పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు 70 వేల కిలోమీటర్ల వాయు మార్గంలో ప్రయాణించాయి.


కార్గో విమానాలు దేశంలోని మారుప్రాంతాలకు వైద్య పరమైన వస్తువులను రవాణా చేస్తున్నాయి.

Posted On: 01 APR 2020 8:48PM by PIB Hyderabad

మొత్తం 74 లైఫ్ లైన్ ఉడాన్ కార్గో విమానాల్లో 56 విమానాలు ఇంతవరకు ఎయిర్ ఇండియా గ్రూప్ ద్వారా నడిచాయి.   2020 మార్చి నెల 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆరు రోజుల కాలంలో ఈ విమానాలను ఎయిర్ ఇండియా, అలియాన్స్ ఎయిర్, ఐ.ఏ.ఎఫ్.,పవన్ హన్స్ తో పాటు కొన్ని ప్రయివేటు విమానయాన సంస్థలు నడిపాయి.   ఈ లైఫ్ లైన్ విమానాలు ఇంతవరకు 70 వేల కిలోమీటర్ల వాయు మార్గంలో ప్రయాణించాయిఇంతవరకు 38 టన్నుల సరుకులను రవాణా చేశాయి.  విమానాశ్రయాల నుండి మరియు విమానాశ్రయాలవరకు సరకులను రోడ్డు మార్గం గుండా రవాణా చేయడానికీ, అదేవిధంగా వాయు మార్గంలో రవాణా చేయడానికి సిబ్బంది విషయంలోనూ, అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, లైఫ్ లైన్ ఉడాన్ విమానాలను నడపడం జరిగింది. 

 

రవాణా చేసే వస్తువుల్లో ఎక్కువ భాగంగా ఉన్న మాస్కులు, గ్లోవ్స్, ఇతర వినియోగ వస్తువులు తక్కువ బరువుతో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించడంతో, ప్రతి టన్ను బరువున్న వస్తువులకు ఎక్కువ ప్రదేశం కావలసివచ్చింది.   ప్రత్యేక అనుమతితో, తగిన సంరక్షణ, జాగ్రత్తలతో ఈ వస్తువులను ప్రయాణీకులు కూర్చునే ప్రదేశంలో అమర్చి రవాణా చేయవలసి వచ్చింది. 

 

 

అంతర్జాతీయ రంగంలో, 2020 ఏప్రిల్ 3వ తేదీ నుండి ముఖమైన వైద్య సామాగ్రి రవాణా కోసం , భారత్-చైనా మధ్య కార్గో ఎయిర్-బ్రిడ్జి ని ఏర్పాటు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.సి.ఏ.) మరియు ఎయిర్ ఇండియా, చైనా అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి. భారతదేశం కోవిడ్-19 కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ, వైద్య పరమైన వస్తువులను, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం అత్యంత సమర్ధవంతంగా, అత్యంత తక్కువ ఖర్చుతో రవాణా చేయాలని, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు విమానయాన పరిశ్రమలు నిర్ణయించాయి.   

 

 

తేదీల వారీగా తిరిగే లైఫ్ లైన్ విమానాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 

 

క్రమ సంఖ్య 

 
   తేదీ 
  
ఎయిర్ ఇండియా   

 

 

అలయన్స్ 

 

ఐ.ఏ.ఎఫ్. 

 

ఇండిగో 

 

స్పైస్ జెట్ 

మొత్తం

తిరిగే 

విమానాలు 

 

26.3.2020

02

-

-

-

02

04

2

27.3.2020

04

09

-

-

-

13

3

28.3.2020

04

08

-

06

-

18

4

29.3.2020

04

10

06

--

-

20

5

30.3.2020

04

-

03

--

-

07

6

31.3.2020

09

02

01

 

 

12

 

 

మొత్తం విమానాలు 

27

29

10

06

02

74

 

 

 *   లడఖ్, దిమాపూర్, ఇంఫాల్, గువాహటి, పోర్ట్ బ్లెయిర్ లకు ఎయిర్ ఇండియా మరియు ఐ.ఏ.ఎఫ్. కలిసి పనిచేస్తాయి. 

 

 

****



(Release ID: 1610138) Visitor Counter : 121