రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్ – 19 కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే అవసరమైన వారికి ఆహారాన్ని అందిస్తూనే ఉంది : మార్చి 28 నుంచి 1.4 లక్షల మందికి ఆహారాన్ని అందించింది

· ఈ భోజనాల్లో 1 లక్షకు పైగా ఐ.ఆర్.సి.టి.సి. వంటశాలలు సిద్ధం చేశాయి.

· ఆర్.పి.ఎఫ్. సైతం ఆహార పంపిణీలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు, తన సొంత వనరుల నుంచి సుమారు 38,600 మందికి భోజనాన్ని అందిస్తోంది.

Posted On: 01 APR 2020 6:00PM by PIB Hyderabad

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కు ముందే ప్యాసింజర్ రైళ్ళను ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ ఐ.ఆర్.సి.టి.సి వంటశాలల ద్వారా అవసరమైన వారికి రైల్వేశాఖ ఆహారాన్ని అందిస్తోంది. ఆర్.పి.ఎఫ్., జి.ఆర్.పి, మండలాల వాణిజ్య విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆహారపు పొట్లాలను పంపిణీ చేస్తోంది.

ఒక బృందంగా పని చేస్తూ వివిధ రైల్వే జోన్లలోని అన్ని విభాగాల సహకారంతో ఆహారపు పంపిణీ చేస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతతో పాటు సామాజిక దూరాన్ని పాటిస్తోంది. పేదలకు ఆహారాన్ని అందించే ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు వివిధ జోన్లు, డివిజన్లకు చెందిన అధికారులతో నిరంతం సంప్రదింపులు జరుపుతోంది.  

న్యూఢిల్లీ, బెంగళూరు, హుబ్లి, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, భూసావల్, హౌరా, పాట్నా, గయా, రాంచీ, కతిహార్, దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్, బాలాసోర్, విజయవాడ, ఖుర్దా, కాద్పాలి, తిరుచిరాపల్లి, ధన్ బాద్, గౌహతి, సంస్తిపూర్ లాంటి అన్ని జోన్లు కలుపుకుని 2020 మార్చి 28 నుంచి ఇప్పటి వరకూ 1,02,937 భోజనాలను నిరుపేదలకు పంపిణీ చేసింది.

మార్చి 28న 2700 భోజనాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 29న 11,530 భోజనాలు, 30న 20,487 భోజనాలు, 31న 30,850 భోజనాలు మరియు ఏప్రిల్ 1న 37,370 భోజనాలను ఐ.ఆర్.సి.టి.సి. తయారు చేసి పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పెద్ద ఎత్తున పాల్గొంది.

·        2020 మార్చి 28న 74 చోట్ల 5419 మంది పేదలకు ఆర్.పి.ఎఫ్. ద్వారా ఆహారం అందించారు. ఐ.ఆర్.సి.టి.సి. వంటశాలలో తయారు చేసిన ఆహారంతో పాటు ఆర్.పి.ఎఫ్. అంతర్గత వనరుల నుంచి 2,719 మందికి ఆహారం అందించారు.

·        2020 మార్చి 29న 146 చోట్ల 21,568 మంది పేదలకు ఆర్.పి.ఎఫ్. ఆహారం అందించింది. ఐ.ఆర్.సి.టి.సి. వంటశాలల్లో తయారు చేసిన ఆహారంతో పాటు 8,790 మందికి ఆర్.పి.ఎఫ్. అంతర్గత వనరుల నుంచి, మరో 4,150 మందికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో పంపిణీ చేశారు.

·        2020 మార్చి 30న 186 చోట్ల 30,741 మంది నిరుపేదలకు ఆర్.పి.ఎఫ్. ఆహారాన్ని అందించింది. ఐ.ఆర్.సి.టి.సి, వంటశాలల్లో తయారు చేసిన ఆహారంతో పాటు 12,453 మందికి ఆహారాన్ని ఆర్.పి.ఎఫ్. అంతర్గత వనరుల నుంచి సేకరించగా, 3,746 మందికి ఆహారాన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో పంపిణీ చేశారు.

·        2020 మార్చి 31న 196 చోట్ల 38,045 మంది నిరుపేదలకు ఆహారం అందించగా అందులో 14,633 మందికి ఆర్.పి.ఎఫ్. సొంత వనరుల నుంచి, 4,072 మందికి ఎన్జీఓల సహకారంతో పంపిణీ చేశారు.

రైల్వే మరియు వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ సైతం భారతీయ రైల్వే అధికారులు వారి మానవ వనరుల ద్వారా ఆహారంతో పాటు ఇతర సహకారాన్ని అందించాలని ఇప్పటికే ఆదేశించారు. తమ ప్రయత్నాల విస్తృతిని మరింత పెంచి, జిల్లా స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మారుమూల ప్రాంతాల్లోనూ సేవలు అందించాలని సూచించారు.

కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించిన సమయంలో పేదలకు ఆహారాన్ని అందిస్తున్న రైల్వే సేవలు అభినందనీయమని పలువురు చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ఈ సేవలను కొనసాగించేందుకు తగిన ముడి సరుకు నిల్వలను సిద్ధం చేసింది.



(Release ID: 1610107) Visitor Counter : 203