నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

"కోవిడ్-19 లాక్ డౌన్ కాలంలో అప్రెంటీస్ లందరూ తమ పూర్తి స్టైపెండ్ పొందుతారు": డాక్టర్ మహేంద్రనాథ్ పాండే.

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2020 3:21PM by PIB Hyderabad

·       అన్ని సంస్థలు డిజిగ్నేటెడ్ మరియు ఆప్షనల్ ట్రేడ్ రెండింటిలో నియమితులైన అప్రెంటీస్ లకు వర్తించే పూర్తి స్టైపెండ్ ను చెల్లించాలి. 

 

·  లాక్ డౌన్ కాలానికి సంబంధించి ఎన్.ఏ.పి.ఎస్. కింద సంస్థలకు తిరిగి చెల్లించవలసిన స్టైపెండ్ ను ప్రభుత్వం ఎన్.ఏ.పి.ఎస్. మార్గదర్శకాల ప్రకారం చెల్లిస్తుంది.  

 

 

నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ చిత్తశుద్ధి లో భాగంగా, ప్రజలకు పూర్తి మద్దతుగా, అన్ని సంస్థలు డిజిగ్నేటెడ్ మరియు ఆప్షనల్ ట్రేడ్ లలో తమ వద్ద నియమితులైన అప్రెంటీస్ లకు పూర్తి స్టైపెండ్ ను చెల్లించాలని, నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రెప్రెన్యూర్ షిప్ (ఎమ్.ఎస్.డి.ఈ) మంత్రిత్వశాఖ ఈ రోజు తెలియజేసింది.  అదనంగా, లాక్ డౌన్ కాలానికి సంబంధించి జాతీయ అప్రెంట్ షిప్ ప్రోత్సాహక పధకం (ఎన్.ఏ.పి.ఎస్.) కింద సంస్థలకు తిరిగి చెల్లించవలసిన స్టైపెండ్ ను ప్రభుత్వం ఎన్.ఏ.పి.ఎస్. మార్గదర్శకాల ప్రకారం చెల్లిస్తుంది. 

 

 

అప్రెంటిసీస్  చట్టం, 1961 మరియు అప్రెంట్ షిప్ నియమాల ప్రకారం - తాను శిక్షణ తీసుకుంటున్న సంస్థలో తన ప్రమేయం లేకుండా సమ్మె లేదా లాక్ అవుట్ లేదా లే ఆఫ్ కారణంగా ఒక ట్రేడ్ అప్రెంటీస్ తన అప్రెంట్ షిప్ శిక్షణా కాలాన్ని పూర్తి చేయలేక పోతే,  అతని అప్రెంట్ షిప్ శిక్షణా కాలం సమ్మె లేదా లాక్ అవుట్ లేదా లే ఆఫ్ వీటిలో ఏదైతే ఆ కాలానికి సమానమైన కాలం పొడిగింపబడుతుంది. అదేవిధంగా, సమ్మె లేదా లాక్ అవుట్ లేదా లే ఆఫ్ కాలానికి లేదా ఆరు నెలల కాలానికి, వీటిలో ఏది తక్కువైతే అంత కాలానికి స్టైపెండ్  చెల్లించాలి. 

 

 

 

నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, "మనమందరం ముందుకు వచ్చి ఒకరి కొకరు పూర్తిగా సహకరించుకోవలసిన సమయం ఇది. గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కూడా  ఒకరి కొకరు సానుభూతితో వ్యవహరించాలని వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు. అందువల్ల, దేశ ఉత్పాదక శక్తిగా నిలిచే యువత ధైర్యాన్ని కోల్పోకుండా మనం అన్ని విధాలా వారికి సహాయపడాలి.  ఈ నేపథ్యంలో, కోవిడ్-19 లాక్ డౌన్ కాలంలో అప్రెంటీస్ లు  తమ స్టైపెండ్ పొందే విధంగా మనం చూడాలి.  ఈ విషయంలో సంస్థలన్నీ పూర్తి నిబద్ధతను చూపాయి.  ఇటువంటి కీలక సమయంలో సేవలన్నీ సక్రమంగా కొనసాగేవిధంగా అవి ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి." అని పేర్కొన్నారు.  

 

 

యువత పాఠశాల మరియు కళాశాల నుండి పని వాతావరణంలోకి సులువుగా మారడానికి వీలుగా వారికి సాధికారత కల్పించడానికి అప్రెంటిషిప్ ఒక సమర్ధవంతమైన మార్గంగా గుర్తించబడింది. అదే సమయంలో, పరిశ్రమలకు, శిక్షణా సంస్థలకు మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది.  భారతదేశ కార్మికశక్తికి నైపుణ్యాన్ని మెరుగుపరచడంలోనూ, యజమానులు, వ్యక్తులు, ప్రభుత్వం వంటి వివిధ పార్టీల మధ్య వ్యయాలను పంచుకోడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వాలు, యాజమాన్యాలు, కార్మికులు భాగస్వాములు కావడానికి జాతీయ అప్రెంటిషిప్ కార్యక్రమం ముఖ్య భూమిక పోషిస్తోంది. పరిశ్రమలు, యువత కలిసి ముందుకు వచ్చి భవిష్యత్తులో " నైపుణ్య భారత్ " కలను సాకారం చేసి, ఇరుపక్షాలకు విజయం చేకూర్చే కార్యక్రమమే - ఈ అప్రెంటిషిప్ కార్యక్రమం.   

 

 

*****


(రిలీజ్ ఐడి: 1609759) సందర్శకుల సూచీ సంఖ్య : : 183
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , हिन्दी , Assamese , Marathi , Bengali , Punjabi , Odia , Tamil