సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 కారణంగా నెలకొన్న అత్యవసర ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో దివ్యాంగుల రక్షణ మరియు భద్రత కోసం సమగ్ర మార్గదర్శకాల అమలుకై వికలాంగుల రాష్ట్ర కమీషనర్లకు వికలాంగుల సాధికారత శాఖ ఆదేశాలు
प्रविष्टि तिथि:
31 MAR 2020 5:08PM by PIB Hyderabad
పత్రికా సమాచార కార్యాలయం, ఢిల్లీ ద్వారా 2020 మార్చి, 31వ తేదీన సాయంత్రం 5 గంటల 8 నిముషాలకు పోస్టు చేయబడింది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న అత్యవసర ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో దివ్యాంగుల రక్షణ మరియు భద్రత కోసం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ కు చెందిన వికలాంగుల సాధికారత శాఖ 2020 మార్చి, 26వ తేదీన జారీచేసిన సమగ్ర మార్గదర్శకాల అమలుకై అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్ర వికలాంగుల కమీషనర్లకు డి.ఈ.పి.డబ్ల్యు.డి. ఆదేశాలు జారీ చేసింది - సంరక్షకులకు, ప్రభుత్వేతర సంస్థలు / దివ్యాంగులకు పాసుల జారీ.
ఈ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర / జిల్లా విపత్తు యాజమాన్య అధికారులు, ఆరోగ్యం మరియు చట్టాల అమలు అధికారులు వంటి సంబంధిత అధికారుల సమన్వయంతో రాష్ట్రాల కమీషనర్లు రాష్ట్ర నోడల్ అధికారులుగా వ్యవహరించాలని ఆదేశించారు. లాక్ డౌన్ కాలంలో దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడానికి వీరు కృషి చేస్తారు. పైన పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర కమీషనర్లు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.
ఈ మార్గదర్శకాల ప్రకారం - (ఏ) లాక్ డౌన్ సమయంలో అవసరాలకోసం దివ్యాంగల సంరక్షకులకు స్థానిక కదలికల కోసం ప్రాధాన్యతతో సరళీకృత విధానంలో పాసులు జారీ చేయవలసి ఉంటుంది. మరియు (బి) దివ్యాంగులకు అవసరమైన ఆహారం, మంచి నీరు, మందులు అందుబాటులో ఉంచవలసిన అవసరం ఉంది. ప్రభుత్వేతర సంస్థలు, దివ్యంగుల సంఘాలు కూడా దివ్యంగుల రోజువారీ జీవనానికీ, అత్యవసర వస్తువులను సమకూర్చుకోడానికీ సహాయపడవలసి ఉంటుందన్న విషయాన్ని కూడా గమనించాలి. దివ్యాంగుల సహాయం కోసం సమకూర్చే సేవలు సజావుగా సాగేందుకు ఈ సంస్థలతో కలిసి పనిచేయవలసి అవసరం ఉంది.
ప్రభుత్వేతర సంస్థలు / దివ్యాంగల సంఘాలు / దివ్యాంగులకు ప్రయాణ పాసులు జారీ చేయక పోవడంతో, సంరక్షకుల సేవలు, పనివారి సేవలు పొందడంలో, అవసరమైన వస్తువులు పొందడంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి వికలాంగుల సాధికారత శాఖకు పిర్యాదులు అందుతున్నాయి. దివ్యాంగుల సంఘాలు / ప్రభుత్వేతర సంస్థలు / సంరక్షకులకు స్థానిక ప్రయాణ పాసుల జారీని క్రమబద్ధీకరించడం కోసం సంబంధిత అధికారులతో కలిసి పనిచేయవలసిందిగా అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన దివ్యాంగుల రాష్ట్ర కమిషనర్లను కోరడం జరిగింది. తద్వారా దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించడంలో జాప్యం లేకుండా చూడవచ్చు. ఈ విషయంలో స్థానికంగా చట్టాలను అమలు చేసే పోలీసులు / ఎస్.డి.ఎం.లు మొదలైన అధికారుల సహకారాన్ని తీసుకోవాలని కూడా కోరడమైనది. కోవిడ్-19 బారిన పడిన దివ్యాంగులైన రోగులు ఆసుపత్రుల నుండి, ఆరోగ్య పరిరక్షణ సంస్థల నుండి బయటకు వెళ్ళిపోకుండా తగిన ఏర్పాట్లు చేయవలసినదిగా వికలాంగుల సాధికారత శాఖను కోరడం జరిగింది.
*****
(रिलीज़ आईडी: 1609733)
आगंतुक पटल : 166