వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో అన్నదాతలకు ఐసీఏఆర్ సలహాలు
Posted On:
31 MAR 2020 5:41PM by PIB Hyderabad
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి తీవ్రతరమవుతున్న సమయంలోనే రబీ పంటలు కోతకు వచ్చిన నేపథ్యాన రైతులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలతో కూడిన అడ్వైజరీని (సూచనల పత్రాన్ని) భారత కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోనే పంటల కోతలు అనివార్యంగా మారిన నేపథ్యంలో అన్నదాతలు పంటల కోతలు, నూర్పిడి చేయడం, ఆయా పంట కోతల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయోత్పత్తుల నిల్వ, మార్కెటింగ్ తదితర సందర్భాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఐసీఏఆర్ ఈ అడ్వైజరీని జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
పంట కోతలు & నూర్పిడి విషయంలో..
పొలాల నుంచి పంటలను సమీకరించడం వాటిని జాగ్రత్తగా మార్కెట్లకు తరలించడంతో పాటు వివిధ ఇతర వ్యవసాయ కార్యకలాపాలు సరైన సమయంలో నిర్వంచడం అనివార్యమైన నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు గాను రైతులు తగిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు చేపట్టాలని ఐసీఏఆర్ సూచించింది. పంట పనులు చేస్తున్న సమయంలో సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, చేతులను సబ్బుతో కడుక్కోవాలని, ముఖానికి మాస్క్‌లను ధరించాలని, శరీరాన్ని కప్పుకునేలా దుస్తులు ధరించడం, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటి చిన్నచిన్న జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపింది. క్షేత్ర కార్యకలాపాల మొత్తం ప్రక్రియలో అడుగడుగునా భద్రతా చర్యలు మరియు సామాజిక దూరాన్ని తప్పకపాటించాలని కోరింది.
చాలా ఉత్తరాది రాష్ట్రాలలో గోధుమ పంట కోతకు వచ్చింది. పంట పెంపకందారుల ద్వారా దీనిని ఆయా రాష్ట్రాలలో గానీ.. ఇతర రాష్ట్రాలకు గానీ తరలించేందుకు వివిధ అనుమతులు జారీ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా కార్యక్రమంలో నిమగ్నమైన వారు మరమ్మతులు, నిర్వహణ మరియు కోత ఆపరేషన్లో ఉన్న కార్మికులు తగు జాగ్రత్తలు వివిధ భద్రతా చర్యలు
పాటించేలా తగిన జాగ్రత్తులు తీసుకోవాలి.
మరోవైపు కాయధాన్యాలు, మొక్కజొన్న, మిరపతో పాటు శనగ పంటలు కూడా వేగంగా కాపుకొస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలలో చెరకు పంట గరిష్ట స్థాయిలో ఉంది. ఇదే సమయంలో ఉత్తరాదిన వ్యక్తులతో నాట్లు వేయించే ప్ర్రక్రియను కూడా మొదలు పెట్టనున్నారు.
ఈ సమయంలో పంట పనులకు వచ్చే వ్యక్తులు విధిగా వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఐసీఏఆర్ సూచించింది. క్షేత్ర పంటలతో, పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు పాటు చేపల పెంపకం పనుల్లోని వారు క్షేత్రస్థాయి పనులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఆ తరువాత కూడా తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. నాట్లు వేయించడం, పంట కోత వంటి పనులను రైతు కూలీలతో చేయిస్తున్నట్లయితే వారి మధ్య కనీసం 4-5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐసీఏఆర్ తెలిపింది. ఈ పనులలో పాల్గొనే వారందరూ విధిగా ముఖానికి మాస్క్‌లు ధరిచడం, సహేతుకమైన సమయాల్లో చేతిని సబ్బుతో కడుక్కోవాలి. పంట పనులు నిర్వహస్తున్న వేళ మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్నా, భోజన సమయంలో, పంటను కలెక్షన్ కేంద్రాలకు తరలిస్తున్న తరుణంలో చేపడుతున్న లోడింగ్, అన్‌లోడింగ్ సమయంలోను కూలీలతో సహా