పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఉడాన్ జీవనరేఖ క్రింద ఇప్పటి వరకు 74 విమానాలు నడుపబడ్డాయి; ఒక్కరోజులో 22 టన్నుల సరుకు రవాణా చేయబడింది

Posted On: 01 APR 2020 3:57PM by PIB Hyderabad

కేంద్ర పౌర విమానయాన శాఖ వారి కార్యక్రమం  జీవనరేఖ ఉడాన్ కార్యక్రమం క్రింద  దేశ వ్యాప్తంగా వైద్య అవసరాల రవాణా కోసం ఈ రోజు వరకు 74 విమానాలను సరుకు రవాణా కోసం నడిపారు. కాగా ఈ రోజు వరకు 37.63 టన్నుల సరుకు రవాణా చేయగా ఒక్క 31 మార్చి 2020 రోజునే 22 టన్నులకు పైగా సరుకు రవాణా చేయబడింది.

31 మార్చి 2020న ఈ క్రింది విమానాలు సరుకు రవాణా కోసం నడుపబడినాయి:

జీవనరేఖ 1ఏయిర్ ఇండియా విమానాలు: ముంబై నుండి న్యూ ఢిల్లీ, న్యూ ఢిల్లీ నుండి ముంబై  నడుపబడే విమానాలు మేఘాలయ, అస్సాంలకు సంబంధించిన సరుకు , నాగాలాండు, ఐసిఎంఆర్ సరుకు, అరుణాచల్ ప్రదేశ్ మరియు పుణెలకు సంబంధించిన సరుకులను తీసుకు వెళ్ళాయి.

జీవనరేఖ 2ఎయిర్ ఇండియా విమానాలు న్యూ ఢిల్లీ నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి త్రివేండ్రం, త్రివేండ్రం నుండి గోవా, గోవా నుండి ఢిల్లీ.  ఈ విమానాలు ఆంధ్రప్రదేశ్, కేరళ, ఐసిఎంఆర్, గోవాలకు సంబంధించిన సరుకులను రవాణా చేసాయి.

 జీవనరేఖ 3 అలయెన్స్ ఏయిర్ విమానంహైదరాబాద్ నుండి బెంగళూరు, బెంగళూరు నుండి హైదరాబాదుకు జౌళి మంత్రిత్వ శాఖ వారి సరుకు రవాణా చేసాయి.

జీవనరేఖ 4ఎయిర్ ఇండియా విమానంచెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్, పోర్ట్ బ్లెయిర్ నుండి చెన్నై

జీవనరేఖ 5: ఐఏఎఫ్ విమానం హిండన్(ఢిల్లీనుండి పోర్ట్ బ్లెయిర్ వయా సులూర్

కొవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటంలో భాగంగా, కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు ’జీవనరేఖ ఉడాన్’  కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ  కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంనే కాక దేశం ఆవల కూడా అవసరమైన మందులు మరియు ఇతర వైద్య సామాగ్రిని విమానాల ద్వారా రవాణా చేస్తున్నది.

అందుకు  సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి:

క్ర.సం

తేది

ఎయిర్ ఇండియా

అలయెన్స్

ఐఏఎఫ్

ఇండిగో

స్పైస్జెట్

నడిపిన మొత్తం విమానాలు

1

26.3.2020

02

-

-

-

02

04

2

27.3.2020

04

09

-

-

-

13

3

28.3.2020

04

08

-

06

-

18

4

29.3.2020

04 

10 

06 

--

-

20

5

30.3.2020

04

-

03

--

-

07

6

31.3.2020

09

02

01

 

 

12

 

మొత్తం విమానాలు

27

29

10

06

02

74

*ఎయిర్ ఇండియా మరియు ఐఏఎఫ్ భాగస్వామ్యంతో లడఖ్, డిమాపూర్, ఇంఫాల్, గువాహటి మరియు పోర్ట్ బ్లెయిర్

·         వాయు మార్గాన వైద్య సంబంధిత సరుకు రవాణా కోసం మాత్రమే నిర్దేశించబడిన వెబ్సైట్ను కేంద్ర పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ  ప్రారంభించింది  (www.civilaviation.gov.in). లింకు ఈ రోజు నుండి  పూర్తిగా పనిచేస్తుంది.  

·         దేశీయ సరుకు రవాణా విమానాలు బ్లూ డార్ట్  మరియు స్పైస్జెట్ విమానాలు వ్యాపార సంబంధిత కార్యకలాపాల కోసం సరుకు రవాణా విమానాలు నడుపబడుతున్నాయి..

 


(Release ID: 1609980) Visitor Counter : 223