కోవిడ్-19పై పోరాటంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం
జమ్మూ-కశ్మీర్ లో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ)కి చెందిన ధరల పర్యవేక్షణ, రిసోర్స్ యూనిట్ (పిఎమ్‌ఆర్‌యు) ఏర్పాటు అయింది. ఈ యూనిట్ ఉన్న రాష్ట్రాల్లో ఇది 12 వ రాష్ట్రం. కేరళ, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, నాగాలాండ్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మిజోరం సహా 11 రాష్ట్రాల్లో పిఎమ్‌ఆర్‌యులను ఇప్పటికే ఎన్‌పిపిఎ ఏర్పాటు చేసింది.
పిఎంఆర్‌యు, రిజిస్టర్డ్ సొసైటీ. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ ప్రత్యక్ష నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఈ సంస్థ ఖర్చులకు ఎన్‌పిపిఎ నిధులు సమకూరుస్తుంది. సరసమైన ధరలకు ఔషధాలు లభ్యత, ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎన్‌పిపిఎ, స్టేట్ డ్రగ్ కంట్రోలర్‌కు పిఎమ్‌ఆర్‌యు సహకరిస్తుంది. ఇందుకు సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన, సమాచార వితరణ (ఐఇసి) కార్యకలాపాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నారు.
ఔషధ ధరల నియంత్రణ ఆర్డర్ (డిపికో) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవటానికి పిఎమ్‌ఆర్‌యు, నమూనాలను సేకరించి, డేటాను సేకరించి, విశ్లేషించి, ఔషదాల లభ్యత, అధిక ధరలకు సంబంధించి నివేదికలు తయారు చేస్తుంది. దేశం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధిక ధరలను నిర్ణయించడం, స్థానిక కొరత / హోర్డింగ్ సమస్యలను పరిష్కరించడంలో ఎన్పిపిఎకి, ప్రభుత్వానికి పిఎమ్‌ఆర్‌యు సహాయం చేస్తుంది కాబట్టి ఈ యూనిట్ ఏర్పాటు అదనపు ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
****