రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి అత్యవసర సహాయ నిధికి ఎరువుల శాఖ పరిధిలోని
ప్రభుత్వ రంగ సంస్థలచే రూ. 27 కోట్లకు పైగా విరాళం
Posted On:
01 APR 2020 12:57PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడానికి పౌరులకు తోడ్పాటు మరియు సహాయం కోసం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి అత్యవసర సహాయ నిధికి (PM CARES) ఎరువుల శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 27 కోట్లకు పైగా విరాళం ఇచ్చాయి.
కోవిడ్ -19 మహమ్మారిపై భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వవలసినదిగా నేను చేసిన అభ్యర్ధనకు స్పందించి విరాళాలు ప్రకటించిన ఈ కంపెనీల సిఎండి లకు నేను కృతజ్ఞుణ్ణి అని కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ పలు ట్వీట్లు చేశారు.
PM CARES నిధికి ఎరువుల కంపెనీ ఇఫ్కో రూ. 25 కోట్ల విరాళం ప్రకటించిందని, ఇఫ్కో అందించిన ఈ సహాయానికి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం జరిపే పోరాటానికి అండగా నిలవడంలో ఈ సహాయం ఎంతో తోడ్పడగలదని శ్రీ గౌడ అన్నారు. కార్పోరేట్ సంస్థల సామాజిక బాద్యత నిధి నుంచి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించినందుకు క్రిభ్కో సంస్థను కేంద్ర మంత్రి ప్రశంసించారు. కోవిడ్-19 నేపధ్యంలో ప్రభుత్వం చేపట్టే సహాయ చర్యలకు ఇది తోడ్పడగలదని మంత్రి అన్నారు.
తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ ఎఫ్ ఎల్ – కిసాన్ సంస్థ కార్పోరేట్ సంస్థల సామాజిక బాద్యత నిధి నుంచి రూ. 63.94 లక్షల విరాళం ప్రకటించినందుకు సంస్థ సి ఎం డి మనోజ్మిశ్రాకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రబలిన కోవిడ్ -19 వంటి ప్రజారోగ్య సమస్యను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, ఇలాంటి మహమ్మారిని కట్టడి చేయడానికి సమష్టి కృషి అవసరమని, ఇందుకు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు తమకు వీలైనంత గరిష్ఠ మొత్తాన్ని PM CARESకు విరాళం ఇవ్వాలని మంత్రి కోరారు.
పౌరులకు తోడ్పాటు మరియు సహాయం కోసం ప్రధానమంత్రి అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కోవిడ్ -19 వంటి విపత్తు వచ్చినప్పుడు ఈ నిదిని ఉపయోగిస్తారు.
(Release ID: 1610013)
Visitor Counter : 199