ఆయా కార్యక్రమాల్లో పొల్గొనే వారి మధ్య దాదాపు 3-4 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటకోత పనులు వేగంగా పూర్తికావాలనే తలంపుతో ఒకే రోజు ఎక్కువ మందని పంట పనుల్లో నమగ్నం చేయకపోవడం ఉత్తమం. క్షేత్రస్థాయి పనులలో సాధ్యమైనంత వరకు తెలిసిన వారిని వాడుకోవడం మేలు. కొత్త వారిని పనుల్లోకి తీసుకోవాల్సి వస్తే వారి ఆరోగ్య పరిస్థితిని తగు విధంగా వాకబు చేసి వారు ఆరోగ్యంగా ఉన్నట్టుగా నమ్మకం కుదిరితేనే పనుల్లో చేర్చుకోవడం మేలు. ఈ ప్రతికూల సమయంలో కూలీలకంటే కూడా ఎక్కువగా యంత్రాలతో సాగు పనులను నిర్వహించడం ఉత్తమం. సాగు యంత్రాలతో పనులు నిర్వహించే సమయంలో అవసరం మేరకే పంట క్షేత్రంలోకి పరిమితంగా వ్యక్తులను అనుమతించడం మేలు. పంట పనులు మొదలు పెడుతున్న వేళ, సహేతుకమైన సమయంలోనూ పొలం పనుల్లో వాడే యంత్రాలను సరిగ్గా శుభ్రం చేయాలి. పంటను తరలించే వాహనాలను, గోనే సంచులను, ఇతర ప్యాకేజింగ్ సామగ్రిని తప్పక శుభ్రం చేయాలి. సేకరించిన పంటను చిన్నచిన్న కుప్పలుగా చేర్చడం మేలు. ఒక్కో కుప్పకు కుప్పకు మధ్య కనీసం 3-4 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్త వహించాలి. రద్దీని నివారించేందుకు గాను క్షేత్రస్థాయి ప్రాసెసింగ్‌కు ఒక్కరు లేదా ఇద్దరు వ్యక్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న, వేరుశనగ కోసం త్రెషర్ల యొక్క సరైన పారిశుధ్య నియంత్రణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా యంత్రాలను రైతు సమూహాలు పంచుకొని
ఉపయోగించినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి. చేతితో తరచుగా తాకే యంత్రపరికరాలను శుభ్రంగా కడగడం ఉత్తమం.
పంట కోత, నిల్వ, వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ సమయంలో..
సమీకరించిన పంటను ఎండబెట్టడం,నూర్పడి చేయడం, శుభ్రపరచడం,వేరు పరచడం, గ్రేడింగ్ చేయడం, ప్యాకేజింగ్ వంటి కార్యకలాపాలు చేసేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఆయా కార్యకలాపాల్లో పాల్గొనే వారి శరిరీంలోకి దుమ్ము, దూళి కణాలు చేరకుండా ఉంటాయి. తద్వారా శ్వాసకోశ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పండించిన ధాన్యాలు, మిల్లెట్లు, పప్పు ధాన్యాలను పొలంలో గానీ ఇంటి వద్ద గానీ నిల్వ చేయడానికి ముందు అవి పూర్తిస్థాయిలో ఎండేలా జాగ్రత్త పడాలి. పంటను నిల్వ చేసేందుకు గత ఏడాది వాడిన గోనే సంచులను వాడకూడదు. 5 శాతం వేప ద్రావణంలో నాన్చి ఆరబెట్టిన గోనె సంచులనే పంటను నిల్వ చేయడానికి ఉపయోగించాలి. పంట పొలాల వద్ద ఉత్పత్తుల నిల్వ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెరుగైన ధర లభించేదాక ఉత్పత్తులను నిల్వ చేసేందుకు గాను రైతులు అసవరమైతే తమ పంట ఉత్పత్తిని శీతల గిడ్డంగులకు గానీ, గోడౌన్లకు గానీ తరలించాలి. పంట రవాణా లోడింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పంట అమ్మకం సమయంలో మార్కట్ యార్డ్‌లు, వేలం వేదికల వద్ద కూడా వైరస్ సంక్రమణ జరగకుండా తగిన వ్యక్తిగత భద్రత చర్యలను పాటించాలి. విత్తనోత్పత్తి రైతులు తమ ఉత్పత్తులను విత్తన కంపెనీలకు రవాణా చేసుకొనేందుకు గాను సర్కారు ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. అయితే ఇందుకు గాను తగిన ఆధారాలను చూపాల్సి ఉంటుంది. దీనికి తోడు ఆయా కంపెనీల నుంచి పేమెంట్ తీసుకొనే వేళలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టమోటా, కాలీఫ్లవర్, ఆకుకూరలు, దోసకాయలతో పాటు ఇతర కూరగాయలను ప్రత్యక్షంగా మార్కెటింగ్ చేసుకోవడం లేదు సరఫరా చేసే సమయంలోనూ వైరస్ సంక్రమించకుండా పలు జాగ్రత్తలు చేపట్టడం తప్పనిసరి.
