 ధరకు బియ్యం సేకరించేందుకు రాష్ర్టాలకు అనుమతి ఇచ్చారు. ఎన్ఎఫ్ఎస్ఏ కేటాయింపులకు అదనంగా ఎలాంటి అవసరాలున్నా తీర్చేందుకు పిఎం గరీబ్ కల్యాణ్ యోజన కేటాయింపుల కింద ఈ అదనపు కేటాయింపు చేస్తున్నారు. ఈ విధంగా 6 రాష్ర్టాలకు వారి అభ్యర్థన మేరకు ఇప్పటికి 93,387 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు.

క్రమ సంఖ్య

 

రాష్ట్రం

మొత్తము

(మెట్రిక్ టన్నుల్లో)

i

తెలంగాణ

50000

ii

అస్సాం

16160

Iii

మేఘాలయ

11727

Iv

మణిపూర్

10000

V

గోవా

4500

Vi

అరుణాచలప్రదేశ్

1000

****


(Release ID: 1610142) Visitor Counter : 271