ఇంకా పొలాల్లో పెరుగుతున్న పంటల విషయంలో..
గోధుమలు పండించే చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఇప్పటికీ దీర్ఘకాలిక సగటు కంటే కూడా తక్కువగానే ఉంది. కాబట్టి ఈ నెల 10 దాటిన తరువాత కనీసం 10-15 రోజుల తరువాత గానీ ఈ పంట పూర్తిస్థాయిలో కొతకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రైతులకు
ఎటువంటి నష్టం జరుగకుండా గోధుమ పంట కోతను ఏప్రిల్ 20 వరకు ఆలస్యం చేసే వెసులుబాటు లభించనుంది. ఇలా ఆలస్యం చేయడం పంటను సమీకరించేందుకు వచ్చిన పంటను మార్కెట్లకు చేర్చేందుకు గాను తగిన రవాణా సౌకర్యాలు కూడా విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంట ఎదిగే దశలో వివిధ శిలీంద్రాల దాడి కారణంగా దక్షిణాది రాష్ర్టాల్లో వరి విస్తృతంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో శిలీంద్ర సంహారిణిని పిచికారీ చేసేటప్పడు కాంట్రాక్ట్ పిచికారీదారులు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
మెడ పేలుడు సంభవించడం, కాంట్రాక్ట్ స్ప్రేయర్లు / రైతులు సిఫార్సు చేసిన శిలీంద్ర సంహారిణిని పిచికారీ చేసేటప్పుడు తీసుకోవలసిన తగిన జాగ్రత్తలు, దక్షిణాది రాష్ట్రాల్లో ధాన్యం నింపే దశలో
ఉన్న రబీ వరి విస్తృతంగా ప్రభావితమవుతుంది. వరి కోత దశలో అవాంచీయ వర్షాలు కురిస్తే విత్తన అంకురోత్పత్తిని నివారించేందుకు గాను 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మామిడి వంటి ఇతర ఫలాలు కోత దశకు చేరిన నేపథ్యంలో ఉద్యాన పంటలలో పోషక స్ర్పేలు మరియు పంట రక్షణకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ కాలంలో రైతులతో పాటు వ్యవసాయ రంగానికి వర్తించేలా భారత ప్రభుత్వం వివిధ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం లాక్డౌన్ కాలంలో ఈ కింది కార్యకాలాపాలకు మినహాయింపు కల్పించబడింది..
లాక్డౌన్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వ్యవసాయోత్పత్తుల సేవకరణ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఏజెన్సీలు, వ్యవసాయోత్పాదక మార్కెట్ కమిటీలు నిర్వహించే ఎంఎస్పీ కార్యకలాపాల మండీలు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ నోటిఫికేషన్ ప్రకారం ప్రకటించిన వివిధ రకాల రైతులు మరియు వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన కస్టమ్ నియామక కేంద్రాలు, ఎరువులు, పురుగుల మందులు, విత్తన తయారీ, ప్యాకేజింగ్ కార్యకలాపాలు నిర్వహించే యూనిట్లు, ఉద్యాన పంటల పనిముట్లు, యంత్రాల అమ్మకపు కేంద్రాలు, ఆయా రాష్ర్టాలలోనూ, రాష్ర్టాల మధ్య వ్యవసాయోత్పత్తుల రవాణా, పశువుల దవాఖానాలు తదితర కార్యకలాపాలకు సర్కారు మినహాయింపునిచ్చింది. భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గనిర్ధేశకాల మేరకు ఆయా ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ మార్గదర్శకాలను జారీ చేశాయి.
(Release ID: 1609779)
Visitor Counter : 378